గమనిక: దైవదర్శనం కొరకు యాత్రికులు కనీసం ఒక రోజు ముందుగా అర్చకస్వామితో సంప్రదించండి. ప్రతి ఏట కొన్ని ఆలయాలలో అర్చక స్వాములు వంతులువారిగా మారుతుంటారు.

వెంటూరు గ్రామం / VENTURU VILLAGE

శ్రీ పార్వతి సమేత సోమేశ్వర స్వామి

తులరాశి, స్వాతి నక్షత్రం (4వ పాదం)

అష్ట సోమేశ్వరాలయాలు (పశ్చిమ క్షేత్రం)

పాద శివలింగ స్ధానం: చాళుక్యుల భీమ మండలం నందలి ద్రాక్షారామ క్షేత్రానికి పశ్చిమ దిశగా, సుమారు 14 kms. దూరాన, వెంటూరు (Venturu) గ్రామం కలదు. రామచంద్రపురం - ప్రామర్రు రోడ్డులో వెంటూరు గ్రామం ఉంటుంది. క్షేత్రం నందు శ్రీ సోమేశ్వరాలయం కలదు. శ్రీ సోమేశ్వర లింగము భీమసభ నందలి 108 శివ లింగాలలో ఒకటిగా ప్రతీతి.

ఆలయం: శివుని దర్మపత్ని యగు సతిదేవి తండ్రి దక్షప్రజాపతి. ఇతడు వినాస బుద్ధి తో పరమేశ్వరుడుని కించపరుటకు ఒక యజ్ఞం ప్రారంభించుతాడు. ఆ యజ్ఞ వాటిక 'దక్షరామ' గా ప్రసిద్ధికెక్కింది. కాలక్రమేణ ద్రాక్షారామ గా వాడుకలోకి వచ్చింది. వ్యాస కాశీగా ద్రాక్షారామనికి ప్రశస్తి ఉంది. దక్షిణ కాశీగా పిలువబడే ద్రాక్షారామ క్షేత్రం నందలి శ్రీ భీమేశ్వర లింగము స్వయంభూమూర్తి. ముందుగా సూర్య భగవానుడు ఆరాధించినాడు. ఆ రుద్రమూర్తిని శాంతపరచేందుకు ద్రాక్షారామ క్షేత్రం చుట్టూ ఎనిమిది సోమేశ్వర (చంద్ర) ఆలయాలను ఋషులు ప్రతిష్టించారు. చంద్రుడిని సోముడు అని పిలుస్తారు. వీటిని అష్టసోమేశ్వరాలయాలు అని అంటారు. ఇవి ద్రాక్షారామం పరిసరాల్లోనే ఉంటాయి. ద్రాక్షారామ క్షేత్రం నకు పశ్చిమ దిశలో గల వెంటూరు గ్రామములో సోమేశ్వర లింగము ఉంది. ఇచ్చట శ్రీ పార్వతి సమేత సోమేశ్వర స్వామిని దర్శించగలము. వెంటూరు గ్రామంలో శ్రీ సోమేశ్వరాలయం మరియు శ్రీ కేశవ స్వామి ఆలయం ఒకే ప్రాంగణములో ఉంటాయి. శివ-కేశవులకు ధ్వజస్ధంభాలు వేరు వేరుగా ఉంటాయి.

ఆలయ సమూహం విశాలముగా ఉంటుంది. ఆలయ ప్రాంగణములో ప్రధానాలయం తూర్పు అభిముఖముగా ఉంటుంది. ప్రధానాలయం తో పాటు శ్రీ దేవి - భూ దేవి సమేత శ్రీ కేశవ స్వామి ఆలయం, శ్రీ వల్లీ - దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయం కలవు. ప్రధానాలయం నకు ఉత్తర భాగములో శ్రీ చండీశ్వర స్వామి, నవగ్రహములు కూడ ఉన్నాయి. ప్రధానాలయం నందు శ్రీ సోమేశ్వర లింగము దర్శనమిస్తుంది. అంతరాళయం నందు గణపతి, పార్వతి, ఉత్సవమూర్తులు, నందీశ్వరుడు కొలువై ఉంటారు. స్వామి వారి గర్భాలయం నకు ఎడమ భాగం (ఉత్తరం వైపు) పార్వతి అమ్మవారి సన్నిధి మరియు కుడి భాగం (దక్షిణ వైపు) గణపతి సన్నిధి ఉంటాయి. ముఖ మండపం నందు రాతి నందిని చూడగలము. ప్రధానాలయం నకు ముందు భాగమున (తూర్పు) ధ్వజస్తంభము, ప్రవేశ ద్వారం ఉంటుంది. ప్రధానాలయం నకు దక్షిణ వైపు శ్రీ దేవి - భూ దేవి సమేత శ్రీ కేశవ స్వామి ఆలయం తూర్పు అభిముఖంగా ఉంటుంది. విష్ణ్వాలయం నకు కూడ ధ్వజస్తంభము, ప్రవేశ ద్వారం ఉంటాయి. శ్రీ కేశవ స్వామి & శ్రీ సోమేశ్వర స్వామి వారి కళ్యాణం ఏక కాలములో జరుగుతాయి.

శివాలయం నకు ఉత్తరం వైపు శ్రీ వల్లీ - దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయం మరియు ధ్వజస్తంభము ఉంటాయి. సుబ్బారాయుడు షష్టి సందర్భముగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణం నిర్వహించుతారు.

శ్రీ పార్వతి సమేత సోమేశ్వర లింగమును అర్చించిన వారికి సకల శుభములు కలుగును అని భక్తుల విశ్వాసం. స్వామి కృపతో సుఖ, సంతోష, ఆయురోగ్య, విజయ, ఐశ్వర్య, భోగ భాగ్యములు కలుగుతాయి. ఆలయం నందు ప్రతి నిత్యం అర్చనలు, అభిషేకాలు, శాంతులు జరుగుతాయి. వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు శివ-కేశవులకు ఏక కాలములో కళ్యాణ ఉత్సవాలు పాంచాహ్నికంగా నిర్వహించుతారు. మహా శివరాత్రి సందర్భముగా సోమేశ్వర లింగము నకు విశేష అభిషేకాలు జరుగుతాయి. రాత్రికి లింగోద్భవ సమయంలో లక్ష పత్రి పూజ నిర్వహించుతారు. ప్రతి మాసశివరాత్రికి కూడ లక్ష పత్రి పూజ జరుగుతుంది. ఆలయం నందు కార్తీక మాసంలో విశేష పూజలు, అభిషేకాలు & లక్ష పత్రి పూజ జరుగుతాయి. గణపతి నవరాత్రులు, శరన్నవరాత్రులు విశేషముగా ఉంటుయి. సుబ్బారాయుడు షష్ఠి దర్శనాలు విశేషముగా జరుగుతాయి.

శ్రీ సోమేశ్వర లింగము, స్వాతి రాశి లింగము చెందినది. తులరాశి, స్వాతి నక్షత్రం (4వ పాదం) నందు జన్మంచిన శిశువు దోషం నకు ఉపశమనం (ఊరట) కొరకు అభిషేక శాంతులు నిర్వహించుతారు.

రవాణా సమాచారం: ద్రాక్షారామం నకు వాయువ్య దిశగా, సుమారు 6 kms. దూరంలో రాజగోపాల సెంటర్ (రామచంద్రపురం) ఉంటుంది. ద్రాక్షారామం నుంచి బస్సులు / ఆటోలు దొరుకుతాయి.

రవాణా సమాచారం: రాజగోపాల సెంటర్ నుంచి రామచంద్రపురం మార్కెట్టు సెంటర్ కు ఆటోలు దొరుకుతాయి. వీటి మధ్య దూరం సుమారు 01 కీ.మీ

రవాణా సమాచారం: రామచంద్రపురం (మార్కెట్టు సెంటర్) నుంచి పామర్రు ఆటోలు (వయా) ముచ్చిమిల్లి, వెంటూరు మీదగా ఉంటాయి. రామచంద్రపురం మార్కెట్టు సెంటర్ నుంచి వెంటూరు దూరం సుమారు 05 కీ.మీ

రవాణా సమాచారం: ద్రాక్షారామం - కోటిపల్లి బస్సులు (వయా) కె.గంగవరం మీదగా ఉంటాయి. కె.గంగవరం నుంచి పామర్రు & పామర్రు నుంచి వెంటూరు మధ్య ఆటోలు ఉంటాయి.

అర్చక స్వామి: ఆలయ సమాచారం & Photos అందించిన వెంటూరు - శ్రీ పార్వతీ సమేత సోమేశ్వరాలయ ఆలయ అర్చక స్వామి శ్రీ మద్దిరాల సాయికిరణ్,

సెల్ నెం. 9505540807 గార్కి నా నమసుమాంజలి.

విజ్ఞప్తి: ద్రాక్షారామ - శ్రీ భీమేశ్వరాలయం యొక్క ఉత్తర ముఖద్వారం వద్ద శ్రీ రాజ రాజేశ్వరి పీఠం వారి నిత్యాన్నదానం సత్రం కలదు. దూర ప్రాంతములు నుంచి ఆలయాలు సందర్శనకు వచ్చిన యాత్రికులకు ఉచ్చిత అన్న ప్రసాదములు వితరణ జరుగును. భక్తులు ముందుగా అన్నప్రాసాదం కోసం ఫోనులో సంప్రాదించాలి.

వీరి Cell 83320 29544.

వీరు వాహనములు కూడ ఏర్పాటు చేస్తారు.

స్వాతి నక్షత్రం స్తోత్రం

క్యోయే తే సహస్రిణో స్థా సస్తే త్రిరాగది|

నియుత్వామ్‌ సోమ పీతయే||

రోజూ 11 సార్లు పఠించటం వల్ల సర్వశుభాలు కలుగుతాయి.

వీడియో వివరణ / Video Description

ఆడియో వివరణ / Audio Description