గమనిక: దైవదర్శనం కొరకు యాత్రికులు కనీసం ఒక రోజు ముందుగా అర్చకస్వామితో సంప్రదించండి. ప్రతి ఏట కొన్ని ఆలయాలలో అర్చక స్వాములు వంతులువారిగా మారుతుంటారు.
మాచర గ్రామం / MACHARA VILLAGE
శ్రీ ఉమా పార్వతీ సమేత శ్రీ రాజలింగేశ్వర స్వామి
మకర రాశి, ఉత్తరాషాడ నక్షత్రం (2వ పాదం)
పాద శివలింగ స్ధానం: చాళుక్యుల భీమ మండలం నందలి ద్రాక్షారామ క్షేత్రానికి నైఋతి దిశగా సుమారు 25 kms. దూరాన మాచర (Machara) అను గ్రామం కలదు. ఇచ్చట శ్రీ రాజలింగేశ్వర లింగమును దర్శించగలము. శ్రీ ఉమా పార్వతీ సమేత శ్రీ రాజలింగేశ్వర స్వామి వారి ఆలయం ఉత్తరాషాడ నక్షత్రం (2వ పాదం) చెందినది. శ్రీ రాజలింగేశ్వర లింగము భీమసభ నందలి 108 శివ లింగాలలో ఒకటిగా ప్రతీతి.
ఆలయం: శ్రీ ఉమా పార్వతీ సమేత శ్రీ రాజలింగేశ్వర స్వామి వారి ఆలయం చాల ప్రాచీనమైనది. కాల క్రమములో ఆలయం పునర్నిర్మాణము జరిగింది. పంచవటీ తీర్ధమైన ఈ గ్రామంలో పూర్వము ఋషులు, మునీశ్వరులు తపస్సు చేసిన ప్రదేశం కావడం విశేషం. పూర్వం విక్రమార్క చక్రవర్తి నవజనార్ధనక్షేత్ర సందర్శనం తరువాత పంచవటీ ప్రాంతంలో
ఒక శివలింగ ప్రతిష్ట చేసినట్లు పూర్వగాధ. రాజుచే ప్రతిష్టింపబడ్డ కారణం వల్ల ఈ స్వామికి రాజలింగేశ్వర నామము కలిగినట్లు తెలియుచున్నది. ఆలయ ప్రాంగణములో ధ్వజస్ధంభం, చండీశ్వరాలయం, ముఖమండపం, ద్వారపాలకులు, గర్భాలయం ఉంటాయి. ఆలయ గోపుర శిఖరము నందు దేవతా మూర్తులు కలరు. శ్రీ రాజలింగేశ్వర లింగం కి నిత్య అర్చనలు జరుగుతాయి. శ్రీ ఉమా పార్వతీ సమేత శ్రీ రాజలింగేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవములు మాఘ శుద్ధ ఏకాదశి నుంచి పాంచాహ్నికంగా జరుగుతుంది. దనుస్సు రాశి జాతకులు, క్షేత్రం లోని శివాలయంలో అర్చన, అభిషేకములు భక్తితో నిర్వర్తించిన యెడల విశేష ఫలితములు పొందగలరని భక్తజనుల విశ్వాసము.
రవాణా సమాచారం: మాచర గ్రామం నకు సమీప రైల్వే స్టేషన్ రాజమండ్రి. ఇది హౌరా - చెన్నై రైలు మార్గములో ఉంటుంది. ఇక్కడ అన్ని రైలు సర్వీసులు ఆగుతాయి. రాజమండ్రి లోని కోటిపల్లి బస్ స్టాండ్ నుంచి రాజమండ్రి - రావులపాలెం బస్సులు బయలుదేరుతాయి. రావులపాలెం బస్సులు రాజమండ్రి రైల్వే స్టేషన్ మీదగా ఉంటాయి. ప్రయాణికులు రాజమండ్రి రైల్వే స్టేషన్ కూడ ప్రయాణం చేయవచ్చును. రావులపాలెం బస్ స్టాండ్ నుంచి మాచర గ్రామం నకు ఆటోలు దొరుకుతాయి. వీటి మద్య దూరం సుమారు 22 Kms. ఉంటుంది. రావులపాలెం బ్రిడ్జి దాటిన తర్వాత గోదావరి నదీ తీరాన గల గోదావరి గట్టు పైన (Via) కపిలేశ్వరపురం, కోరుమిల్లి, కోటిపల్లి గోదావరి గట్టు మీదగా యానాం వరకు రోడ్డు మార్గం ఉంది. షేరింగ్ ఆటోలు చాల తక్కువుగా ఉంటాయి. కోరుమిల్లి గోదావరి గట్టు నుంచి మాచర దూరం సుమారు 02 Kms. గా ఉంటుంది.
రవాణా సమాచారం: రావులపాలెం నుంచి కాకినాడ కు (Via) ఆలమూరు, అంగర, టేకి, కె.గంగవరం, ద్రాక్షారామం, గొల్లపాలెం మీదగా బస్సులు పరిమితంగా ఉంటాయి.
*టేకి నుంచి కోరుమిల్లి కు (Via) మాచర మీదగా ఆటోలు ఉంటాయి. అంగర నుంచి ఎక్కువ ఆటోలు దొరుకుతాయి.
రవాణా సమాచారం: కాకినాడ నుంచి కోరుమిల్లి గ్రామం నకు (Via) గొల్లపాలెం, ద్రాక్షారామం, కె.గంగవరం, టేకి మీదగా బస్సులు ఉంటాయి.
* కాకినాడ నుండి ప్రతిరోజూ నాలుగు ట్రిప్పులు బస్సు సర్వీసు అందుబాటులో ఉన్నాయి.
రవాణా సమాచారం: కాకినాడ నుంచి కోటిపల్లి గ్రామం నకు (Via) గొల్లపాలెం, ద్రాక్షారామం, కె.గంగవరం మీదగా బస్సులు ప్రతి అరగంటకు ఉంటాయి.
* కె.గంగవరం నుంచి అంగర కు షేరింగ్ ఆటోలు (Via) పామర్రు, టేకి మీదగా ఉంటాయి.
రవాణా సమాచారం: కోటిపల్లి రేవు నుంచి రావులపాలెం కు షేరింగ్ ఆటోలు (Via) కోరుమిల్లి, కపిలేశ్వరపురం మీదగా ఉంటాయి.
* కోరుమిల్లి గోదావరి గట్టు నుంచి మాచర దూరం సుమారు 02 Kms. మాత్రమే. మాచర బస్ స్టాప్ కు తూర్పు దిశగా సుమారు 300 meters దూరాన (లోపలకి) మాచర గ్రామం ఉంటుంది.
రవాణా సమాచారం: రావులపాలెం నుంచి కాకినాడ కు (Via) ఆలమూరు, మండపేట, రామచంద్రపురం మీదగా బస్సులు ఎక్కువగా ఉంటాయి.
* మండపేట నుంచి కోరుమిల్లి కి (Via) అంగర, టేకి, మాచర మీదగా బస్సులు ఉంటాయి. మండపేట నుండి ప్రతిరోజూ నాలుగు ట్రిప్పులు బస్సు సర్వీసు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు మండపేట నుంచి అంగర కు షేరింగ్ ఆటోలు ఉంటాయి. అంగర నుంచి మాచరకు ఎక్కువ ఆటోలు దొరుకుతాయి.
అర్చక స్వామి: ఆలయ అర్చకస్వామి శ్రీ కాలధరి శ్రీకృష్ణ భగవాన్, సెల్ నెం : 9491648530. 89851 62698 సంప్రదించగలరు.
విజ్ఞప్తి: ద్రాక్షారామ - శ్రీ భీమేశ్వరాలయం యొక్క ఉత్తర ముఖద్వారం వద్ద శ్రీ రాజ రాజేశ్వరి పీఠం వారి నిత్యాన్నదానం సత్రం కలదు.దూర ప్రాంతములు నుంచి ఆలయాలు సందర్శనకు వచ్చిన యాత్రికులకు ఉచ్చిత అన్న ప్రసాదములు వితరణ జరుగును. భక్తులు ముందుగా అన్నప్రాసాదం కోసం ఫోనులో సంప్రాదించాలి.
వీరి Cell 83320 29544.
వీరు వాహనములు కూడ ఏర్పాటు చేస్తారు.
ఉత్తరాషాఢ నక్షత్రం స్తోత్రం
విశ్వేదేవా శ్రుణుతేమ హవమేయే అంతరిక్షేయ ఉప ఘవిష్టమ్|
అగ్నిజిహ్వా ఉతవాయజత్రా అసాధ్యా స్మిన్హా మదాయ ధ్వమ్||
రోజూ 11 సార్లు పఠించటం వల్ల సర్వశుభాలు కలుగుతాయి.