గమనిక: దైవదర్శనం కొరకు యాత్రికులు కనీసం ఒక రోజు ముందుగా అర్చకస్వామితో సంప్రదించండి. ప్రతి ఏట కొన్ని ఆలయాలలో అర్చక స్వాములు వంతులువారిగా మారుతుంటారు.
అంగర గ్రామం (పడమర ఖండ్రిక) / ANGARA VILLAGE
శ్రీ పార్వతీ సమేత ఖండేశ్వర స్వామి
ధనుస్సు రాశి, పూర్వాషాడ నక్షత్రం (1వ పాదం)
పాద శివలింగ స్ధానం: చాళుక్యుల భీమ మండలం నందలి ద్రాక్షారామ క్షేత్రానికి నైఋతి దిశగా సుమారు 23 kms. దూరాన అంగర (Angara - Padamara Khandrika) అను గ్రామం కలదు. కొత్తూరు సెంటర్ - అంగర - కె గంగవరం రోడ్డు మార్గములో అంగర గ్రామం ఉంటుంది. ఇచ్చట శ్రీ ఖండేశ్వర లింగమును దర్శించగలము. శ్రీ పార్వతీ సమేత ఖండేశ్వర స్వామి వారి ఆలయం పూర్వాషాడ నక్షత్రం (1వ పాదం) చెందినది. శ్రీ ఖండేశ్వర లింగము భీమసభ నందలి 108 శివ లింగాలలో ఒకటిగా ప్రతీతి.
ఆలయం: శ్రీ పార్వతీ సమేత ఖండేశ్వర స్వామి వారి ఆలయం చాల ప్రాచీనమైనది. కాల క్రమములో ఆలయం పునర్నిర్మాణము జరిగింది. శ్రీ ఖండేశ్వర లింగము కణ్వ మహర్షి ప్రతిష్ట.
ఆలయ ప్రాంగణములో ధ్వజస్ధంభం, చండీశ్వరాలయం, ముఖమండపం, అంతరాలయం, గర్భాలయం ఉంటాయి. గణపతి పార్వతీదేవికి సన్నిధిలు కలవు. ఆలయ గోపుర శిఖరము నందు దేవతా మూర్తులు కలరు. శ్రీ ఖండేశ్వర లింగం కి నిత్య అర్చనలు జరుగుతాయి. శ్రీ పార్వతీ సమేత ఖండేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవములు మాఘ శుద్ధ ఏకాదశి నుంచి పాంచాహ్నికంగా జరుగుతుంది. స్వామివారికి ఐదు రకాల వాహనాలతో సేవ జరుగుతాయి. శరన్నవ రాత్రులు, గణపతి నవరాత్రులు కూడా వైభవోపేతంగా నిర్వహించబడతాయి. దనుస్సు రాశి జాతకులు, క్షేత్రం లోని శివాలయంలో అర్చన, అభిషేకములు భక్తితో నిర్వర్తించిన యెడల విశేష ఫలితములు పొందగలరని భక్తజనుల విశ్వాసము.
రవాణా సమాచారం: మండపేట నుంచి కోరుమిల్లి కి (Via) అంగర మీదగా బస్సులు ఉంటాయి. మండపేట నుండి ప్రతిరోజూ నాలుగు ట్రిప్పులు బస్సు సర్వీసు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు మండపేట నుంచి అంగర కు షేరింగ్ ఆటోలు ఉంటాయి.
రవాణా సమాచారం: కాకినాడ - కత్తుంగ బస్సులు (via) ద్రాక్షారామం, కె.గంగవరం, పాణంగిపల్లి, అంగర, వెదురుమూడి, కొత్తూరు సెంటర్, రావులపాలెం మీదగా ఉంటాయి. ఇవి చాల తక్కువుగా ఉంటాయి.
రవాణా సమాచారం: ద్రాక్షారామం - కోటిపల్లి మార్గములో కె.గంగవరం ఉంటుంది. కె.గంగవరం నుంచి పాణంగిపల్లి, పామర్రు మీదగా అంగర కు షేరింగ్ ఆటోలు ఉంటాయి.
అంగర బస్ స్టాప్ నుంచి సుమారు 500 మీటర్లు లోపలకి ఆలయం ఉంటుంది (కపిలేశ్వరపురం వైపు).
అర్చక స్వామి: ఆలయ అర్చకస్వామి శ్రీ కంఠం అమ్మన్న శర్మ , సెల్ నెం: 98669 46082 సంప్రదించగలరు.
విజ్ఞప్తి: ద్రాక్షారామ - శ్రీ భీమేశ్వరాలయం యొక్క ఉత్తర ముఖద్వారం వద్ద శ్రీ రాజ రాజేశ్వరి పీఠం వారి నిత్యాన్నదానం సత్రం కలదు.దూర ప్రాంతములు నుంచి ఆలయాలు సందర్శనకు వచ్చిన యాత్రికులకు ఉచ్చిత అన్న ప్రసాదములు వితరణ జరుగును. భక్తులు ముందుగా అన్నప్రాసాదం కోసం ఫోనులో సంప్రాదించాలి.
వీరి Cell 83320 29544.
వీరు వాహనములు కూడ ఏర్పాటు చేస్తారు.
పూర్వాషాఢ నక్షత్రం స్తోత్రం
అపాఘమపి కిల్విష మపికృత్యామ పోరేప:|
అపాం మార్గ త్వమస్మదందు స్వపయసువ:||
రోజూ 11 సార్లు పఠించటం వల్ల సర్వశుభాలు కలుగుతాయి.