గమనిక: దైవదర్శనం కొరకు యాత్రికులు కనీసం ఒక రోజు ముందుగా అర్చకస్వామితో సంప్రదించండి. ప్రతి ఏట కొన్ని ఆలయాలలో అర్చక స్వాములు వంతులువారిగా మారుతుంటారు.
మామిడాడ గ్రామం / MAMIDADA VILLAGE
శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి
కర్కాటకరాశి, ఆశ్రేష నక్షత్రం (4వ పాదం)
పాద శివలింగ స్ధానం: చాళుక్యుల భీమ మండలం నందలి ద్రాక్షారామ క్షేత్రానికి ఉత్తరం దిశగా, సుమారు 20 kms. దూరాన మామిడాడ గ్రామం (Mamidada) కలదు. రామచంద్రపురం - సామర్లకోట రోడ్డు మార్గములో గొల్లల మామిడాడ జంక్షన్ ఉంటుంది. గొల్లల మామిడాడ జంక్షన్ కు ఈశాన్యం దిశగా సుమారు 1.6 Kms. దూరంలో మామిడాడ గ్రామం చెరువు ఉంటుంది. ప్రస్తుతం ఈ ప్రాంతమును శివారు లక్ష్మీనరసాపురం (LN Puram) గా పిలుస్తారు. ఇది గొల్లల మామిడాడ తపాల కార్యాలయం పరిధి లోనికి వస్తుంది. మామిడాడ గ్రామం చెరువుకు ఎదురుగా శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం కలదు. స్ధానికులు దీనిని పాటిమీద శివాలయంగా పిలుస్తారు. శ్రీ భీమేశ్వర లింగము భీమసభ నందలి 108 శివ లింగాలలో ఒకటిగా ప్రతీతి.
ఆలయం: మామిడాడ (LN పురం) గ్రామం లోని శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం చాల ప్రాచీనమైనది. కాల క్రమములో ఆలయం పునర్నిర్మాణము జరిగింది. ఆలయ ప్రాంగణములో ప్రధానాలయం తూర్పు అభిముఖంగా ఉంటుంది. ఆలయ ప్రవేశం గాలిగోపురం క్రింద నుంచి జరుగుతుంది. ఆలయ ప్రాంగణములో ధ్వజ స్ధంబం, నంది మండపం, ప్రధానాలయం, చండీశ్వరుడు, కళ్యాణ మండపం మొదలగునవి ఉంటాయి. ముఖమండపం నందు విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు దర్శనమిస్తారు, అంతరాలయం దాటిన తర్వాత గర్భాలయం వస్తుంది. గర్భాలయం నందు శ్రీ భీమేశ్వర లింగము మరియు శ్రీ మాణిక్యాంబ దేవి కొలువుదీరినారు. ఆలయం నందు ప్రతి నిత్యం అర్చనలు, అభిషేకాలు, శాంతులు నిర్వహించుతారు. స్వామి వారి కళ్యాణం మాఘ బహుళ ఏకాదశి నాడు జరుగుతుంది. మహాశివరాత్రి నాడు విశేష అభిషేకాలు ఉంటాయి. దేవస్ధానం వారు లక్షపత్ర పూజ నిర్వహించుతారు. అర్ధరాత్రి లింగోద్భవం కార్యాక్రమం జరుపుతారు. మహాశివరాత్రి సందర్భముగా నాలుగు జాములు ఆలయ దర్శనం జరుగుతుంది. మహాశివరాత్రి నాటి సాయంత్రం రథోత్సవం వైభవంగా జరుగుతుంది. గణపతి నవరాత్రులు, శరన్నవరాత్రులు మొదలగు నవి జరుగుతాయి. కార్తీక మాసంలో విశేష పూజలు ఉంటాయి. కార్తీక పౌర్ణమి నాడు జ్వాలా తోరణము జరుపుతారు. ధనుర్మాసం (30 రోజులు) నందు గ్రామ ఊరేగింపు కార్యక్రమం జరుగుతాయి. ఆలయ ప్రత్యేకత శివయ్య రజత ఆకృతి. అభిషేకాలు ముగించి, శివలింగాన్నికి రజత ఆకృతి అమర్చుతారు. ఆలయ పూజ సమాచారం కోసం ప్రస్తుతం ఆలయ అర్చక స్వామి అయిన శ్రీ కొత్తలంక కామరాజు, సెల్ నెం. 9866136166 గారిని సంప్రదించగలరు.
శ్రీ భీమేశ్వర లింగము, ఆశ్రేష నక్షత్రం (4వ పాదం) చెందినది. ఆశ్రేష నక్షత్రం నందలి 4వ పాదము లో జన్మంచిన శిశువు వలన తండ్రికి దోషం కలుగను. ఆలయం నందు ఆశ్రేష నక్షత్రం (4వ పాదం) నందు జన్మించిన వారికి అభిషేక శాంతులు నిర్వహించుతారు. నక్షత్ర శాంతి కోసం ఆలయ అర్చక స్వామి: శ్రీ కొత్తలంక కామరాజు, సెల్ నెం. 9866136166 సంప్రదించగలరు.
రవాణా సమాచారం 1: ద్రాక్షారామం నకు వాయువ్య దిశగా, సుమారు 8 kms. దూరంలో రామచంద్రాపురం bus complex ఉంటుంది. ద్రాక్షారామం నుంచి రామచంద్రాపురం కు బస్సులు / ఆటోలు దొరుకుతాయి.
రవాణా సమాచారం 2:రామచంద్రాపురం బస్ స్టాండ్ నుంచి సామర్లకోట బస్సులు ప్రతి గంటకు ఉంటాయి. బస్ సర్వీసులు చోడవరం, గొల్లల మామిడాడ, బిక్కవోలు మీదగా ప్రయాణం చేస్తాయి.
రవాణా సమాచారం 3: గొల్లల మామిడాడ జంక్షన్ (గాంధీ బొమ్మ సెంటర్) నుంచి పాటిమీద శివాలయంనకు ఆటోలు దొరుకుతాయి. ఆటోలు రాను - పోను ఏర్పాట్టు చేసుకోవడం సౌక్యముగా ఉంటుంది. గొల్లల మామిడాడ - పాటిమీద శివాలయం మధ్య దూరం సుమారు 1.6 Kms. గా ఉంటుంది.
రవాణా సమాచారం 4: కాకినాడ - గొల్లల మామిడాడ ఆటోలు (via) ఇంద్రపాలెం, కొవ్వాడ, రామేశ్వరం పెదపూడి మీదగా ఉంటాయి. కాకినాడ - గొల్లల మామిడాడ మధ్య దూరం 20 Kms. గొల్లల మామిడాడ ఆటోలు కాకినాడ బాల చెరువు నుంచి బయలుదేరుతాయి. పెదపూడి తర్వాత దొడ్డి ముసలమ్మ గుడి వస్తుంది. దీని తర్వాత పాటిమీద శివాలయం జంక్షన్ వస్తుంది. ఇక్కడ నుంచి సుమారు 400 meters దూరంలో పాటిమీద శివాలయం ఉంటుంది. మామిడాడ గ్రామం నకు సమీప రైల్వే స్టేషన్స్ సామర్లకోట జంక్షన్.
రవాణా సమాచారం 5:విశాఖపట్నం - విజయవాడ రైలు మార్గములో సామర్లకోట జంక్షన్ అను రైల్వే స్టేషన్ ఉంది. ఇక్కడ అన్ని ముఖ్య రైలు సర్వీసులు ఆగుతాయి. సామర్లకోట రైల్వే స్టేషన్ కు ఎదురుగా APSRTC బస్ స్టాండ్ ఉంటుంది.
రవాణా సమాచారం 6:సామర్లకోట నుంచి రామచంద్రపురం కు(via) బిక్కవోలు, గొల్లల మామిడాడ గ్రామం మీదగా బస్సులు బయులు దేరుతాయి. సామర్లకోట - గొల్లల మామిడాడ మధ్య దూరం 22 Kms. గొల్లల మామిడాడ గాంధీ బొమ్మ సెంటర్ నుంచి పాటిమీద శివాలయం నకు ఆటోలు దొరుకుతాయి.
అర్చక స్వామి: మాకు సహకరించిన శివారు లక్ష్మీనరసాపురం (LN Puram) గ్రామ నివాసి శ్రీ కొత్తలంక వెంకట సుబ్రహ్మణ్య శర్మ 9705300240 గార్కి నా నమసుమాంజలి.
మిగిలన ఆలయ అర్చక వాటాదారులు:
1. శ్రీ కొత్తలంక వీరభద్రం, సెల్ నెం. 9704725778
2. శ్రీ కొత్తలంక వీరభద్రరావు, సెల్ నెం. 9866238726
3. శ్రీ కొత్తలంక శంకర సుబ్రహ్మణం, నెం. 4899955456
4. శ్రీ కొత్తలంక సూర్య సుబ్రహ్మణం, నెం. 9703466401
5. శ్రీ కొత్తలంక ఫణి పూర్ణ రాజేష్, సెల్ నెం. 7793933333
6. శ్రీ దొంతిమేర్తి సుబ్రహ్మణం, సెల్ నెం. 9849332909
విజ్ఞప్తి: ద్రాక్షారామ - శ్రీ భీమేశ్వరాలయం యొక్క ఉత్తర ముఖద్వారం వద్ద శ్రీ రాజ రాజేశ్వరి పీఠం వారి నిత్యాన్నదానం సత్రం కలదు. దూర ప్రాంతములు నుంచి ఆలయాలు సందర్శనకు వచ్చిన యాత్రికులకు ఉచ్చిత అన్న ప్రసాదములు వితరణ జరుగును. భక్తులు ముందుగా అన్నప్రాసాదం కోసం ఫోనులో సంప్రాదించాలి.
వీరి Cell 83320 29544.
వీరు వాహనములు కూడ ఏర్పాటు చేస్తారు.
ఆశ్లేష నక్షత్రం స్తోత్రం
నమోస్తు సర్వేభ్యో యేకేచ పృధివీభను: యే అంతరిక్షే|
యే దివి తేభ్య: సర్వేభ్యో నమ:||
రోజూ 11 సార్లు పఠించటం వల్ల సర్వశుభాలు కలుగుతాయి.