గమనిక: దైవదర్శనం కొరకు యాత్రికులు కనీసం ఒక రోజు ముందుగా అర్చకస్వామితో సంప్రదించండి. ప్రతి ఏట కొన్ని ఆలయాలలో అర్చక స్వాములు వంతులువారిగా మారుతుంటారు.
ఆరికిరేవుల గ్రామం / ARIKIREVULA VILLAGE
శ్రీ అన్నపూర్ణా సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి
సింహరాశి, మఖ నక్షత్రం (3వ పాదం)
పాద శివలింగ స్ధానం: చాళుక్యుల భీమ మండలం నందలి ద్రాక్షారామ క్షేత్రానికి ఉత్తరం దిశగా, సుమారు 13 kms. దూరాన ఆరికిరేవుల గ్రామం (Aarikirevula) కలదు. రామచంద్రపురం - కాకినాడ రోడ్డు మార్గములో చోడవరం జంక్షన్ ఉంటుంది. చోడవరం నకు ఉత్తరం దిశ నందు గల తుల్యభాగ నదికి సమీపంలో ఆరికిరేవుల గ్రామం ఉంటుంది. చోడవరం జంక్షన్ నంచి ఆరికిరేవుల గ్రామం మీదగా బ్రాంచి రోడ్డు మార్గము కలదు. ఆరికిరేవుల ఊరుకు పశ్చిమ వైపున శ్రీ అన్నపూర్ణా సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి ఆలయం కలదు. శ్రీ విశ్వేశ్వర లింగము భీమసభ నందలి 108 శివ లింగాలలో ఒకటిగా ప్రతీతి.
ఆలయం: ఆరికిరేవుల గ్రామం లోని శ్రీ అన్నపూర్ణా సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి ఆలయం చాల ప్రాచీనమైనది. కాల క్రమములో ఆలయం పునర్నిర్మాణము జరిగింది. ఆలయ ప్రాంగణము చాల విశాలముగా ఉంటుంది. ఆలయ ప్రవేశం గాలిగోపురం మరియు ముఖద్వారం నుంచి జరుగుతుంది. ఆలయ ప్రాంగణములో ధ్వజ స్ధంబం, ప్రధానాలయం, శివకోటి స్తూపం, చండీశ్వరుడు, కాల భైరవ స్వామి సన్నిధి, అన్న సమారాధన సేవ కార్యక్రమాలు నిర్వహించుటకు హాల్ మొదలగునవి ఉంటాయి. ప్రతి సోమవారం అన్నసమారాధన జరుగుతుంది. ముఖ మండపం నందు నందీశ్వరుడు, వినాయకుడు, సుబ్బారాయుడు
(శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి) సన్నిధిలున్నాయి. అంతరాలయం నందు ఉత్సవమూర్తులు కలరు. గర్భాలయం నందు శ్రీ విశ్వేశ్వర లింగము దర్శనమిస్తుంది. స్వామి వామ భాగం నందు శ్రీ అన్నపూర్ణా దేవి కొలువుదీరింది. ఆలయం నందు ప్రతి నిత్యం అర్చనలు, అభిషేకాలు, శాంతులు నిర్వహించుతారు. స్వామి వారి కళ్యాణం వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు జరుగుతుంది.
శ్రీ విశ్వేశ్వర లింగము, మఖ నక్షత్రం (3వ పాదం) చెందినది. మఖ నక్షత్రం నందలి 3వ పాదము లో జన్మంచిన స్త్రీ వలన తల్లికి, పురుషుడు వలన తండ్రికి దోషం కలుగను. మఖ నక్షత్రం (3వ పాదం) నందు జన్మించిన వారికి శాంతులు నిర్వహించుతారు.
ఆలయం నందు కార్తీక మాసంలో విశేష పూజలు జరుగుతాయి. శరన్నవరాత్రులు, గణపతి నవరాత్రులు, సుబ్బారాయుడు షష్ఠి వేడుకులు వైభవంగా జరుగుతాయి. సుబ్బారాయుడు షష్ఠికి ముందు రోజు అనగా పంచమి నాడు సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణోత్సవాలు ఘనంగా నిర్వహించుతారు. ఆలయం నకు ఉత్తర భాగములో కోనేరు ఉంటుంది. ఆలయం పునః ప్రతిష్ట సందర్భముగా ఒక నాగ జంట కోనేరు గట్టు పైన అద్భుత నృత్యం చేశాయి అని స్ధానికులు చెప్పుచుంటారు.
నక్షత్ర శాంతి కోసం ఆలయ అర్చక స్వామి: శ్రీ యలమంచిలి లక్ష్మీ నరసింహమూర్తి, సెల్ నెం. 9010247494 సంప్రదించగలరు.
రవాణా సమాచారం 1: ద్రాక్షారామం నకు వాయువ్య దిశగా, సుమారు 7 kms. దూరంలో ద్రాక్షారామం - రామచంద్రాపురం జంక్షన్ ఉంటుంది. ద్రాక్షారామం నుంచి బస్సులు / ఆటోలు దొరుకుతాయి.
రవాణా సమాచారం 2: రామచంద్రాపురం బస్ స్టాండ్ నుంచి ఆరికిరేవుల గ్రామం కు బస్సులు చాల తక్కువుగా దొరుకుతాయి. ఆరికిరేవుల బస్ స్టాప్ కు పశ్చిమ దిశగా సుమారు 300 meters దూరంలో శివాలయం ఉంటుంది.
రవాణా సమాచారం 3: రామచంద్రాపురం నుంచి ఆరికిరేవుల గ్రామం నకు ఆటోలు రాను - పోను ఏర్పాట్టు చేసుకోవడం సౌక్యముగా ఉంటుంది. రామచంద్రాపురం - ఆరికిరేవుల మధ్య దూరం సుమారు 8 Kms,
రవాణా సమాచారం 4: ఆరికిరేవుల గ్రామం నకు సమీప రైల్వే స్టేషన్స్ సామర్లకోట జంక్షన్.
రవాణా సమాచారం 5: విశాఖపట్నం - విజయవాడ రైలు మార్గములో సామర్లకోట జంక్షన్ అను రైల్వే స్టేషన్ ఉంది. ఇక్కడ అన్ని ముఖ్య రైలు సర్వీసులు ఆగుతాయి. సామర్లకోట రైల్వే స్టేషన్ కు ఎదురుగా APSRTC బస్ స్టాండ్ ఉంటుంది. సామర్లకోట నుంచి రామచంద్రపురం కు బస్సులు బయులుదేరుతాయి. రామచంద్రపురం బస్సులు (Via) బిక్కవోలు, గొల్లల మామిడాడ. చింతపల్లి, నరసాపురపు పేట, చోడవరం మీదగా ఉండును.
రవాణా సమాచారం 6: కొన్ని బస్సులు (Via) బిక్కవోలు, గొల్లల మామిడాడ. చింతపల్లి, మెళ్ళూరు, ఆరికిరేవుల, చోడవరం మీదగా ఉంటాయి. సామర్లకోట - ఆరికిరేవుల మధ్య దూరం సుమారు 30 Kms. గా ఉంటుంది.
అర్చక స్వామి: ఆలయ సమాచారం & Photos అందించిన ఆరికిరేవుల - శ్రీ విశ్వేశ్వర స్వామి, ఆలయ అర్చక స్వామి అయిన శ్రీ యలమంచిలి లక్ష్మీ నరసింహమూర్తి,
సెల్ నెం. 9010247494 గార్కి నా నమసుమాంజలి.
విజ్ఞప్తి: ద్రాక్షారామ - శ్రీ భీమేశ్వరాలయం యొక్క ఉత్తర ముఖద్వారం వద్ద శ్రీ రాజ రాజేశ్వరి పీఠం వారి నిత్యాన్నదానం సత్రం కలదు. దూర ప్రాంతములు నుంచి ఆలయాలు సందర్శనకు వచ్చిన యాత్రికులకు ఉచ్చిత అన్న ప్రసాదములు వితరణ జరుగును. భక్తులు ముందుగా అన్నప్రాసాదం కోసం ఫోనులో సంప్రాదించాలి.
వీరి Cell 83320 29544.
వీరు వాహనములు కూడ ఏర్పాటు చేస్తారు.
మఖ నక్షత్రం స్తోత్రం
పితృభ్య: స్వధాయిభ్య: స్వధానమ:|
పితామహేభ్య: స్వధాయిభ్య: స్వధానమ:
ప్రపితామహేభ్య: స్వదాయిభ్య: స్వధానమ:
అక్షన్న పిత్రో మీమదంత పితరోతితృ పంత్ పితర:
పితర: శుంధ ధ్వమ్||
రోజూ 11 సార్లు పఠించటం వల్ల సర్వశుభాలు కలుగుతాయి.