గమనిక: దైవదర్శనం కొరకు యాత్రికులు కనీసం ఒక రోజు ముందుగా అర్చకస్వామితో సంప్రదించండి. ప్రతి ఏట కొన్ని ఆలయాలలో అర్చక స్వాములు వంతులువారిగా మారుతుంటారు.
సిరిపురం గ్రామం / SIRIPURAM VILLAGE
శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి
కర్కాటకరాశి, పుష్యమి నక్షత్రం (2వ పాదం)
పాద శివలింగ స్ధానం: చాళుక్యుల భీమ మండలం నందలి ద్రాక్షారామ క్షేత్రానికి ఈశాన్యం దిశగా, సుమారు 13 kms. దూరాన, సిరిపురం (Siripuram) గ్రామం ఉంటుంది. కాకినాడ జిల్లా, కరప మండలంకు చెందినది. రామచంద్రపురం - కరప రోడ్డులో వేళంగి ఉంటుంది. వేళంగి నుండి కాపవరం వెళ్ళు మార్గంలో జీ. భావారం కలదు. జీ. భావారం నుంచి సిరిపురం కు సుమారు 1.5 Kms. లోపలకి మార్గం ఉంది. వేళంగి నుంచి సిరిపురం కు ఆటోలు ఏర్పాట్టు చేసుకోవాలి. సిరిపురం నందు శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి (శివాలయం) ఉంటుంది. శ్రీ వీరేశ్వరస్వామి లింగము భీమసభ నందలి 108 శివ లింగాలలో ఒకటిగా ప్రతీతి.
ఆలయం: ఆలయము చాల ప్రాచీనమైనది. ఆలయ ప్రాంగణంలో సుబ్రహ్మణ్యేశ్వరుడు కొలువై ఉన్నారు. అంతరాలయంలో గణపతి కలడు. వీరేశ్వరస్వామికి నిత్య అర్చనలు జరుగుతాయి. స్వామివారి కళ్యాణోత్సవము, చైత్రశుద్ధ ఏకాదశి నుండి పాంచాహ్నికంగా జరుగుతుంది. శరన్నవరాత్రులు, గణపతి నవరాత్రులు, సుబ్రహ్మణ్యషష్ఠి నిర్వహించబడతాయి. ఆలయము పుష్యమి నక్షత్రం రెండవ పాదమునకు చెందినది. స్వామిని దర్శించి & అర్చన, అభిషేకములు నిర్వర్తించిన యెడల పుష్యమి నక్షత్రంవారు వారి గ్రహపీడలు తొలగి శుభ ఫలితములు పొందగలరని భక్తుల విశ్వాసము.
శివాలయం ప్రక్కన శ్రీ కోదండ రామాలయం కలదు.
అర్చకస్వామి: శ్రీ చాగంటిపాటి వీరవెంకట సత్యనారాయణగారు అర్చక విధులు నిర్వహిస్తున్నారు. అర్చకస్వామి సెల్: 9502277791 & 62812 84879.
విజ్ఞప్తి: ద్రాక్షారామ - శ్రీ భీమేశ్వరాలయం యొక్క ఉత్తర ముఖద్వారం వద్ద శ్రీ రాజ రాజేశ్వరి పీఠం వారి నిత్యాన్నదానం సత్రం కలదు. దూర ప్రాంతములు నుంచి ఆలయాలు సందర్శనకు వచ్చిన యాత్రికులకు ఉచ్చిత అన్న ప్రసాదములు వితరణ జరుగును. భక్తులు ముందుగా అన్నప్రాసాదం కోసం ఫోనులో సంప్రాదించాలి.
వీరి Cell 83320 29544.
వీరు వాహనములు కూడ ఏర్పాటు చేస్తారు.
పుష్యమి నక్షత్రం స్తోత్రం
బృహస్తే అతి యం దర్యో అర్హాద్ ధుమదూ విమాతి కృతు మజ్జనేషు|
యదీదయచ్ఛ వసరుతు ప్రజాత్ తదసమాసు ద్రవిణం ఘోహి చింతమ్||
రోజూ 11 సార్లు పఠించటం వల్ల సర్వశుభాలు కలుగుతాయి.