గమనిక: దైవదర్శనం కొరకు యాత్రికులు కనీసం ఒక రోజు ముందుగా అర్చకస్వామితో సంప్రదించండి. ప్రతి ఏట కొన్ని ఆలయాలలో అర్చక స్వాములు వంతులువారిగా మారుతుంటారు.

శానపల్లిలంక గ్రామం / SANAPALLILANKA VILLAGE

శ్రీ భ్రమరాంబికా సమేత చౌడేశ్వర స్వామి

కుంభ రాశి, పూర్వాభాద్ర నక్షత్రం (2వ పాదం)


పాద శివలింగ స్ధానం: చాళుక్యుల భీమ మండలం నందలి ద్రాక్షారామ క్షేత్రానికి దక్షిణ దిశగా సుమారు 20 kms. దూరాన శానపల్లిలంక (Sanapallilanka) అను గ్రామం కలదు. ఇచ్చట శ్రీ చౌడేశ్వర లింగమును దర్శించగలము. శ్రీ భ్రమరాంబికా సమేత చౌడేశ్వర స్వామి వారి ఆలయం పూర్వాభాద్ర నక్షత్రం (2వ పాదం) చెందినది.  శ్రీ చౌడేశ్వర లింగము భీమసభ నందలి 108 శివ లింగాలలో ఒకటిగా ప్రతీతి. 

ఆలయం:  శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత వేణుగోపాలస్వామివారి ఆలయం మరియు శ్రీ భ్రమరాంబికా సమేత చౌడేశ్వర స్వామి ఆలయం ఒకే ప్రాంగణములో ఉంటాయి. శ్రీ భ్రమరాంబికా సమేత చౌడేశ్వర వారి ఆలయం చాల ప్రాచీనమైనది. కాల క్రమములో ఆలయం పునర్నిర్మాణము జరిగింది. శివాలయం నందు ధ్వజస్ధంభం, చండీశ్వరాలయం, భ్రమరాంబికా, ముఖమండపం, అంతరాలయం, గర్భాలయం ఉంటాయి. అంతరాలయం లో మహాగణపతి దర్శనమిస్తాడు. ఆలయ గోపుర శిఖరము నందు దేవతా మూర్తులు కలరు. శ్రీ చౌడేశ్వర లింగం కి నిత్య అర్చనలు జరుగుతాయి. శ్రీ భ్రమరాంబికా సమేత చౌడేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవములు ఫాల్గుణ శుద్ధ ఏకాదశి నుండి పాంచాహ్నికంగా జరుగుతుంది. శరన్నవరాత్రులు నిర్వ హించబడతాయి.  కుంభ రాశి జాతకులు, క్షేత్రం లోని శివాలయంలో అర్చన, అభిషేకములు భక్తితో నిర్వర్తించిన యెడల విశేష ఫలితములు పొందగలరని భక్తజనుల విశ్వాసము. 

స్ధల పురాణం: పవిత్ర గోదావరి నదికి ఉత్తర తీరం నందు కోటిపల్లి క్షేత్రం మరియు దక్షిణ తీరం నందు శానపల్లిలంక ఉన్నాయి. త్రేతాయుగములో శ్రీ రామచంద్ర మూర్తి తన పరివారముతో పుష్పక విమానంలో తీర్ధ యాత్రలకు బయలు దేరుతాడు. కోటిపల్లి క్షేత్రం దర్శనం పిమ్మట తిరుగు ప్రయాణములో ఒక ప్రాంతము నందు పుష్పక విమానం ఆగిపోతుంది.  వానర వీరులు శోధించగా ఒక మట్టి పుట్ట నుంచి దివ్య కాంతి కనబడుతుంది. ఆ పుట్టలో ఒక శివాలయం ఉంటుంది. అదే శ్రీ క్షణ ముక్తేశ్వర శివాలయం. శ్రీ రామచంద్ర మూర్తి తన పరివారముతో శ్రీ క్షణ ముక్తేశ్వర స్వామిని సేవించుతారు. అయోధ్య సేనలు విడిది చేసిన ఆ ప్రాంతము సేనపల్లి గా ఖ్యాతి పొందినది. కాలక్రమంలో శానపల్లి లంకగా రూపాంతరం చెందినట్లు కథనం. 

రవాణా సమాచారం: రావులపాలెం - మురమళ్ళ బస్సులు  (Via) వాడపాలెం, వెలవలపల్లి, ముక్తేశ్వరం మీదగా ఉంటాయి.

* రావులపాలెం - ముక్తేశ్వరం మధ్య దూరం సుమారు 25 Kms.

* ముక్తేశ్వరం నుంచి శానపల్లిలంక కి ఆటోలు ఉంటాయి. వీటి మధ్య దూరం సుమారు 4 Kms.

రవాణా సమాచారం: అమలాపురం - వీరవల్లిపాలెం బస్సులు (Via) ముక్తేశ్వరం మీదగా ఉంటాయి. అమలాపురం - ముక్తేశ్వరం మధ్య దూరం సుమారు 10 Kms. అమలాపురం నుంచి ముక్తేశ్వరం కు షేరింగ్ ఆటోలు కూడ ఉంటాయి.

* ముక్తేశ్వరం నుంచి శానపల్లిలంక కి ఆటోలు ఉంటాయి. వీటి మధ్య దూరం సుమారు 4 Kms.

రవాణా సమాచారం: కోటిపల్లి రేవు నుంచి ముక్తేశ్వరం రేవుకు Boat సౌకర్యములు ఉంటాయి. ముక్తేశ్వరం రేవు నుంచి ముక్తేశ్వరం కు రవాణ సౌకర్యములు ఉంటాయి. ముక్తేశ్వరం రేవు నుంచి ఆటోలు శ్రీ ముక్తికాంత సమేత శ్రీ క్షణముక్తీశ్వరాలయం మీదగా ఉంటాయి. వీటి మధ్య దూరం సుమారు 4 Kms.

* ముక్తేశ్వరం నుంచి శానపల్లిలంక కి ఆటోలు ఉంటాయి. వీటి మధ్య దూరం సుమారు 4 Kms.

అర్చక స్వామి: ఆలయ అర్చకస్వామి శ్రీ మద్దిరాల వీరవెంకట నాగ శ్రీహరి, సెల్ నెం : 94930 94154. సంప్రదించగలరు. 

విజ్ఞప్తి: ద్రాక్షారామ - శ్రీ భీమేశ్వరాలయం యొక్క ఉత్తర ముఖద్వారం వద్ద శ్రీ రాజ రాజేశ్వరి పీఠం వారి నిత్యాన్నదానం సత్రం కలదు.దూర ప్రాంతములు నుంచి ఆలయాలు సందర్శనకు వచ్చిన యాత్రికులకు ఉచ్చిత అన్న ప్రసాదములు వితరణ జరుగును. భక్తులు ముందుగా అన్నప్రాసాదం కోసం ఫోనులో సంప్రాదించాలి.

వీరి Cell 83320 29544.

వీరు వాహనములు కూడ ఏర్పాటు చేస్తారు.

పూర్వాభాద్ర నక్షత్రం స్తోత్రం

తనో హిర్బుద్ధన్య నృణోత్వజ ఏకపాత్‌ పృథివీ సముద్ర:|

విశ్వేదేవారుతా వృధోహు వానా స్తుతా మంత్రా కవి శస్తా అవంతు||

రోజూ 11 సార్లు పఠించటం వల్ల సర్వశుభాలు కలుగుతాయి.

వీడియో వివరణ / Video Description

ఆడియో వివరణ / Audio Description