గమనిక: దైవదర్శనం కొరకు యాత్రికులు కనీసం ఒక రోజు ముందుగా అర్చకస్వామితో సంప్రదించండి. ప్రతి ఏట కొన్ని ఆలయాలలో అర్చక స్వాములు వంతులువారిగా మారుతుంటారు.

కోలంక గ్రామం / KOLANKA VILLAGE

శ్రీ ఉమా సమేత శ్రీ సోమేశ్వర స్వామి

మేషరాశి, భరణి నక్షత్రం (1వ పాదం)

అష్ట సోమేశ్వరాలయాలు (తూర్పు క్షేత్రం)

పాద శివలింగ స్ధానం: చాళుక్యుల భీమ మండలం నందలి ద్రాక్షారామ క్షేత్రానికి తూర్పు - ఆగ్నేయం దిశగా, సుమారు 13 kms. దూరాన, కోలంక (Kolanka)  గ్రామం కలదు. కోలంక బస్ స్టాప్ కు నైఋతి దిశగా, సుమారు 600 మీటర్లు దూరంలో ( కోలంక - పెదలంక రోడ్డు) శీ ఉమా సమేత శ్రీ సోమేశ్వర స్వామి ఆలయం ఉంటుంది.  కోలంక బస్ స్టాప్ నుంచి ఆలయం కు ఆటోలు చాల తక్కువుగా ఉంటాయి. శ్రీ సోమేశ్వర లింగము భీమసభ నందలి 108 శివ లింగాలలో ఒకటిగా ప్రతీతి.

ఆలయం: దక్షిణ కాశీగా పిలువబడే ద్రాక్షారామ క్షేత్రం నందలి శ్రీ భీమేశ్వర లింగము సూర్య ప్రతిష్ట. ఆ రుద్రమూర్తిని శాంతపరచేందుకు ద్రాక్షారామ క్షేత్రం చుట్టూ ఎనిమిది సోమేశ్వర ఆలయాలను చంద్రుడు ప్రతిష్టించాడు. చంద్రుడిని సోముడు అని పిలుస్తారు. సోముడు ప్రతిష్టించిన శివాలయాలను అష్టసోమేశ్వరాలయాలు అంటారు. ఇవి ద్రాక్షారామం పరిసరాల్లోనే ఉంటాయి. ద్రాక్షారామ క్షేత్రం నకు తూర్పు - ఆగ్నేయ దిశలో కోలంక గ్రామం ఉంది. ఇచ్చట శ్రీ సోమేశ్వరాలయం దర్శించగలము.

     కోలంక గ్రామంలో శ్రీ సోమేశ్వరాలయం మరియు శ్రీ కేశవ స్వామి ఆలయం ఒకే ప్రాంగణములో ఉంటాయి. శివకేశవులకు మూడు అంతస్ధుల గాలిగోపురం కలదు.  గాలిగోపురం క్రింద నుంచి ఆలయ ప్రవేశం జరుగుతుంది. రెండు ఆలయాలకు ముఖ మండపం విశాలముగా ఒకటి గానే ఉంటుంది. ధ్వజస్ధంభాలు వేరు వేరుగా ఉంటాయి. అంతరాళయం, గర్భాలయం కూడ వేరు వేరుగా ఉంటాయి. గర్భాలయం కు ముందు భాగంలో గణపతి, నంది, నవగ్రహాలు ఉంటాయి.  గర్భాలయం నందు శ్రీ సోమేశ్వర లింగము దర్శనమిస్తుంది. స్వామికి ఎడమ భాగంలో శ్రీ ఉమాదేవి కొలువుదీరింది. శ్రీ ఉమా సమేత సోమేశ్వర లింగమును అర్చించిన వారికి సకల శుభములు కలుగును అని భక్తుల విశ్వాసం.

రవాణా సమాచారం 1: ద్రాక్షారామం నకు సుమారు 13 kms. దూరాన కోలంక బస్ స్టాప్ ఉంది. ద్రాక్షారామం - యానాం బస్సులు (Via) ఎర్ర పోతవరం, బాలాంత్రం, కుయ్యేరు, ఉప్పుమిల్లి , కోలంక, ఇంజరం మీదగా ప్రతి గంటకు ఉంటాయి.

రవాణా సమాచారం 2:కోలంక బస్ స్టాప్ కు నైఋతి దిశగా, సుమారు 600 Mtrs. దూరంలో  సోమేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. కోలంక బస్ స్టాప్ నుంచి ఆటోలు  చాల తక్కువుగా ఉంటాయి.

అర్చక స్వామి: మాకు సహకరించిన అర్చక స్వామి శ్రీ కొత్తలంక వీరవెంకట సుబ్రహ్మణ్య శర్మ, సెల్ నెం. 9959459663 & 91008 64659

గార్కి నా నమసుమాంజలి.

విజ్ఞప్తి: ద్రాక్షారామ - శ్రీ భీమేశ్వరాలయం యొక్క ఉత్తర ముఖద్వారం వద్ద శ్రీ రాజ రాజేశ్వరి పీఠం వారి నిత్యాన్నదానం సత్రం కలదు. దూర ప్రాంతములు నుంచి ఆలయాలు సందర్శనకు వచ్చిన యాత్రికులకు ఉచ్చిత అన్న ప్రసాదములు వితరణ జరుగును. భక్తులు ముందుగా అన్నప్రాసాదం కోసం ఫోనులో సంప్రాదించాలి. 

వీరి Cell 83320 29544. 

వీరు వాహనములు కూడ ఏర్పాటు చేస్తారు.

భరణి నక్షత్రం స్తోత్రం

యమాయ త్వాంగిరస్యతే పితృమతే స్వాహా స్వాహా|

ధర్మాయ స్వాహా ధర్యపుత్రే||

రోజూ 11 సార్లు పఠించటం వల్ల సర్వశుభాలు కలుగుతాయి.

వీడియో  వివరణ / Video  Description

ఆడియో వివరణ / Audio Description