గమనిక: దైవదర్శనం కొరకు యాత్రికులు కనీసం ఒక రోజు ముందుగా అర్చకస్వామితో సంప్రదించండి. ప్రతి ఏట కొన్ని ఆలయాలలో అర్చక స్వాములు వంతులువారిగా మారుతుంటారు.
చింతపల్లి గ్రామం, CHINTAPALLI VILLAGE
శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి
సింహరాశి, పుబ్బ నక్షత్రం (1వ పాదం)
పాద శివలింగ స్ధానం: చాళుక్యుల భీమ మండలం నందలి ద్రాక్షారామ క్షేత్రానికి ఉత్తరం దిశగా, సుమారు 18 kms. దూరాన చింతపల్లి గ్రామం (Chintapalli) కలదు. రామచంద్రపురం - గొల్లల మామిడాడ రోడ్డు మార్గములో చింతపల్లి లాకులు ఉంటాయి. చింతపల్లి లాకులు కు ఈశాన్యం దిశగా, కరప పోవు రోడ్డు మార్గం లో చింతపల్లి గ్రామం ఉంటుంది. ఇచ్చట శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి ఆలయం కలదు. శ్రీ వీరేశ్వర లింగము భీమసభ నందలి 108 శివ లింగాలలో ఒకటిగా ప్రతీతి.
ఆలయం: చింతపల్లి గ్రామం లోని శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి ఆలయం చాల ప్రాచీనమైనది. నేటి ఆలయం పిఠాపురం మహారాజులు కాలం నాటిది. ఆలయం పశ్చిమాభి ముఖంగా ఉంటుంది. ఆలయ ప్రాంగణములో ధ్వజ స్ధంబం, ప్రధానాలయం, తులసి కోట, చండీశ్వరుడు, నాగ బంధం మొదలగునవి ఉంటాయి. ముఖ మండపం నందు నందీశ్వరుడు, వినాయకుడు, ద్వారపాలకులు ఉంటారు. అంతరాలయం నందు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి, గణపతి, ఉత్సవమూర్తులు కలరు. గర్భాలయం నందు శ్రీ వీరేశ్వర లింగము దర్శనమిస్తుంది. స్వామి వామ భాగం నందు శ్రీ భద్రకాళి దేవి కొలువుదీరింది. ఆలయం నందు ప్రతి నిత్యం అర్చనలు, అభిషేకాలు, శాంతులు నిర్వహించుతారు. స్వామి వారి కళ్యాణం ఫాల్గుణ బహుళ ఏకాదశి నాడు జరుగుతుంది. మహాశివరాత్రి కి విశేష అభిషేకాలు జరుగుతాయి. ఉగాది కి పుష్ప యాగం జరుగుతుంది. ఆలయం నందు కార్తీక మాసంలో విశేష పూజలు జరుగుతాయి. లక్షపత్ర పూజ మొదలగునవి నిర్వహించుతారు. కార్తీక మాసం నందలి పౌర్ణమి నాడు జ్వాలాతోరణం జరుగుతుంది. శరన్నవరాత్రులు, గణపతి నవరాత్రులు, సుబ్బారాయుడు షష్ఠి వేడుకులు వైభవంగా జరుగుతాయి. శ్రీ వీరేశ్వర లింగము, పుబ్బ నక్షత్రం (1వ పాదం) చెందినది. పుబ్బ నక్షత్రం (1వ పాదం) నందు జన్మించిన వారికి అభిషేక శాంతులు నిర్వహించుతారు.
రవాణా సమాచారం 1: ద్రాక్షారామం నకు వాయువ్య దిశగా, సుమారు 7 kms. దూరంలో రామచంద్రాపురం RTC బస్ స్టాండ్ ఉంటుంది. ద్రాక్షారామం నుంచి రామచంద్రాపురం నకు బస్సులు / ఆటోలు దొరుకుతాయి.
రవాణా సమాచారం 2: రామచంద్రాపురం బస్ స్టాండ్ నుంచి సామర్లకోట బస్సులు (Via) చింతపల్లి లాకులు, గొల్లల మామిడాడ మీదగా ఉంటాయి. ప్రయాణికుల అభ్యర్ధన బట్టి బస్సులు చింతపల్లి లాకులు వద్ద ఆగుతాయి. రామచంద్రాపురం నుంచి చింతపల్లి లాకులు దూరం 12 Kms. చింతపల్లి లాకులు నుంచి చింతపల్లి గ్రామం నకు రవాణా సౌకర్యములు ఉండవు. వీటి మధ్య దూరం సుమారు 01.5 Kms. మాత్రమే.
రవాణా సమాచారం 3: చింతపల్లి గ్రామం నకు సమీప రైల్వే స్టేషన్స్ సామర్లకోట జంక్షన్.
రవాణా సమాచారం 4: విశాఖపట్నం - విజయవాడ రైలు మార్గములో సామర్లకోట జంక్షన్ అను రైల్వే స్టేషన్ ఉంది. ఇక్కడ అన్ని ముఖ్య రైలు సర్వీసులు ఆగుతాయి. సామర్లకోట రైల్వే స్టేషన్ కు ఎదురుగా APSRTC బస్ స్టాండ్ ఉంటుంది. సామర్లకోట నుంచి రామచంద్రపురం కు బస్సులు బయులుదేరుతాయి. రామచంద్రపురం బస్సులు (Via) బిక్కవోలు, గొల్లల మామిడాడ. చింతపల్లి లాకులు, నరసాపురపు పేట, చోడవరం మీదగా ఉండును. కొన్ని బస్సులు (Via) బిక్కవోలు, గొల్లల మామిడాడ. చింతపల్లి లాకులు, మెళ్ళూరు, ఆరికిరేవుల, చోడవరం మీదగా ఉంటాయి. సామర్లకోట - చింతపల్లి లాకులు మధ్య దూరం సుమారు 24 Kms. గా ఉంటుంది. సామర్లకోట పట్టణం నందు యాత్రికులకు వసతులు ఉంటాయి. గొల్లల మామిడాడ నుంచి చింతపల్లి శివాలయం కు ఆటోలు దొరుకుతాయి. వీటిని రాను-పోను ఏర్పాట్టు చేసుకోవాలి. వీటి మధ్య దూరం సుమారు 04.5 Kms. గా ఉంటుంది.
అర్చక స్వామి: మాకు సహకరించిన చింతపల్లి అర్చక స్వామి శ్రీ వెలవలపల్లి సుబ్రహ్మణ్య శర్మ, సెల్ నెం. 99898 45988 గార్కి నా నమసుమాంజలి.
విజ్ఞప్తి: ద్రాక్షారామ - శ్రీ భీమేశ్వరాలయం యొక్క ఉత్తర ముఖద్వారం వద్ద శ్రీ రాజ రాజేశ్వరి పీఠం వారి నిత్యాన్నదానం సత్రం కలదు. దూర ప్రాంతములు నుంచి ఆలయాలు సందర్శనకు వచ్చిన యాత్రికులకు ఉచ్చిత అన్న ప్రసాదములు వితరణ జరుగును. భక్తులు ముందుగా అన్నప్రాసాదం కోసం ఫోనులో సంప్రాదించాలి.
వీరి Cell 83320 29544.
వీరు వాహనములు కూడ ఏర్పాటు చేస్తారు.
పుబ్బ నక్షత్రం స్తోత్రం
భగప్రాణోత్ భర్గ సత్య రాధో|
భగే మధియముదవాదదన్న భగయే ప్రణోజన యగోభి
రశ్వైర్భయ ప్రనృభి న్రై: వస్యామ్||
రోజూ 11 సార్లు పఠించటం వల్ల సర్వశుభాలు కలుగుతాయి.