గమనిక: దైవదర్శనం కొరకు యాత్రికులు కనీసం ఒక రోజు ముందుగా అర్చకస్వామితో సంప్రదించండి. ప్రతి ఏట కొన్ని ఆలయాలలో అర్చక స్వాములు వంతులువారిగా మారుతుంటారు.

పాతకోట గ్రామం / PATAKOTA VILLAGE

శ్రీ లోప ముద్రా సమేత అగస్త్యేశ్వర స్వామి

కుంభ రాశి, శతభిషం నక్షత్రం (4వ పాదం)


పాద శివలింగ స్ధానం: చాళుక్యుల భీమ మండలం నందలి ద్రాక్షారామ క్షేత్రానికి దక్షిణ దిశగా, సుమారు 10 kms. దూరాన, పాతకోట (Patakota) అను గ్రామం కలదు. (Google Map లో కోట గ్రామంగా చూపుతుంది). సుందర గోదావరి నదీ తీరప్రాంతములో పాతకోట గ్రామం ఉంటుంది. గోదావరి సోగసులు యాత్రికులకు నేత్రానందము పంచుతాయి. పాతకోట గ్రామంలో శ్రీ లోప ముద్రా సమేత అగస్త్యేశ్వర స్వామి ఆలయం ఉంది. శ్రీ అగస్త్యేశ్వర లింగము భీమసభ నందలి 108 శివ లింగాలలో ఒకటిగా ప్రతీతి.

ఆలయం: శ్రీ అగస్త్యేశ్వర స్వామి ఆలయం చాల ప్రాచీనమైది. ఆలయ ప్రాంగణము చాల విశాలముగా ఉంటుంది. ఆలయ ప్రవేశం తూర్పు ముఖద్వారం నుంచి జరుగుతుంది. ప్రధానాలయం కూడ తూర్పు అభిముఖంగా ఉంటుంది. ఆలయ ప్రాంగణములో ప్రధానాలయంతో పాటు ధ్వజస్తంభం, నంది, నాగ బంధం (వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి), చండీశ్వరుడు మొదలగునవి ఉంటాయి.

ముఖమండపం నందు గణపతి మరియు శ్రీ లోప ముద్రా దేవికి ప్రత్యేక సన్నిధిలున్నాయి. గణపతి (ఉత్తరాభి ముఖం), శ్రీ లోప ముద్రా దేవి (దక్షిణాభి ముఖం) కొలువుదీరినారు. అంతరాలయం నందు చిన్న నంది విగ్రహం ఉంది. గర్భాలయంలో శ్రీ అగస్త్యేశ్వర లింగము దర్శనమిస్తుంది. స్వామి వామ భాగం నందు శ్రీ లోప ముద్రా దేవి కొలువుదీరింది. స్వామిని సేవించిన వారు విశేష ఫలాలను పొందగలరు అని భక్తుల విశ్వాసం. ఆలయం నందు ప్రతి నిత్యం అర్చనలు, అభిషేకాలు, శాంతులు నిర్వహించుతారు. స్వామి వారి కళ్యాణం ఫాల్గుణ శుద్ధ ఏకాదశి నాడు జరుగుతుంది. ఆలయం నందు కార్తీక మాసంలో విశేష పూజలు జరుగుతాయి. కార్తీక పౌర్ణమి నాడు జ్వాలా తోరణము జరుపుతారు. మహాశివరాత్రి సందర్భముగా విశేష అభిషేకాలు ఉంటాయి. శాంతి కళ్యాణం, హోమం, జరుగుతాయి. రాత్రికి భజన కార్యక్రమాలు ఉంటాయి. శరన్నవరాత్రులు సందర్భంగా తొమ్మిది రోజులు పాటు విశేష అర్చనలు వైభవంగా జరుగుతాయి. సుబ్రహ్మణ్య షష్టి ఘనంగా నిర్వహించుతారు. పంచమి నాడు వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం జరుగుతుంది. సంక్రాంతి, దీపావళీ మొదలగు పర్వదినాలు సందర్భముగా పూజలు విశేషంగా ఉంటాయి.

రవాణా సమాచారం: కాకినాడ - కోటిపల్లి బస్సులు (Via) గొల్లపాలెం, ద్రాక్షారామం, కే. గంగవరం మీదగా ప్రతి గంటకు ఉంటాయి.

రవాణా సమాచారం: రాజమండ్రి - కోటిపల్లి బస్సులు (Via) రామచంద్రపురం, ద్రాక్షారామం, కే. గంగవరం మీదగా ప్రతి గంటకు ఉంటాయి.

* కోటిపల్లి నుంచి పాతకోట గ్రామం నకు (వయా) కోటిపల్లి - యానాం గోదావరి గట్టు మీదగా ఆటోలు దొరుకుతాయి. వీటి మధ్య దూరం సుమారు 04 Kms,

* ద్రాక్షారామం మరియు కే. గంగవరం నుంచి పాతకోట గ్రామం నకు (వయా) పాత కోట సెంటర్ మీదగా పాత కోట కు రోడ్డు మార్గం కలదు. కే. గంగవరం - కోటిపల్లి రోడ్డు మార్గములో పాత కోట సెంటర్ ఉంటుంది.

* పాత కోట సెంటర్ నుంచి పాత కోట గ్రామం మధ్య దూరం సుమారు 02 Kms.

* ద్రాక్షారామం - కే. గంగవరం - పాత కోట సెంటర్ - పాత కోట గ్రామం మధ్య దూరం సుమారు 10 Kms.

* కే. గంగవరం - పాత కోట సెంటర్ - పాత కోట గ్రామం మధ్య దూరం సుమారు 04 Kms.

ద్రాక్షారామం - కే. గంగవరం మధ్య షేరింగ్ ఆటోలు ఉంటాయి. కే. గంగవరం నుంచి పాత కోట గ్రామం కు ఆటోలు రాను - పోను ఏర్పాట్టు చేసుకోవాలి.

అర్చక స్వామి: నక్షత్ర శాంతి కోసం ఆలయ అర్చక స్వామి: శ్రీ కొత్తలంక దత్తాత్రేయ, సెల్ నెం. 9491755744 సంప్రదించగలరు. ఆలయ సమాచారం & Photos అందించిన పాత కోట - శ్రీ లోప ముద్రా సమేత అగస్త్యేశ్వర స్వామి వారి ఆలయ అర్చక స్వామి అయిన శ్రీ కొత్తలంక దత్తాత్రేయ, సెల్ నెం. 9491755744 గార్కి నా నమసుమాంజలి.

విజ్ఞప్తి: ద్రాక్షారామ - శ్రీ భీమేశ్వరాలయం యొక్క ఉత్తర ముఖద్వారం వద్ద శ్రీ రాజ రాజేశ్వరి పీఠం వారి నిత్యాన్నదానం సత్రం కలదు.దూర ప్రాంతములు నుంచి ఆలయాలు సందర్శనకు వచ్చిన యాత్రికులకు ఉచ్చిత అన్న ప్రసాదములు వితరణ జరుగును. భక్తులు ముందుగా అన్నప్రాసాదం కోసం ఫోనులో సంప్రాదించాలి.

వీరి Cell 83320 29544.

వీరు వాహనములు కూడ ఏర్పాటు చేస్తారు.

శతభిషం నక్షత్రం స్తోత్రం

వరుణస్యో తంభనమసి వరుణస్య స్కంభసర్జనిస్థో|

వరుణస్య రుత సధన్యసీ వరుణస్య రుత సదనమసి

వరుణస్య రుత సదనమాసీద:||

రోజూ 11 సార్లు పఠించటం వల్ల సర్వశుభాలు కలుగుతాయి.