గమనిక: దైవదర్శనం కొరకు యాత్రికులు కనీసం ఒక రోజు ముందుగా అర్చకస్వామితో సంప్రదించండి. ప్రతి ఏట కొన్ని ఆలయాలలో అర్చక స్వాములు వంతులువారిగా మారుతుంటారు.

శీల గ్రామం / SEELA VILLAGE

శ్రీ పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి

వృషభరాశి, రోహిణి నక్షత్రం (4వ పాదం)

పాద శివలింగ స్ధానం: చాళుక్యుల భీమ మండలం నందలి ద్రాక్షారామ క్షేత్రానికి ఈశాన్యం దిశగా, సుమారు 19 kms. దూరాన, శీల గ్రామం (Seela)  కలదు. ఇచ్చట శ్రీ పార్వతీ సమేత  శ్రీ రామలింగేశ్వర  స్వామి ఆలయం ఉంది. శ్రీ రామలింగేశ్వర లింగము భీమసభ నందలి 108 శివ లింగాలలో ఒకటిగా ప్రతీతి. 

స్ధల పురాణం: త్రేతాయుగం నందు శ్రీ రామచంద్రమూర్తి తన అరణ్యవాసం కాలము దండకారణ్యములో గడిపినాడు. పలు ప్రాంతముల నందు కుటీరం నిర్మించుకుని, సీతా లక్ష్మణుల సమేతంగా కొంత కాలము ఆ ప్రాంతములో నివాసాన్ని ఏర్పాటు చేసుకునే వాడు. ధర్మస్వరూపుడగు శ్రీరాముడు నిత్య శివార్చన తత్పరుడు. ఆ అవతారమూర్తి  నిత్య అర్చన కోసం అనేక శివలింగములను దండకారణ్యములో నెలకొల్పారు. ఆ రామ లింగాలల్లో ఒక శివ లింగమును శీల గ్రామం నందు దర్శించగలము. స్వామి శ్రీ రామలింగేశ్వరుడుగా ఖ్యాతి పొందినాడు. 

       వ్యాసుడు తన శిష్య బృందముతో ప్రితియగు కాశీ పురములో బిక్షాటన చేసి జీవించేవాడు. ఒకనాడ కాశీ విశ్వేశ్వరుడు వ్యాసుని పరీక్షించుటకు ఒక మాయ చేస్తాడు. ఆ రోజు కాశీ పురములో వ్యాసుని శిష్యులకు బిక్ష దొరకదు. వ్యాసుడు ఆకలి బాధతో కాశీ పురవాసులును శపించటకు సిద్దపడుతాడు. అప్పుడు కాశీ అన్నపూర్ణా దేవి వ్యాసునికి కాశీ బహిష్కరణ విధించుతుంది. శాపగ్రస్తుడైన వ్యాసుడు మిక్కిలి దుఖించుతాడు. కాశీ విశ్వేశ్వరుడు ఆదేశముతో వ్యాసుడు దక్షిణ కాశీగా ఖ్యాతి గాంచిన దాక్షారామ క్షేత్రానికి పది వేల శిష్యలతో బయలు దేరుతాడు.

       మార్గ మధ్యలో అనేక పుణ్య క్షేత్రాలను సందర్శించినాడు. యాత్రలో చివరగా గోదావరి మధ్య ప్రాంతము చేరుకుంటారు. వ్యాసుడు పిఠికాపురం నందలి శ్రీ కుక్కుటేశ్వర స్వామి, శక్తి దేవీని, కుంతీమాధవ స్వామి మొదలగు దేవతలను ధ్యానించాడు. పిమ్మట అగస్త్యుడు, లోపాముద్ర, శిష్యలు సమేతముగా వ్యాసుడు ద్రాక్షారామానికి ప్రయాణమయ్యారు. మార్గ మధ్యలో అనేక తీర్ధ క్షేత్రాలను సందర్శించినారు. వీటిలో శీల గ్రామం ఉంది. వేకువజాము మంచి ముహూర్తంగా నిర్ణయించి శీల గ్రామం నుంచి ద్రాక్షారామానికి ప్రయాణమయ్యారు. 

       అగస్త్యుడు (మహర్షి), భీమమండలము లోని ద్రాక్షారామ పరిసర ప్రాంతాలను వ్యాసుడుకి పరిచయం చేస్తాడు. వ్యాసుడు ఆకాశ మార్గము నుంచి సమస్త భీమ మండలమును సందర్శించినాడు. కవి శ్రీనాథుడు భీమేశ్వరపురాణం నందు వ్యాసుని భీమమండల యాత్ర వర్ణించాడు. శీల క్షేత్రం నందలి శంకరుని  (శ్రీ రామలింగేశ్వర లింగమును) వ్యాస భగవానుడు అర్చించినట్లు శ్రీనాథుడు " భీమేశ్వరపురాణం " నందు పేర్కొనాడు.

ఆలయం: శ్రీ పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర  స్వామి వారి ఆలయం పశ్చిమాభిముఖంగా ఉంటుంది. ఆలయ ప్రవేశం తూర్పున గల ముఖద్వారం నుంచి జరుగుతుంది. ఆలయ ప్రాంగణము చాల విశాలంగా ఉంటుంది. శివాలయం కు ఉత్తరం వైపున విష్ణ్వాలయం ఉంటుంది. విష్ణ్వాలయం నందు శ్రీదేవి - భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర సామి దర్శనమిస్తారు. ఒకే ప్రాంగణములో శివ-కేశవులు కొలువుదీరియుండుట విశేషం. శివాలయం చాల ప్రాచీనమైనది. కాల క్రమములో ఆలయం పునర్నిర్మాణము జరిగింది. శివాలయం నకు ధ్వజస్తంభం, ముఖ మండపం, అంతరాలయం, గర్భాలయం ఉంటాయి. ముఖ మండపం నందు నందీశ్వరుడు, గణపతి, పార్వతీ దేవి సన్నిధిలు ఉంటాయి. అంతరాలయం నందు ఉత్సవమూర్తులు కలవు. గర్భాలయం లోపల శ్రీ రామలింగేశ్వర లింగము దర్శనమిస్తుంది. స్వామి వామ భాగం నందు శ్రీ పార్వతీ దేవి కొలువుదీరింది. ఆలయం నందు ప్రతి నిత్యం అర్చనలు, అభిషేకాలు, శాంతులు నిర్వహించుతారు. స్వామి వారి కళ్యాణం మాఘ శుద్ధ ఏకాదశి నాడు జరుగుతుంది. ఆలయం నందు కార్తీక మాసంలో విశేష పూజలు జరుగుతాయి. శరన్నవరాత్రులు, గణపతి నవరాత్రులు వైభవంగా జరుగుతాయి. వీటి సందర్భముగా గ్రామస్ధులు అన్నసమారాధన జరుపుతారు. 

రవాణా సమాచారం 1: రాజమండ్రి - మంజేరు బస్సులు (via) రామచంద్రపురం, ద్రాక్షారామం, కుయ్యేరు, కాజులూరు, చేదువాడ బ్రిడ్జి, శీల మీదగా ఉండేవి. ప్రస్తుతం బస్ సర్వీసులు లేవు. 

రవాణా సమాచారం 2: కాకినాడ - పల్లిపాలెం,  కాకినాడ -  దుగ్గుదూరు, కాకినాడ - కాజులూరు బస్సులు (via) గొల్లపాలెం, చేదువాడ బ్రిడ్జి, మీదగా ఉండేవి. చేదువాడ బ్రిడ్జి నుంచి శీల దూరం సుమారు 2.5 Kms. మాత్రమే. ప్రస్తుతం బస్ సర్వీసులు లేవు. 

రవాణా సమాచారం 3: కాకినాడ - కోటిపల్లి బస్సులు (Via) గొల్లపాలెం, ద్రాక్షారామం మీదగా ప్రతి గంటకు ఉంటాయి. కాకినాడ నుంచి ద్రాక్షారామం షేరింగ్ ఆటోలు (Via) గొల్లపాలెం మీదగా ఉంటాయి. ఇవి కాకినాడ పాత బస్ స్టాండ్ మరియు కాకినాడ జగన్నాధపురం బ్రిడ్జి నుంచి బయులుదేరుతాయి. కాకినాడ - గొల్లపాలెం మధ్య దూరం సుమారు 15 Kms. 

రవాణా సమాచారం 4: గొల్లపాలెం (కాజులూరు సెంటర్) వద్ద ఆటో స్టాండ్ ఉంటుంది. ఇక్కడ నుంచి కాజులూరు, శీల, అయితపూడి మొదలగు పల్లెటూరు ప్రాంతమలకు షేరింగ్ ఆటోలు బయలుదేరుతాయి. గొల్లపాలెం (కాజులూరు సెంటర్) నుంచి శీల శివాలయం దూరం సుమారు 7 Kms. యాత్రికులు శీల కు ఆటోలు రాను-పోను ఏర్పాట్టు చేసుకోవడం సౌక్యంగా ఉంటుంది. 

అర్చక స్వామి: ఆలయ సమాచారం & Photos అందించిన శీల - శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ అర్చక స్వామి అయిన శ్రీ కొత్తలంక విశ్వ సత్య సుబ్రహ్మణ్య మల్లికార్జునరావు (శంకరప్రియ), సెల్ నెం. 9912767098 గార్కి నా నమసుమాంజలి. 

విజ్ఞప్తి: ద్రాక్షారామ - శ్రీ భీమేశ్వరాలయం యొక్క ఉత్తర ముఖద్వారం వద్ద శ్రీ రాజ రాజేశ్వరి పీఠం వారి నిత్యాన్నదానం సత్రం కలదు. దూర ప్రాంతములు నుంచి ఆలయాలు సందర్శనకు వచ్చిన యాత్రికులకు ఉచ్చిత అన్న ప్రసాదములు వితరణ జరుగును. భక్తులు ముందుగా అన్నప్రాసాదం కోసం ఫోనులో సంప్రాదించాలి. 

వీరి Cell 83320 29544. 

వీరు వాహనములు కూడ ఏర్పాటు చేస్తారు.

రోహిణి నక్షత్రం స్తోత్రం

బ్రహ్మజ జ్ఞానం ప్రథమం పురస్వాద్వి సీమ: పురచే

వేనయాయహ: సబుధ్వా ఉపమా అస్య విష్ఠా:

సతశ్చ యోనిమ సతశ్చ విధి:||

రోజూ 11 సార్లు పఠించటం వల్ల సర్వశుభాలు కలుగుతాయి.

వీడియో  వివరణ / Video  Description 

ఆడియో వివరణ / Audio Description