గమనిక: దైవదర్శనం కొరకు యాత్రికులు కనీసం ఒక రోజు ముందుగా అర్చకస్వామితో సంప్రదించండి. ప్రతి ఏట కొన్ని ఆలయాలలో అర్చక స్వాములు వంతులువారిగా మారుతుంటారు.

కాలేరు గ్రామం / KALERU VILLAGE

శ్రీ రాజరాజేశ్వరీ సమేత మల్లేశ్వర స్వామి

తులరాశి, చిత్త నక్షత్రం (4వ పాదం)

పాద శివలింగ స్ధానం: చాళుక్యుల భీమ మండలం నందలి ద్రాక్షారామ క్షేత్రానికి వాయువ్యం - పశ్చిమ దిశగా, సుమారు 19 kms. దూరాన, కాలేరు (Kaleru) గ్రామం ఉంది. ఇది కోనసీమ జిల్లా, కపిలేశ్వరపురం మండలంకు చెందినది. కాలేరు నందు శ్రీ రాజరాజేశ్వరీ సమేత మల్లేశ్వర స్వామి (శివాలయం) కలదు. శ్రీ మల్లేశ్వర లింగము భీమసభ నందలి 108 శివ లింగాలలో ఒకటిగా ప్రతీతి.

ఆలయం: శివాలయం చాల ప్రాచీనమైనది. పునర్నిర్మాణము జరిగింది. ఆలయ ప్రాంగణములో యాగశాల, ధ్వజస్ధంభం, చండీశ్వరాలయం, ముఖమండపం, గర్భాలయం ఉంటాయి. ఆలయ గోపుర శిఖరము నందు దేవత మూర్తులు కలరు. శ్రీ మల్లేశ్వర స్వామికి నిత్య అర్చనలు జరుగుతాయి. స్వామి వారి కళ్యాణోత్సవములు వైశాఖ శుద్ధ పాంచాహ్నికంగా జరుగుతుంది. శరన్నవరాత్రులు ఘనంగా జరుగుతాయి. తులరాశి జాతకులు, క్షేత్రం లోని శివాలయంలో అర్చన, అభిషేకములు భక్తితో నిర్వర్తించిన యెడల విశేష ఫలితములు పొందగలరని భక్తజనుల విశ్వాసము.

రవాణా సమాచారం 1: కాకినాడ - రావులపాలెం ప్రధాన రహదారిలో పసలపూడి వంతెన ఉంది. ఇక్కడ నుండి చెల్లూరు కు ఆటోలు ఉంటాయి. చెల్లూరు గ్రామంలో ఆటో స్టాండ్ కలదు. చెల్లూరు నుంచి కాలేరు కు ఆటోలు ఏర్పాట్టు చేసుకోవాలి. వీటి మధ్య దూరం సుమారు 6 Kms.

రవాణా సమాచారం 2: రామచంద్రపురం నుంచి వాకతిప్ప బస్సులు (వయా) పసలపూడి వంతెన, చెల్లూరు మీదగా ఉంటాయి.

రవాణా సమాచారం 3: మండపేట నుంచి కూడ కాలేరు కు ఆటోలు ఏర్పాట్టు చేసుకోవచ్చు. వీటి మధ్య దూరం సుమారు 12 Kms.

రవాణా సమాచారం 4: మండపేట - కోరుమిల్లి బస్సులు (వయా) అంగర మీదగా ఉంటాయి. అంగర నుంచి కాలేరు కు (వయా) టేకి మీదగా ఆటోలు ఏర్పాట్టు చేసుకోవాలి. వీటి మధ్య దూరం సుమారు 8 Kms.

అర్చక స్వామి: ఆలయ అర్చకులు శ్రీ పూజ్యం వైద్యనాధ శర్మగారు సెల్ నెం: 94944 91053 సంప్రదించగలరు.

విజ్ఞప్తి: ద్రాక్షారామ - శ్రీ భీమేశ్వరాలయం యొక్క ఉత్తర ముఖద్వారం వద్ద శ్రీ రాజ రాజేశ్వరి పీఠం వారి నిత్యాన్నదానం సత్రం కలదు. దూర ప్రాంతములు నుంచి ఆలయాలు సందర్శనకు వచ్చిన యాత్రికులకు ఉచ్చిత అన్న ప్రసాదములు వితరణ జరుగును. భక్తులు ముందుగా అన్నప్రాసాదం కోసం ఫోనులో సంప్రాదించాలి.

వీరి Cell 83320 29544.

వీరు వాహనములు కూడ ఏర్పాటు చేస్తారు.

చిత్త నక్షత్రం స్తోత్రం

త్వష్టా తురీయో అద్భుత ఇంద్రాగ్నీ పుష్టిర్వర్ధనమ్‌|

ద్విపద ఛందా ఇంద్రాయముక్షా గౌత్ర వయోదధ:||

రోజూ 11 సార్లు పఠించటం వల్ల సర్వశుభాలు కలుగుతాయి.