గమనిక: దైవదర్శనం కొరకు యాత్రికులు కనీసం ఒక రోజు ముందుగా అర్చకస్వామితో సంప్రదించండి. ప్రతి ఏట కొన్ని ఆలయాలలో అర్చక స్వాములు వంతులువారిగా మారుతుంటారు.

కోరుమిల్లి గ్రామం / KORUMILLI VILLAGE

శ్రీ రాజరాజేశ్వరీ సమేత సోమేశ్వర స్వామి

ధనుస్సు రాశి, పూర్వాషాడ నక్షత్రం (2వ పాదం)

అష్ట సోమేశ్వరాలయాలు (నైఋతి క్షేత్రం)


పాద శివలింగ స్ధానం: ద్రాక్షారామ క్షేత్రానికి నైఋతి దిశగా, సుమారు 21 kms. దూరాన, గోదావరి నదీ తీర ప్రాంతములో కోరుమిల్లి (Korumilli) అను గ్రామం కలదు. ఇచ్చట శ్రీ రాజరాజేశ్వరీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి ఆలయం ఉంది. ఇది అష్ట సోమేశ్వరాలయాలలో నైఋతి క్షేత్రంగా ప్రసిద్ధి చెందినది. కోరుమిల్లి శ్రీ సోమేశ్వర లింగము భీమసభ నందలి 108 శివ లింగాలలో ఒకటిగా ప్రతీతి. ధనుస్సురాశి, పుర్వాషాడ నక్షత్రం (2వ పాదం) నందు జన్మించిన వారికి నక్షత్ర శాంతులు అభిషేక రూపములో నిర్వహించుతారు. సోమేశ్వర స్వామి గొప్ప మహిమ గల వానిగా, నిత్యాభిషేకములతో విరాజిల్లుతూ భక్తుల కోరికలు తీరుస్తూ భక్త వత్సలుడైనాడు. స్వామి కృపతో సుఖ, సంతోష, ఆయురోగ్య, విజయ, ఐశ్వర్య, భోగ భాగ్యములు కలుగుతాయి.

ఆలయం: దక్షప్రజాపతి యజ్ఞం చేసిన 'దక్షవాటిక' ను ద్రాక్షారామగా పిలుస్తారు. లోక ఖ్యాతి పొందిన పంచారామాల్లో ద్రాక్షారామ క్షేత్రం ఒకటి. దక్షిణ కాశీగా పిలువబడే ద్రాక్షారామ క్షేత్రం నందలి శ్రీ భీమేశ్వర లింగము 'సూర్య యంత్ర' ప్రతిష్ట. ఆ రుద్రమూర్తిని శాంతపరచేందుకు ద్రాక్షారామ క్షేత్రం చుట్టూ ఎనిమిది 'చంద్ర యంత్ర' ప్రతిష్టలు జరిగినాయి. వీటిని సోమేశ్వర ఆలయాలుగా పిలుస్తారు. చంద్రుడిని సోముడు అని కూడ పిలుస్తారు. సోము ప్రతిష్ట శివాలయాలను అష్ట సోమేశ్వరాలయాలు అని అంటారు. ఇవి ద్రాక్షారామం పరిసరాల్లోనే ఉంటాయి. వీటి సందర్శనం వలన చంద్ర గ్రహ దోష నివృత్తి కలుగుతుంది. అష్ట సోమేశ్వర క్షేత్రాలను దర్శిస్తే, తప్పకుండా శివానుగ్రహం కలుగుతుంది అనే నమ్మకం భక్తులలో ఉంది. అష్ట సోమేశ్వరాలయాలల్లో కోరుమిల్లి గ్రామం లోని శ్రీ సోమేశ్వరాలయం ఒకటిగా ప్రతీతి. ద్రాక్షారామ క్షేత్రం నకు నైఋతి దిశలో కోరుమిల్లి గ్రామం ఉంటుంది.

కోరుమిల్లి గ్రామం లోని శ్రీ రాజరాజేశ్వరీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి ఆలయం చాల ప్రాచీనమైనది. కాల క్రమములో ఆలయం పునర్నిర్మాణము జరిగింది (2015). ఆలయ ప్రాంగణము చాల విశాలముగా ఉంటుంది. చక్కటి పచ్చని తోట ఆహ్లాదకరంగా అలరారుతూ ఉండును. ప్రధానాలయం పశ్చిమాభి ముఖముగా ఉంటుంది. ఆలయ ప్రాంగణ ప్రవేశం పశ్చిమ & తూర్పు ద్వారములు నుంచి జరుగుతుంది. ఆలయ ప్రాంగణములో ధ్వజ స్ధంబం, ప్రధానాలయం, చండీశ్వరుడు, కళ్యాణ మంపం మొదలగునవి ఉంటాయి. ముఖ మండపం నందు శృంగి-బృంగి అను ద్వారపాలకులు, నందీశ్వరుడు, శ్రీ రాజరాజేశ్వరీ అమ్మవారి సన్నిధి, శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి సన్నిధిలున్నాయి. అంతరాలయం నందు వినాయక మూర్తి కలరు. గర్భాలయం నందు శ్రీ సోమేశ్వర లింగము దర్శనమిస్తుంది. ఆలయం నందు ప్రతి నిత్యం అర్చనలు, అభిషేకాలు, శాంతులు నిర్వహించుతారు. స్వామి వారి కళ్యాణం ఫాల్గుణ శుద్ధ ఏకాదశి నాడు జరుగుతుంది. మహా శివరాత్రి సందర్భముగా విశేష అభిషేకాలు నిర్వహించుతారు. ఆలయం నందు కార్తీక మాసంలో విశేష పూజలు జరుగుతాయి. శరన్నవరాత్రులు, గణపతి నవరాత్రులు, సుబ్బారాయుడు షష్ఠి వేడుకులు వైభవంగా జరుగుతాయి. సుబ్బారాయుడు షష్ఠికి ముందు రోజు అనగా పంచమి నాడు సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణోత్సవాలు ఘనంగా నిర్వహించుతారు

క్షేత్రపాలకుడు శ్రీ జనార్ధన స్వామి. సోమేశ్వరాలయం నకు ఉత్తరం వైపున వైష్ణ్వాలయం తూర్పు అభిముఖముగా ఉంటుంది. శ్రీ దేవి - భూ దేవి సమేత శ్రీ జనార్ధన స్వామి సాధక ముద్రలో దర్శనమిస్తాడు. నవ జనార్ధనాలయలలో ఒకటిగా ప్రతితీ. ఆలయ ప్రాంగణములో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధి కూడ కలదు.

రవాణా సమాచారం: కాకినాడ - కోరుమిల్లి బస్సులు (Via) గొల్లపాలెం, ద్రాక్షారామం, కె. గంగవరం, టేకీ మీదగా ఉంటాయి. వీటి మధ్య దూరం సుమారు 34 Kms.

రవాణా సమాచారం: కాకినాడ - కోటిపల్లి బస్సులు (via) ద్రాక్షారామం, కె. గంగవరం మీదగా ఉంటాయి.

రవాణా సమాచారం: కె. గంగవరం నుంచి కోరుమిల్లికి ఆటోలు చాల తక్కువుగా ఉంటాయి.

రవాణా సమాచారం: మండపేట - కోరుమిల్లి బస్సులు (Via) అంగర, టేకీ మీదగా ఉంటాయి. వీటి మధ్య దూరం సుమారు 21 Kms.

రవాణా సమాచారం: మండపేట (కలువ పువ్వు సెంటర్) నుంచి అంగర గ్రామం నకు ఆటోలు దొరుకుతాయి. మండపేట నుంచి అంగర గ్రామం దూరం సుమారు 13 Kms. గా ఉంటుంది.

*అంగర నుంచి కోరుమిల్లి కి ఆటోలు దొరుకుతాయి. దూరం సుమారు 10 Kms. గా ఉంటుంది. ఆటోలు ఏర్పాట్టు చేసుకోవాలి.

రవాణా సమాచారం: కె. గంగవరం నుంచి అంగర ఆటోలు (vai) పామర్రు, టేకీ మీదగా ఉంటాయి. టేకీ నుంచి కోరుమిల్లి కి ఆటోలు దొరుకుతాయి. ఆటోలు రాను - పోను ఏర్పాట్టు చేసుకోవాలి

రవాణా సమాచారం: రావులపాలెం నుంచి యానాం నకు గోదావరి నదికి ఉత్తరం వైపు గల గట్టు పైన రోడ్డు మార్గము ఉంది. గోదావరి గట్టు మార్గం (via) కపిలేశ్వరపురం, కోరుమిల్లి, కూళ్ళ, కోటిపల్లి, పాత కోట మీదగా ఉంటుంది. ఈ మార్గములో ఆటోలు చాల తక్కువుగా ఉంటాయి. ఆటోలు ఏర్పాట్టు చేసుకోవాలి.

అర్చక స్వామి: నక్షత్ర శాంతి కోసం ఆలయ అర్చక స్వామి: శ్రీ పుసునూరి శరభేశ్వర రావు, సెల్ : 9553115219 సంప్రదించగలరు.

విజ్ఞప్తి: ద్రాక్షారామ - శ్రీ భీమేశ్వరాలయం యొక్క ఉత్తర ముఖద్వారం వద్ద శ్రీ రాజ రాజేశ్వరి పీఠం వారి నిత్యాన్నదానం సత్రం కలదు.దూర ప్రాంతములు నుంచి ఆలయాలు సందర్శనకు వచ్చిన యాత్రికులకు ఉచ్చిత అన్న ప్రసాదములు వితరణ జరుగును. భక్తులు ముందుగా అన్నప్రాసాదం కోసం ఫోనులో సంప్రాదించాలి.

వీరి Cell 83320 29544.

వీరు వాహనములు కూడ ఏర్పాటు చేస్తారు.

పూర్వాషాఢ నక్షత్రం స్తోత్రం

అపాఘమపి కిల్విష మపికృత్యామ పోరేప:|

అపాం మార్గ త్వమస్మదందు స్వపయసువ:||

రోజూ 11 సార్లు పఠించటం వల్ల సర్వశుభాలు కలుగుతాయి.