అష్టాదశ శక్తిపీఠాలు / Ashtadasa ShakthiPeetalu

అష్టాదశ శక్తిపీఠాలు

ప్రద్యుమ్నే శృంఖలాదేవి

పూర్వం ఒడిశా మరియు బెంగాల్ ప్రాంతమును "వంగ " దేశం గా పిలిచేవారు. ఈ ప్రాంతము శక్తేయులకు నిలయంగా ఉండేది.  108 శక్తి పీఠాల్లో  చాల శక్తి పీఠాలు తూర్పు & పశ్చిమ బెంగాల్ ప్రాంతములోనే ఉన్నాయి.  వీటితో పాటు సిద్ధి పీఠాలు అనేకం.  ప్రద్యుమ్నే క్షేత్రం కూడ వంగ దేశం లో ఒక భాగం.  దీనిని నేడు " పాండువా " గా పిలుచు చున్నారు.  ఇది పశ్చిమ బెంగాల్  లోని హుగ్లీ జిల్లా  పరిధి లోనికి వస్తుంది.  నేడు పాండువా ప్రాంతములో  శృంఖలా శక్తి  కనిపించుట లేదు.  ప్రకృతి వైపరీత్యాలు లేదా మహ్మదీయల దండ యాత్రలు వలన ఆలయం కాల గర్భములో కలసి పోయి ఉండవచ్చును.

శృంఖలాదేవి: హుగ్లీ జిల్లా లోని పాండువా ప్రాంతములో శృంఖలాదేవి ఆలయం ఉండేది అని  కొంత మంది భక్తుల నమ్ముతున్నారు. ఒకప్పుడు ముస్లిమ్స్ పాలనలో పాండువా ప్రాంతము ఉండేది. ప్రాచీన శృంఖలాదేవి దేవాలయంను ముస్లిమ్స్ అక్రమించి ఒక మసీదు నిర్మించారు. తర్వాత కాలములో హిందువులు జరిపిన మతపరమైన ఆందోళనలు వలన సివిల్ కోర్టు వారు వివాద ప్రాంగణము యొక్క చాల ఎత్తు గోడలపై ముళ్ల తీగతో కంచె వేయంచారు.  సకల మతస్థులకు వివాద ప్రాంగణ ప్రవేశించడం నిషేధించారు అని చెప్పుచుంటారు. ప్రాంగణము బయట నుంచి మహమ్మదీయుల మినార్ (టవర్) మరియు పురాతన మసీదు శిధిలాలు, ఆలయ శిధిలాలు చాడగలము.

చరిత్ర: పూర్వం పాండువా ప్రాంతము ఒక హిందూ రాజ్యం.  పాండువాలో పాండు అనే రాజు ఉండేవాడు. అతని రాజభవనం లోపల దేవతలు ఆశీర్వదించిన బావి, కొన్ని ఆలయాలు ఉండేవి. పాండు రాజు పాలనలో ఎక్కువ మంది హిందువులు  మరియు కొంతమంది ముస్లింలు నివసించేవారు. ఢిల్లీ బాద్షా తన మేనల్లుడు "షా సూఫీ" ని సైన్యానికి అధిపతిగా నియమించి పాండువా పై యుద్ధంకు పంపాతాడు. అతడు పాండు రాజుతో యుద్ధం చేస్తాడు.  ముస్లిం దళాలు పాండువా ను స్వాధీనం చేసుకున్నాయి. షా సూఫీ  పాండువాలో ఒక పెద్ద మసీదు కట్టించాడు. హిందూ రాజును ఓడించిన సందర్భముగా ఒక విజయ స్తంభాన్ని (మినారు) నిర్మించాడని స్థానికలు చెప్పుచుంటారు. చారిత్రాత్మకంగా పాండు రాజు ఉనికి మరియు శృంఖలా దేవి ఆలయం గురించి ఎటువంటి ఆధారాలు లేవు. భక్తియార్ ఖాల్జీ , ఒక టర్కిక్ ముస్లిం జనరల్, 1206 CEలో రాజు లక్ష్మణ్ సేన్‌ను ఓడించి , బెంగాల్‌ లోని పెద్ద భాగాలను ఢిల్లీ సుల్తానేట్‌లో  కలుపుకున్నాడు. ఒక స్వతంత్ర బెంగాల్ సుల్తానేట్ 1352లో ఏర్పడింది.  బెంగాల్ ప్రాంతాన్ని రెండు శతాబ్దాలపాటు పరిపాలించింది.  ప్లాసీ యుద్ధం (1757 జూన్ 23) బెంగాల్ నవాబు సిరాజ్ (మీర్జా మహమ్మద్), బ్రిటిష్ అధికారి రాబర్ట్ క్లైవ్ మధ్య జరిగింది. ప్లాసీ యుద్ధంలో రాబర్ట్ క్లైవ్  ‘సిరాజ్-ఉద్-దౌలా’ను ఓడించాడు. నాటి నుంచి భారతదేశం లోని బెంగాల్,  బ్రిటిష్ వాళ్లు అధికారాన్ని స్థాపించిన తొలి రాష్ట్రం అయింది. ఇది చరిత్ర చెప్పిన వాస్తవం.

ప్రస్తుతం ఈ స్థలం (మినార్) భారత పురావస్తు సంఘం రక్షణలో ఉంది, తలుపులు తాళం వేసి ఉన్నాయి. భద్రత కోసం ఆలయంలోకి ప్రవేశాన్ని నిషేధించినట్లు అధికారులు తెలిపారు. భవనం యొక్క ప్రధాన ద్వారంపై స్పష్టమైన విలక్షణమైన అంశాలు ఉన్నాయి. ఇది ఒకప్పుడు హిందూ దేవాలయానికి ప్రధాన ద్వారంగా స్ధానికులు చెప్పుచుంటారు. బహుశా శృంఖలా దేవి ద్వారం అయి ఉండవచ్చు.  ఇక్కడ ఆలయ శిథిలాలు ఉన్నాయి.  ప్రతి సంవత్సరం మాఘ మాసం (ఫిబ్రవరిలో) సందర్భంగా మినార్ ప్రాంగణంలో దాదాపు 30 రోజుల పాటు మేళ తాళ అనే పండుగను జరుపుకుంటారు, దీనికి స్థానిక హిందువులు మరియు ముస్లింలు హాజరవుతారు అని స్థానిక చెప్పుచుంటారు.  జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయి పర్యాటకులను పాండువా మినార్ ఆకర్షిస్తుంది.

*పశ్చిమ బెంగాల్ ప్రాంతములో శక్తి పీఠాలు & సిద్ధి పీఠాలు అనేకం. కలకత్తా నగరం నకు దక్షిణ దిశగా గంగా సాగర్ అను ఒక ద్వీపం కలదు.  ఇచ్చట హుగ్లీ నది (గంగా నది) సముద్రంలో కలుస్తుంది.  సంగమం ప్రాంతము నందు కపిల మహర్షి ఆశ్రమం  ఉంది.  దీనిని " ఆదినాథ" గా పిలుస్తారు.  సాగర్ సంగమం నందు ప్రతి మకర సంక్రాంతి సందర్భముగా " గంగా సాగర్ మేళ " గొప్ప వైభవంగా జరుగుతుంది.   కొంత మంది కపిల మహర్షి ఆశ్రమం నందలి అమ్మ వారిని శక్తి పీఠం గా ఆరాధించుతారు.

పశ్చిమ బెంగాల్ ప్రాంతములో  కాళీ ఘాట్, దక్షిణేశ్వరం, బ్రక్రేశ్వర్, బోల్పూర్ (శాంతినికేతన్), లాభపూర్ క్రేత్రం మొదలగు అనేక శక్తి పీఠాలు ఉన్నాయి.  వీటితో పాటు హెచ్చు సిద్ధి పీఠాలు కూడ కలవు.  హలిసహార్ కు సమీపం లో "తార పీఠ్" (సిద్ధి పీఠం) ముఖ్యమైనది. బెంగాలీయులు " తార పీఠ్ " క్షేత్రం ను హెచ్చుగా దర్శించుట జరుగుతుంది.  బీర్ఖం జిల్లా లోని రాంపూర్ హాట్ కు సమీపంలో తార పీఠ్ ఉంది.  గౌహతి రైలు మార్గం నందు రాంపూర్ హాట్ (RS) ఉంది.  అన్ని రైలు  ఆగుతాయి.  ఇక్కడ నుంచి తార పీఠ్ కు రవాణా సౌకర్యములున్నాయి.  వీటి మధ్య దూరం  10 కీ.మీ. కలకత్తా నగరం నకు 60 కీ.మీ దూరాన  

"పాండువా" ఉంది. కలకత్తా నుంచి బస్సులు పాండువాకు ఉంటాయి.

హౌరా - భద్రామన్ (Main line) రైలు మార్గంలో Pundooah Railway stston ఉంది. హౌరా - పాండువా మధ్య దూరం 61 Kms.  హౌరా నుంచి లోకల్ రైలు సహయం తో పాండువా చేరగలం. Pundooah నుంచి Minar దూరం 2 Kms.  ఆటోలు ఉంటాయి.  పాండువా గల శివాలయం లోని అమ్మ వారిని కొంత మంది శక్తి పీఠం గా ఆరాదించు చున్నారు.       

              

Pundooah google map

https://maps.app.goo.gl/64ZfRoqHVDmniXuw7

వీడియో https://fb.watch/g8Bndwcxku/

Book link: https://m.facebook.com/story.php?story_fbid=782772943414821&id=100050463670982&sfnsn=wiwspmo&mibextid=RUbZ1f

Web site: http://www.srirajarajeswaripeetham.com

Ashtadasa Shakti Peethas

Pradyumne Srinkhaladevi

WestBengal


Earlier Odisha and Bengal region was known as "Vanga" country. This area used to be home to the powerful. Most of the 108 Shakti Peethas are located in East & West Bengal region. Besides these there are many Siddhi Peethas.  Pradyumne Kshetra-Vanga is also a part of country. Today it is called as "Pandua". It falls under Hooghly district of West Bengal. Today there is no chain of power in the Pandua region. The temple may have been buried in the womb of time due to natural calamities or Muhammadan expeditions.


Srinkhaladevi: Some devotees believe that there was a temple of Srinkhaladevi in ​​Pandua region of Hooghly district. Pandua region was once under the rule of Muslims. The ancient Srinkhaladevi temple was encroached upon by the Muslims and a mosque was built. Later, due to religious agitation by Hindus, the Civil Court fenced off the high walls of the court premises with barbed wire. It is said that all religious people are forbidden to enter the dispute premises.From outside the premises we can see the Muhammadan minar (tower) and the ruins of an ancient mosque and temple.


History: Formerly the Pandua region was a Hindu kingdom. In Pandu there was a king named Pandu. Inside his palace was a well blessed by the gods and some temples. During the rule of King Pandu there were mostly Hindus and few Muslims.


The Badshah of Delhi appoints his nephew "Shah Sufi" as the head of the army and sends him to war against Pandua. He fights with King Pandu. Muslim forces captured Pandua. Shah Sufi built a large mosque in Pandua. Locals say that a victory pillar (Minaru) was built on the occasion of defeating a Hindu king. Historically there is no evidence of the presence of King Pandu and the temple of Srinkhala Devi.Bakhtiyar Khalji, a Turkic Muslim general, defeated King Lakshman Sen in 1206 CE and annexed large parts of Bengal to the Delhi Sultanate. An independent Bengal Sultanate was formed in 1352. Ruled the region of Bengal for two centuries. Battle of Plassey (23 June 1757) Nawab Siraj (Mirza Muhammad) of Bengal,It happened between the British officer Robert Clive. Robert Clive defeated 'Siraj-ud-Daula' in the Battle of Plassey. Since then, Bengal in India became the first state to be established by the British. This is a fact of history.


Currently this place (Minar) is under the protection of Archaeological Society of India, the doors are locked. Officials said entry into the temple was prohibited for security reasons. The main entrance of the building has clear distinctive features. Locals say that it was once the main gate of a Hindu temple. Perhaps it was Srinkhala Devi Dwaram. There are ruins of a temple here. Every year during the month of Magha (in February) a festival called Mela Tala is celebrated in the Minar premises for about 30 days, which is attended by local Hindus and Muslims, locals say. Pandua Minar attracts national and international level tourists.


* There are many Shakti Peethas & Siddhi Peethas in West Bengal region. To the south of the city of Calcutta there is an island called Ganga Sagar. Here the river Hooghly (River Ganges) joins the sea. Kapila Maharshi Ashram is located in Sangam area. It is called "Adinatha". "Ganga Sagar Mela" is held in great splendor on the occasion of every Makar Sankranti at Sagar Sangam. Some people worship Amma in Kapila Maharshi Ashram as Shakti Peetha.


There are many Shakti Peethas in West Bengal region like Kali Ghat, Dakshineswaram, Brakreshwar, Bolpur (Santiniketan), Labhapur Kretram etc. Along with these there are high Siddhi Peethas. "Tara Peeth" (Siddhi Peeth) near Halisahar is important. "Tara Peeth" is highly visited by Bengalis. Tara Peeth is located near Rampur Hat in Birkham district. Rampur Hot (RS) is located on Guwahati railway line. All trains stop. From here there are transport facilities to Tara Peeth. The distance between them is 10 km. 60 km from Calcutta city

"Pandua" is there. There are buses from Calcutta to Pandua.


Pundooah Railway station is located on Howrah - Bhadraman (Main line) railway line. Distance between Howrah - Pandua is 61 Kms. Pandua can be reached by local train from Howrah. Distance from Pundooah to Minar is 2 Kms. There are autos. Amma in the Shiva temple of Pandua is worshiped by some people as Shakti Peetha.


Pundooah google map

https://maps.app.goo.gl/64ZfRoqHVDmniXuw7

వీడియో https://fb.watch/g8Bndwcxku/

Book link: https://m.facebook.com/story.php?story_fbid=782772943414821&id=100050463670982&sfnsn=wiwspmo&mibextid=RUbZ1f

Web site: http://www.srirajarajeswaripeetham.com