గమనిక: దైవదర్శనం కొరకు యాత్రికులు కనీసం ఒక రోజు ముందుగా అర్చకస్వామితో సంప్రదించండి. ప్రతి ఏట కొన్ని ఆలయాలలో అర్చక స్వాములు వంతులువారిగా మారుతుంటారు.

తాళ్ళరేవు గ్రామం / TALLAREVU VILLAGE

శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి

వృషభరాశి, మృగశిర నక్షత్రం (1వ పాదం)

పాద శివలింగ స్ధానం: చాళుక్యుల భీమ మండలం నందలి ద్రాక్షారామ క్షేత్రానికి తూర్పు దిశగా, సుమారు 26 kms. దూరాన, తాళ్ళరేవు గ్రామం (Tallarevu)  కలదు. ఇచ్చట శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి ఆలయం ఉంది. తాళ్ళరేవు రిజిస్టర్ ఆఫీస్ కు సమీపంలో శ్రీ రామాలయం, శ్రీ కేశవ స్వామి ఆలయం, శ్రీ వీరేశ్వర స్వామి ఆలయం ఉంటాయి. శ్రీ వీరేశ్వర లింగము భీమసభ నందలి 108 శివ లింగాల్లో ఒకటిగా ప్రతీతి.

ఆలయం: ఆలయ ప్రాంగణములో ప్రధానాలయం, ధ్వజ స్ధంభము, కుమారుస్వామి, విఘ్నేశ్వర స్వామి, నవగ్రహ మండపం, చండేశ్వర స్వామిని దర్శించగలము. ముఖ మండపం నందు శ్రీ వీరేశ్వర స్వామి సన్నిధి మరియు శ్రీ సత్యనారయణ స్వామి సన్నిధి వేరు వేరుగా ఉంటాయి. వీటితో పాటు శ్రీ సుబ్రహ్మణ్య సామి, శ్రీ విఘ్నేశ్వర స్వామి, శ్రీ శనీశ్వర లింగము ఉంటాయి. శ్రీ శనీశ్వర లింగము పశ్చిమాభి ముఖముగా దర్శనమిస్తుంది. శ్రీ వీరేశ్వర స్వామి వారి అంతరాలయం నందు నంది, శ్రీ భద్రకాళి అమ్మ వారు ఉంటారు. శ్రీ భద్రకాళి అమ్మ వారి సన్నిధి దక్షిణ ముఖంగా ఉండును. గర్భాలయం నందు శ్రీ వీరేశ్వర లింగము దర్శనమిస్తుంది. శ్రీ వీరేశ్వర స్వామికి నిత్య అర్చనలు, అభిషేకాలు జరగుచుంటాయి. స్వామి వారి కళ్యాణోత్సవం మాఘ శుద్ధ ఏకాదశి నాడు వైభవంగా జరుగుతాయి. కార్తీక మాసం, మహా శివ రాత్రి నాడు విశేష పూజలు నిర్వహించుతారు. శ్రీ సత్యనారయణ స్వామి వారి కళ్యాణం చైత్ర శుద్ధ ఏకాదశి నాడు జరుగుతుంది ఒకే ఆలయ ప్రాంగణములో శివ - కేశవులు కొలువు దీరియుండుట విశేషం.

శ్రీ వీరేశ్వర లింగము వృషభరాశి, మృగశిర నక్షత్రం (1వ పాదం) చెందిన ఆలయంగా ప్రతీతి. శిశువు జన్మ నక్షత దోషములు నివారించుటకు ఆలయం నందు అభిషేక శాంతులు నిర్వహించుతారు.

రవాణా సమాచారం: కాకినాడ నుంచి యానాం బస్సులు (Via) జగన్నాధపురం బ్రిడ్జి, చొల్లంగి, కోరంగి, తాళ్ళరేవు మీదగా ఉంటాయి. కాకినాడ - యానాం మరియు కాకినాడ - అమలాపురం (పల్లె వెలుగు) బస్సులు తాళ్ళరేవు (ఊరు లోపల) మీదగా ఉంటాయి. Non-stop బస్సులు bye pass road మీదగా ఉంటాయి. కాకినాడ బస్ స్టాండ్ నుంచి తాళ్ళరేవు దూరం సుమారు 25 Kms. గా ఉంటుంది.

తాళ్ళరేవు రిజిస్టర్ ఆఫీస్ బస్ స్టేజి దిగాలి. ఇక్కడ నుంచి  శ్రీ వీరేశ్వర స్వామి ఆలయం దూరం సుమారు 400 meters గా ఉంటుంది.

* కాకినాడ లోని జగన్నాధపురం బ్రిడ్జి నుంచి తాళ్ళరేవు ఊరు లోనికి షేరింగ్ ఆటోలు కూడ దొరుకుతాయి.

* కాజులూరు నుంచి తాళ్ళరేవు కు రోడ్డు మార్గం & ఆటోలు ఉంటాయి. వీటి మధ్య దూరం సుమారు 8 Kms. గా ఉంటుంది.

అర్చక స్వామి: ఆలయ సమాచారం & Photos అందించిన తాళ్ళరేవు - శ్రీ వీరేశ్వర స్వామి, ఆలయ అర్చక స్వామి అయిన శ్రీ కొండవీటి శివ రామకృష్ణ, సెల్ నెం. 9849443187 గార్కి నా నమసుమాంజలి.

విజ్ఞప్తి: ద్రాక్షారామ - శ్రీ భీమేశ్వరాలయం యొక్క ఉత్తర ముఖద్వారం వద్ద శ్రీ రాజ రాజేశ్వరి పీఠం వారి నిత్యాన్నదానం సత్రం కలదు. దూర ప్రాంతములు నుంచి ఆలయాలు సందర్శనకు వచ్చిన యాత్రికులకు ఉచ్చిత అన్న ప్రసాదములు వితరణ జరుగును. భక్తులు ముందుగా అన్నప్రాసాదం కోసం ఫోనులో సంప్రాదించాలి.

వీరి Cell 83320 29544.

వీరు వాహనములు కూడ ఏర్పాటు చేస్తారు.

మృగశిర నక్షత్రం స్తోత్రం

ఇమం దేవా అసపత్నం సుబధ్వం మహతే క్షత్రాయ మహతే|

జ్యేష్ఠాయ మహతే జాన రాజ్యాయేంద్ర స్యేంద్రియాయ

ఇమముష్యౌ పుత్ర మముష్యా పుత్రము ముష్యా విశ

ఏషవోమీరాజా సోమోస్యాకం బ్రాహ్మణానా రాజా||

రోజూ 11 సార్లు పఠించటం వల్ల సర్వశుభాలు కలుగుతాయి.

వీడియో వివరణ / Video Description

ఆడియో వివరణ / Audio Description