గమనిక: దైవదర్శనం కొరకు యాత్రికులు కనీసం ఒక రోజు ముందుగా అర్చకస్వామితో సంప్రదించండి. ప్రతి ఏట కొన్ని ఆలయాలలో అర్చక స్వాములు వంతులువారిగా మారుతుంటారు.
దోమాడ గ్రామం / DOMADA VILLAGE
శ్రీ ఉమా సమేత మాండేశ్వర స్వామి
కర్కాటకరాశి, ఆశ్రేష నక్షత్రం (1వ పాదం)
పాద శివలింగ స్ధానం: చాళుక్యుల భీమ మండలం నందలి ద్రాక్షారామ క్షేత్రానికి ఈశాన్యం దిశగా, సుమారు 28 kms. దూరాన దోమాడ గ్రామం (Domada) కలదు. రామచంద్రపురం - సామర్లకోట రోడ్డు మార్గములో గొల్లల మామిడాడ జంక్షన్ ఉంటుంది. గొల్లల మామిడాడ జంక్షన్ కు తూర్పు-ఈశాన్యం దిశగా సుమారు 8Kms. దూరంలో దోమాడ గ్రామం ఉంటుంది. గొల్లల మామిడాడ జంక్షన్ నుంచి కాకినాడ కు రోడ్డు మార్గము కలదు. కాకినాడ రోడ్డు మార్గములో పెదపూడి గ్రామం దాటిన తర్వాత దోమాడ పంచాయితీ ఆఫీస్ కు సమీపం లో శ్రీ ఉమా సమేత మాండేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. శ్రీ మాండేశ్వర లింగము భీమసభ నందలి 108 శివ లింగాలలో ఒకటిగా ప్రతీతి.
ఆలయం: మాండవ్య మహర్షి మహాతపస్వి. ధర్మ స్వరూపుడు. కాలి నడకతో భూలోకములోని సర్వ పుణ్య క్షేత్రాలాన్నీ సందర్శించిన మహర్షి. అతడు యాత్రలో భాగముగా దోమాడ గ్రామ ప్రాంతము ఒక శివ లింగమును ప్రతిష్టించి ఆరాధించాడు. ఆ శివలింగము శ్రీ మాండేశ్వ స్వామిగా ఖ్యాతి పొందినాడు.
పూర్వం దోమాడ గ్రామం పాడిపంటలతో పచ్చగా కళకళలాడుతూ ఉండేది. పచ్చని పంట పొలాలు మధ్యన గల శివాలయం నందలి శివలింగము భక్తుల కోరికలు తీర్చే కల్పతరువుగా ప్రసిద్ది చెందింది. కొంత కాలము తర్వాత ప్రకృతి వైపరీత్యాలు కారణముగా శివాలయం ధ్వంసం అయింది. బహిరంగ మిగిలన శివలింగాన్ని స్ధానికులు భక్తి శ్రద్ధలతో ఆరాధించేవారు. దీనిని శ్రీ మాండేశ్వర దిమ్మగా పిలిచేవారు. దీని ప్రక్కనే పంట పొలాలుకు పోవు ఎద్దుల బండి రహదారి ఉండేది. ఒకనాడు ఒక ఎద్దుల బండి చక్రం వలన ఆ దిమ్మకు ( శ్రీ మాండేశ్వర శివలింగము) నష్టం జరిగింది. శిథిలమైన శివలింగము వలన ఊరుకు అరిష్టంగా భావించి, సమీపంలో గల గంగా ప్రవాహం నందు (కాలువలో) నిమజ్జనం చేసారు. ఆ నాటి నుంచి దోమాడ గ్రామంలో కరువు కాటకాలు ఏర్పడాయి. ఆచార్యపురుషుఁలు సలహాతో గ్రామస్ధులు కాశీ నుంచి ఒక శివలింగాన్ని తెప్పించి ప్రతిష్ట గావించారు.
దోమాడ గ్రామం లోని శ్రీ ఉమా సమేత మాండేశ్వర స్వామి ఆలయం ప్రాచీనమైనది. కాల క్రమములో ఆలయం పునర్నిర్మాణము జరిగింది. ఆలయ ప్రాంగణములో ధ్వజ స్ధంభం, ప్రధానాలయం, చండీశ్వరుడు నవగ్రహ మండపం మొదలగునవి ఉంటాయి. ప్రధానాలయం తూర్పు అభిముఖముగా ఉంటుంది. ముఖమండపం నందు నంది విగ్రహం, గణపతి, నాగ బంధము (సుబ్రహ్మణ్యేశ్వరుడు) ద్వారపాలకులు ఉంటారు. అంతరాలయం నందు వినాయకుడు దర్శనమిస్తారు. గర్భాలయం నందు శ్రీ మాండేశ్వర లింగము మరియు శ్రీ ఉమా దేవి కొలువుదీరినారు. ఆలయం నందు ప్రతి నిత్యం అర్చనలు, అభిషేకాలు, శాంతులు నిర్వహించుతారు. స్వామి వారి కళ్యాణం మాఘ బహుళ ఏకాదశి నాడు జరుగుతుంది.
శ్రీ సోమేశ్వర లింగము, ఆశ్రేష నక్షత్రం (1వ పాదం) చెందినది. ఆశ్రేష నక్షత్రం నందలి 1వ పాదము లో జన్మంచిన వారికి శాంతులు నిర్వహించుతారు. వివాహం, సంతానం, కాల సర్ప దోష సమస్యలతో బాధ పడు వారి గోత్ర నామాలతో శ్రీ ఉమా సమేత మాండేశ్వర స్వామికి అభిషేకాలు జరుపుతారు. శివ అనుగ్రహముతో ఉపశమము పొంది, వారి శుభ కార్యములు సిద్ధించగలవు. ఆలయం నందు కార్తీక మాసంలో విశేష పూజలు జరుగుతాయి. కార్తీక పౌర్ణమికి జ్వాలతోరణం జరుగుతుంది. మహాశివరాత్రి సందర్భముగా విశేష అభిషేకాలు & లింగోద్భవ కాల పూజలు ఉంటాయి.
రవాణా సమాచారం 1: ద్రాక్షారామం నకు వాయువ్య దిశగా, సుమారు 8 kms. దూరంలో రామచంద్రాపురం bus complex ఉంటుంది. ద్రాక్షారామం నుంచి రామచంద్రాపురం కు బస్సులు / ఆటోలు దొరుకుతాయి.
రవాణా సమాచారం 2: రామచంద్రాపురం బస్ స్టాండ్ నుంచి సామర్లకోట బస్సులు ప్రతి గంటకు ఉంటాయి. బస్ సర్వీసులు చోడవరం, నరసాపురపు పేట, గొల్లల మామిడాడ, బిక్కవోలు మీదగా ప్రయాణం చేస్తాయి.
రవాణా సమాచారం 3: గొల్లల మామిడాడ నుంచి దోమాడ గ్రామం నకు షేరింగ్ ఆటోలు దొరుకుతాయి. ఆటోలు రాను - పోను ఏర్పాట్టు చేసుకోవడం సౌక్యముగా ఉంటుంది. గొల్లల మామిడాడ - దోమాడ మధ్య దూరం సుమారు 8 Kms,
రవాణా సమాచారం 4: కాకినాడ - గొల్లల మామిడాడ ఆటోలు (via) ఇంద్రపాలెం, కొవ్వాడ, రామేశ్వరం, దోమాడ, పెదపూడి మీదగా ఉంటాయి. కాకినాడ - దోమాడ మధ్య దూరం 13 Kms. కాకినాడ బాల చెరువు నుంచి ఆటోలు బయలుదేరుతాయి. సామర్లకోట - పెదపూడి మధ్య ఆటోలు దొరుకుతాయి మరియు పెదపూడి నుంచి దోమాడ మీదగా కాకినాడ ఆటోలు దొరుకుతాయి.
అర్చక స్వామి: ఆలయ సమాచారం & Photos అందించిన దోమాడ - శ్రీ మాండేశ్వర స్వామి, ఆలయ అర్చక స్వామి అయిన శ్రీ పుల్లేటికుర్తి సోమేశ్వర శర్మ, సెల్ నెం. 7995435863 గార్కి నా నమసుమాంజలి.
విజ్ఞప్తి: ద్రాక్షారామ - శ్రీ భీమేశ్వరాలయం యొక్క ఉత్తర ముఖద్వారం వద్ద శ్రీ రాజ రాజేశ్వరి పీఠం వారి నిత్యాన్నదానం సత్రం కలదు. దూర ప్రాంతములు నుంచి ఆలయాలు సందర్శనకు వచ్చిన యాత్రికులకు ఉచ్చిత అన్న ప్రసాదములు వితరణ జరుగును. భక్తులు ముందుగా అన్నప్రాసాదం కోసం ఫోనులో సంప్రాదించాలి.
వీరి Cell 83320 29544.
వీరు వాహనములు కూడ ఏర్పాటు చేస్తారు.
ఆశ్లేష నక్షత్రం స్తోత్రం
నమోస్తు సర్వేభ్యో యేకేచ పృధివీభను: యే అంతరిక్షే|
యే దివి తేభ్య: సర్వేభ్యో నమ:||
రోజూ 11 సార్లు పఠించటం వల్ల సర్వశుభాలు కలుగుతాయి.