గమనిక: దైవదర్శనం కొరకు యాత్రికులు కనీసం ఒక రోజు ముందుగా అర్చకస్వామితో సంప్రదించండి. ప్రతి ఏట కొన్ని ఆలయాలలో అర్చక స్వాములు వంతులువారిగా మారుతుంటారు.

గుడిగళ్ళభాగ గ్రామం / GUDIGALLABHAGA VILLAGE

శ్రీ పార్వతీ సమేత మార్కండేయ స్వామి

మీన రాశి, ఉత్తరాబాద్ర నక్షత్రం (3వ పాదం)


పాద శివలింగ స్ధానం: చాళుక్యుల భీమ మండలం నందలి ద్రాక్షారామ క్షేత్రానికి ఆగ్నేయం దిశగా సుమారు 9 Kms. దూరాన గుడిగళ్ళభాగ (Gudigalla Bhaga) అను గ్రామం కలదు. ఇచ్చట శ్రీ మార్కండేయ లింగమును దర్శించగలము. శ్రీ పార్వతీ సమేత మార్కండేయ స్వామి వారి ఆలయం ఉత్తరాబాద్ర నక్షత్రం (3వ పాదం) చెందినది. శ్రీ మార్కండేయ లింగము భీమసభ నందలి 108 శివ లింగాలలో ఒకటిగా ప్రతీతి.

ఆలయం: శ్రీ పార్వతీ సమేత మార్కండేయ వారి ఆలయం చాల ప్రాచీనమైనది. కాల క్రమములో ఆలయం పునర్నిర్మాణము జరిగింది. ఆలయ ప్రాంగణములో ధ్వజస్ధంభం, గణపతి, కుమారస్వామి, చండీశ్వరుడు, నవగ్రహములు, ముఖమండపం, గర్భాలయం ఉంటాయి. ఆలయ గోపుర శిఖరము నందు దేవతా మూర్తులు కలరు. శ్రీ మార్కండేయ లింగం కి నిత్య అర్చనలు జరుగుతాయి. శ్రీ పార్వతీ సమేత మార్కండేయ స్వామి వారి కళ్యాణోత్సవములు ఫాల్గుణ శుద్ధ దశమి నుండి పాంచాహ్నికంగా జరుగుతుంది. శరన్నవరాత్రులు, గణపతి నవరాత్రులు నిర్వ హించబడతాయి. మీన రాశి జాతకులు, క్షేత్రం లోని శివాలయంలో అర్చన, అభిషేకములు భక్తితో నిర్వర్తించిన యెడల విశేష ఫలితములు పొందగలరని భక్తజనుల విశ్వాసము.

రవాణా సమాచారం: ద్రాక్షారామం నుంచి యానాం బస్సులు (Via) ఎర్ర పోతవరం, బాలాంత్రం, ఇంజరం మీదగా ప్రతి గంటకు ఉంటాయి. ద్రాక్షారామం నకు సుమారు 4 Kms. దూరంలో ఎర్ర పోతవరం బస్ స్టాప్ ఉంటుంది. ఎర్ర పోతవరం బ్రిడ్జి దిగువ నుంచి గుడిగళ్ళభాగ గ్రామం నకు ఆటోలు ఉంటాయి. వీటి మధ్య దూరం సుమారు 4 Kms.

రవాణా సమాచారం: బాలాంతరము నుంచి గుడిగళ్ళభాగ గ్రామం నకు ఆటోలు ఉంటాయి. వీటి మధ్య దూరం సుమారు 3 Kms.

అర్చక స్వామి: ఆలయ అర్చకస్వామి శ్రీ కాళ్ళకూరి శివరామకృష్ణ ప్రసాద్ శర్మ, 95536 45066 సంప్రదించగలరు. ఇతర అర్చకులు శ్రీ కాళ్ళకూరి చంద్రమౌళి శర్మ - 90105 36030 & శ్రీ కాళ్ళకూరి సర్వేశ్వర రావు, సెల్ నెం: 95537 53735.

విజ్ఞప్తి: ద్రాక్షారామ - శ్రీ భీమేశ్వరాలయం యొక్క ఉత్తర ముఖద్వారం వద్ద శ్రీ రాజ రాజేశ్వరి పీఠం వారి నిత్యాన్నదానం సత్రం కలదు.దూర ప్రాంతములు నుంచి ఆలయాలు సందర్శనకు వచ్చిన యాత్రికులకు ఉచ్చిత అన్న ప్రసాదములు వితరణ జరుగును. భక్తులు ముందుగా అన్నప్రాసాదం కోసం ఫోనులో సంప్రాదించాలి.

వీరి Cell 83320 29544.

వీరు వాహనములు కూడ ఏర్పాటు చేస్తారు.

పూర్వాభాద్ర నక్షత్రం స్తోత్రం

తనో హిర్బుద్ధన్య నృణోత్వజ ఏకపాత్‌ పృథివీ సముద్ర:|

విశ్వేదేవారుతా వృధోహు వానా స్తుతా మంత్రా కవి శస్తా అవంతు||

రోజూ 11 సార్లు పఠించటం వల్ల సర్వశుభాలు కలుగుతాయి.