గమనిక: దైవదర్శనం కొరకు యాత్రికులు కనీసం ఒక రోజు ముందుగా అర్చకస్వామితో సంప్రదించండి. ప్రతి ఏట కొన్ని ఆలయాలలో అర్చక స్వాములు వంతులువారిగా మారుతుంటారు.

వేళంగి / VELANGI VILLAGE

శ్రీ బాలాత్రిపుర సుందరీ సమేత భవానీశంకర స్వామి

కర్కాటకరాశి, పుష్యమి నక్షత్రం (3వ పాదం)

పాద శివలింగ స్ధానం: చాళుక్యుల భీమ మండలం నందలి ద్రాక్షారామ క్షేత్రానికి ఈశాన్యం దిశగా, సుమారు 16 kms. దూరాన, వేళంగి (Velangi) గ్రామం ఉంటుంది. ఇది కాకినాడ జిల్లా, కరప మండలంకు చెందినది. రామచంద్రపురం - కరప  రోడ్డులో వేళంగి బస్ స్టాప్ ఉంటుంది. వేళంగి నందు శ్రీ బాలాత్రిపుర సుందరి సమేత భవానీశంకరస్వామి (శివాలయం) కలదు. శ్రీ భవానీశంకర లింగము భీమసభ నందలి 108 శివ లింగాలలో ఒకటిగా ప్రతీతి.

ఆలయం: ఆలయం చాల ప్రాచీనమైనది. పిఠాపురం మహారాజావారు మరియు గ్రామస్ధుల సహకారంతో ఆలయ పునరుద్ధరణ జరిగినది. ఆలయంలో గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నాగబంధము కలవు. శ్రీ భవానీశంకరస్వామికి నిత్య అర్చనలు జరుగుతాయి. స్వామివారి కళ్యాణోత్సవములు మాఘశుద్ధ  ఏకాదశి నుండి పాంచాహ్నికంగా జరుగుతుంది. శరన్నవ రాత్రులు, గణపతి నవరాత్రులు, సుబ్రహ్మణ్యషష్ఠి అత్యంత వైభవోపేతంగా జరుగుతాయి. ఆలయం పుష్యమి నక్షత్రం మూడవ పాదమునకు చెందినది. పుష్యమి నక్షత్రం వారు శ్రీ భవానీశంకర స్వామిని దర్శించి అర్చన, అభిషేకములు నిర్వర్తించిన యెడల వారి గ్రహపీడలు తొలగి శుభ ఫలితములు పొందగలరని భక్తుల విశ్వాసము.

రవాణా సమాచారం: రామచంద్రపురం - కాకినాడ బస్సులు (Via) వేళంగి మీదగా ఉంటాయి.  బస్సు స్టాపునకు దక్షిణంగా సుమారు 800 meters దూరాన, తుల్యభాగ నదీ తీరం లో భవానీశంకర స్వామి ఆలయం ఉంటుంది.

అర్చక స్వామి: బ్రహ్మశ్రీ దొంతికుర్తి ఈశ్వరశర్మగారు మరియు మణికంఠ కుమార్ గారు అర్చకులుగా వున్నారు. అర్చకస్వామి సెలె నెం: 99896 26526.

విజ్ఞప్తి: ద్రాక్షారామ - శ్రీ భీమేశ్వరాలయం యొక్క ఉత్తర ముఖద్వారం వద్ద శ్రీ రాజ రాజేశ్వరి పీఠం వారి నిత్యాన్నదానం సత్రం కలదు.  దూర ప్రాంతములు నుంచి ఆలయాలు సందర్శనకు వచ్చిన యాత్రికులకు ఉచ్చిత అన్న ప్రసాదములు వితరణ జరుగును. భక్తులు ముందుగా అన్నప్రాసాదం కోసం ఫోనులో సంప్రాదించాలి.

వీరి Cell 83320 29544.

వీరు వాహనములు కూడ ఏర్పాటు చేస్తారు.

పుష్యమి నక్షత్రం స్తోత్రం

బృహస్తే అతి యం దర్యో అర్హాద్‌ ధుమదూ విమాతి కృతు మజ్జనేషు|

యదీదయచ్ఛ వసరుతు ప్రజాత్‌ తదసమాసు ద్రవిణం ఘోహి చింతమ్‌||

రోజూ 11 సార్లు పఠించటం వల్ల సర్వశుభాలు కలుగుతాయి.