గమనిక: దైవదర్శనం కొరకు యాత్రికులు కనీసం ఒక రోజు ముందుగా అర్చకస్వామితో సంప్రదించండి. ప్రతి ఏట కొన్ని ఆలయాలలో అర్చక స్వాములు వంతులువారిగా మారుతుంటారు.

అండ్రంగి గ్రామం, ADRANGI VILLAGE

శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి

మిధునరాశి, మృగశిరి నక్షత్రం (3వ పాదం)

పాద శివలింగ స్ధానం: ద్రాక్షారామ క్షేత్రానికి ఈశాన్యం దిశగా, సుమారు 08 kms. దూరాన, అండ్రంగి గ్రామం (Andrangi) కలదు. ఇచ్చట శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయం ఉంది. శ్రీ మల్లేశ్వర లింగము, మృగశిర నక్షత్రం (3వ పాదం) చెందినది. ఈ రాశిలో జన్మించిన వారికి అభిషేక శాంతులు నిర్వహించుతారు. శ్రీ మల్లేశ్వర లింగము భీమసభ నందలి 108 శివ లింగాలలో ఒకటిగా ప్రతీతి.

ఆలయం: ఆలయ ప్రాంగణం విశాలముగా ఉంటుంది. ప్రధానాలయం తూర్పు అభిముఖం గా ఉంటుంది. ఆలయ ప్రాంగణములో ధ్వజ స్ధంబం, ప్రధానాలయం, శివకోటి స్తూపం, చండీశ్వరుడు, శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి సన్నిధి మొదలగునవి ఉంటాయి. ముఖ మండపం నందు నంది విగ్రహం ఉంటుంది.

అంతరాలయం నందు చిన్న నంది, గణపతి, నాగ బంధం ఉంటాయి.  గర్భాలయం నందు  శ్రీ మల్లేశ్వర లింగము దర్శనమిస్తుంది.  స్వామి వామ భాగం నందు శ్రీ పార్వతీ దేవి కొలువుదీరింది. స్వామిని సేవించిన వారు విశేష ఫలాలను పొందగలరు అని భక్తుల విశ్వాసం. ఆలయం నందు ప్రతి నిత్యం అర్చనలు, అభిషేకాలు, శాంతులు నిర్వహించుతారు.

వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు మల్లేశ్వర స్వామి వారి కళ్యాణం జరుగుతుంది. శ్రావణ మాసం లో వరలక్ష్మీ వ్రతం పూజలు, భాద్రపద మాసం లో వినాయక చవితి వ్రతం, అశ్వయుజ మాసం లో శరన్నవరాత్రులు సందర్భంగా తొమ్మిది రోజులు పాటు విశేష అర్చనలు వైభవంగా జరుగుతాయి. హోమాలు కూడ నిర్వహించుతారు.  ఆలయం నందు కార్తీక మాసంలో విశేష పూజలు, అభిషేకాలు జరుగుతాయి. కార్తీక పౌర్ణమి నాడు జ్వాలా తోరణము జరుపుతారు. మార్గశిర మాసం లో సుబ్రహ్మణ్య షష్టి ఘనంగా నిర్వహించుతారు. మహాశివరాత్రి సందర్భముగా విశేష అభిషేకాలు ఉంటాయి.  సంక్రాంతి, దీపావళీ మొదలగు పర్వదినాలు సందర్భముగా పూజలు విశేషంగా ఉంటాయి.

రవాణా సమాచారం 1: ద్రాక్షారామం నుంచి యానాం బస్సులు (Via) ఎర్ర పోతవరం, బాలాంత్రం, ఇంజరం మీదగా ప్రతి గంటకు ఉంటాయి. ద్రాక్షారామం నకు సుమారు 4 Kms. దూరంలో ఎర్ర పోతవరం బస్ స్టాప్ ఉంటుంది. ఎర్ర పోతవరం  నుంచి అండ్రంగి గ్రామం కు రోడ్డు మార్గము కలదు.

రవాణా సమాచారం 2: ఎర్ర పోతవరం బ్రిడ్జి దిగువ నుంచి అండ్రంగి కు ఆటోలు దొరుకుతాయి. వీటి మధ్య దూరం సుమారు 4 Kms. ఎర్ర పోతవరం నుంచి అండ్రంగి వైపు పోవు ఆటోలు చాల తక్కువగా ఉంటాయి. కాబట్టి ద్రాక్షారామం నుంచి అండ్రంగి కి రాను - పోను ఆటో ఏర్పాట్టు చేసుకోవటం సౌక్యముగా ఉంటుంది. ద్రాక్షారామం - అండ్రంగి మధ్య దూరం సుమారు 08 Kms. గా ఉంటుంది.

అర్చక స్వామి: మాకు సహకరించిన అండ్రంగి అర్చక స్వామి శ్రీ సంగమేశ్వర మల్లేశ్వర శర్మ, సెల్: 99514 23978 గార్కి మరియు శ్రీ సంగమేశ్వర సురేష్, అండ్రంగి గ్రామం గార్కి నా నమసుమాంజలి.

విజ్ఞప్తి: ద్రాక్షారామ - శ్రీ భీమేశ్వరాలయం యొక్క ఉత్తర ముఖద్వారం వద్ద శ్రీ రాజ రాజేశ్వరి పీఠం వారి నిత్యాన్నదానం సత్రం కలదు. దూర ప్రాంతములు నుంచి ఆలయాలు సందర్శనకు వచ్చిన యాత్రికులకు ఉచ్చిత అన్న ప్రసాదములు వితరణ జరుగును. భక్తులు ముందుగా అన్నప్రాసాదం కోసం ఫోనులో సంప్రాదించాలి.

వీరి Cell 83320 29544.

వీరు వాహనములు కూడ ఏర్పాటు చేస్తారు.

మృగశిర నక్షత్రం స్తోత్రం

ఇమం దేవా అసపత్నం సుబధ్వం మహతే క్షత్రాయ మహతే|

జ్యేష్ఠాయ మహతే జాన రాజ్యాయేంద్ర స్యేంద్రియాయ

ఇమముష్యౌ పుత్ర మముష్యా పుత్రము ముష్యా విశ

ఏషవోమీరాజా సోమోస్యాకం బ్రాహ్మణానా రాజా||

రోజూ 11 సార్లు పఠించటం వల్ల సర్వశుభాలు కలుగుతాయి.