గమనిక: దైవదర్శనం కొరకు యాత్రికులు కనీసం ఒక రోజు ముందుగా అర్చకస్వామితో సంప్రదించండి. ప్రతి ఏట కొన్ని ఆలయాలలో అర్చక స్వాములు వంతులువారిగా మారుతుంటారు.

కోటిపల్లి గ్రామం / KOTIPALLI VILLAGE

శ్రీ రాజరాజేశ్వరీ సమేత ఛాయ సోమేశ్వర స్వామి

కుంభ రాశి, శతభిషం నక్షత్రం (1వ పాదం)


పాద శివలింగ స్ధానం: చాళుక్యుల భీమ మండలం నందలి ద్రాక్షారామ క్షేత్రానికి దక్షిణ దిశగా, సుమారు 11 kms. దూరాన, కోటిపల్లి (Kotipalli) గ్రామం కలదు. పావన గౌతమీ నదీ తీరాన శ్రీ రాజరాజేశ్వరీ సమేత ఛాయ సోమేశ్వర స్వామి ఆలయం ఉంది. ఇది అష్ట సోమేశ్వరాలయాలలో దక్షిణ క్షేత్రంగా ప్రతితీ. భీమసభ నందలి 108 శివ లింగాలలో ఒకటిగా పేర్కొనారు. కోటిపల్లి క్షేత్రం లోని ఓకే ఆలయ ప్రాంగణములో శ్రీ ఛాయ సోమేశ్వర లింగము, శ్రీ కోటేశ్వర లింగము మరియు శ్రీ సిద్ధి జనార్దన స్వామి దర్శనం లభ్యమవుతుంది.

స్ధల పురాణం: కోటిపల్లి క్షేత్రం నందలి పవిత్ర స్నానం, దైవ దర్శనం, పితృ కర్మలు, తీర్ధ దానాలు వలన కోటి రెట్లు ఫలం లభ్యమవుతుంది అని శాస్త్రములు తెల్పుచున్నావి. కోటి కన్యాదానాల ఫలం, నూరు అశ్వమేధయాగాల ఫలం, కోటి శివలింగాలు ప్రతిష్ఠ చేసిన పుణ్యఫలాన్ని ఇస్తుంది అని మన ఆర్యులు చెప్పుచుంటారు. శ్రీమన్నారాయణుడు ఆజ్ఞ అనుసరించి చంద్రుడు (సోముడు) తన శాపవిమోచన కోసం ఒక శివలింగాన్ని ప్రతిష్టించి, ఆరాదించినాడు. ఆ శివ లింగము ఛాయ సోమేశ్వర లింగముగా పిలువబడుచున్నాది.

ఆలయం: శ్రీ రాజరాజేశ్వరీ సమేత సోమేశ్వరాలయం తూర్పు అభిముఖముగా ఉంటుంది. ప్రధానాలయం నందు శ్రీ ఛాయ సోమేశ్వర లింగము, శ్రీ రాజరాజేశ్వరీ అమ్మ వారు, శ్రీ సిద్ధి జనార్దన స్వామి, శ్రీ కోటేశ్వర లింగము మరియు నందీశ్వరుడు ఉంటారు. ఆలయ సమూహం విశాలముగా ఉంటుంది. ఆలయ ప్రాంగణములో నవగ్రహములు, శ్రీ చంద్రమౌళేశ్వర స్వామి, ఆది శంకరాచార్యులు, కాలభైరవ స్వామి, పార్వతీ దేవి, మృత్యుంజయ మూర్తిని దర్శించగలము. ఆలయ ప్రవేశ ద్వారము, ఆలయ శిఖరం, ధ్వజస్ధంభము కేవలం ఒకటి మాత్రమే ఉంటుంది. ఆలయ శిఖరం పైన పూర్ణ కలశం ఉంటుంది. ఉత్సవాలు కూడ శివ-కేశవులకు కలసి ఒకటిగానే ఉంటాయి. మహాశివరాత్రికి అంగరంగ వైభవముగా ఉత్సవాలు జరుగుతాయి. వైశాఖ శుద్ధ ద్వాదశి (క్షీరాబ్ధి ద్వాదశి) నాడు ఆలయ పుష్కరిణిలో (సోమ తీర్ధం) ఒకే వేదికపై తెప్పోత్సవం నిర్వహించుతారు.

భక్తులు పావన గోదావరి పుణ్యతీర్థంలో స్నానమాచరించి, ఆలయ ప్రదక్షిణ తర్వాత కోటేశ్వర స్వామిని, తదుపరి శ్రీ రాజరాజేశ్వరీ సమేత సోమేశ్వర స్వామిని, అనంతరం శ్రీ దేవి - భూదేవి సమేత సిద్ధి జనార్దన స్వామిని దర్శించుకుని పిమ్మట శ్రీ రాజరాజేశ్వరీ అమ్మవారిని దర్శించుకోవడం ఆలయ ఆచారంగా వస్తోంది. ప్రధానాలయం నందు అంతరాలయాలు, గర్భాలయాలు వేరు వేరుగా ఉంటాయి.

శ్రీ ఛాయ సోమేశ్వర స్వామికి ప్రతి నిత్యం అర్చనలు, అభిషేకాలు జరుగుతాయి. వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు శివ-కేశవులకు ఏక కాలములో కళ్యాణ ఉత్సవాలు నిర్వహించుతారు. మహా శివరాత్రి సందర్భముగా విశేష అభిషేకాలు జరుగుతాయి. సాయంత్ర కోటి దీపోత్సవం ఉంటుంది. ఆలయం నందు కార్తీక మాసంలో విశేష పూజలు జరుగుతాయి. శరన్నవరాత్రులు విశేషముగా ఉంటుయి. ఆలయ సేవలు కోసం అర్చక స్వామి గారిని సంప్రదించగలరు.

శ్రీ సోమేశ్వర లింగము, శతభిషం (1వ పాదం) లింగము చెందినది. శతభిషం (1వ పాదం) నందు జన్మంచిన శిశువు దోషం నకు ఉపశమనం (ఊరట) కొరకు అభిషేక శాంతులు నిర్వహించుతారు.

రవాణా సమాచారం: కాకినాడ - కోటిపల్లి బస్సులు (Via) గొల్లపాలెం, ద్రాక్షారామం, కె.గంగవరం మీదగా ప్రతి గంటకు ఉంటాయి.

* కాకినాడ నుంచి ద్రాక్షారామం నకు షేరింగ్ ఆటోలు దొరుకుతాయి. కాకినాడ పాత బస్ స్టాండ్ మరియు కాకినాడ జగన్నాధపురం బ్రిడ్జి నుంచి ద్రాక్షారామం నకు షేరింగ్ ఆటోలు దొరుకుతాయి.

* ద్రాక్షారామం నుంచి కోటిపల్లి కు షేరింగ్ ఆటోలు దొరుకుతాయి.

రవాణా సమాచారం: రాజమండ్రి - కోటిపల్లి బస్సులు (Via) రామచంద్రాపురం, ద్రాక్షారామం, కె.గంగవరం మీదగా ఉంటాయి.

* కోటిపల్లి క్షేత్రం నకు సమీప రైల్వే స్టేషన్స్ కోటిపల్లి.

* కాకినాడ టౌన్ (RS) నుంచి కోటిపల్లి (RS) వరకు రైలు బస్ సర్వీసులు చాల తక్కువుగా ఉంటాయి. కోటిపల్లి (RS) నుంచి శ్రీ రాజరాజేశ్వరీ సమేత ఛాయ సోమేశ్వర స్వామి ఆలయం దూరం సుమారు 1.6 Kms. గా ఉంటుంది. ఆటోలు చాల తక్కువుగా ఉంటాయి.

అర్చక స్వామి: శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి వంశపారంపర్య అర్చక స్వామి శ్రీ శివకోటి బాల సుబ్రహ్మణ్యం (బాలు) సెల్: 94903 51195.

విజ్ఞప్తి: ద్రాక్షారామ - శ్రీ భీమేశ్వరాలయం యొక్క ఉత్తర ముఖద్వారం వద్ద శ్రీ రాజ రాజేశ్వరి పీఠం వారి నిత్యాన్నదానం సత్రం కలదు.దూర ప్రాంతములు నుంచి ఆలయాలు సందర్శనకు వచ్చిన యాత్రికులకు ఉచ్చిత అన్న ప్రసాదములు వితరణ జరుగును. భక్తులు ముందుగా అన్నప్రాసాదం కోసం ఫోనులో సంప్రాదించాలి.

వీరి Cell 83320 29544.

వీరు వాహనములు కూడ ఏర్పాటు చేస్తారు.

శతభిషం నక్షత్రం స్తోత్రం

వరుణస్యో తంభనమసి వరుణస్య స్కంభసర్జనిస్థో|

వరుణస్య రుత సధన్యసీ వరుణస్య రుత సదనమసి

వరుణస్య రుత సదనమాసీద:||

రోజూ 11 సార్లు పఠించటం వల్ల సర్వశుభాలు కలుగుతాయి.