గమనిక: దైవదర్శనం కొరకు యాత్రికులు కనీసం ఒక రోజు ముందుగా అర్చకస్వామితో సంప్రదించండి. ప్రతి ఏట కొన్ని ఆలయాలలో అర్చక స్వాములు వంతులువారిగా మారుతుంటారు.
పేకేరు గ్రామం / PEKERU VILLAGE
శ్రీ లోపాముద్రా సమేత అగస్త్వేశ్వర స్వామి
మీన రాశి, రేవతి నక్షత్రం (3వ పాదం)
పాద శివలింగ స్ధానం: చాళుక్యుల భీమ మండలం నందలి ద్రాక్షారామ క్షేత్రానికి ఆగ్నేయం దిశగా, సుమారు 9 kms. దూరాన, పేకేరు (Pekeru) అను గ్రామం కలదు. ఇచ్చట శ్రీ లోపాముద్రా సమేత అగస్త్వేశ్వర స్వామి ఆలయం ఉంది. శ్రీ అగస్త్వేశ్వర లింగము భీమసభ నందలి 108 శివ లింగాలలో ఒకటిగా ప్రతీతి.
ఆలయం: శ్రీ లోపాముద్రా సమేత అగస్త్వేశ్వర స్వామి వారి ఆలయం చాల ప్రాచీనమైనది. కాల క్రమములో ఆలయం పునర్నిర్మాణము జరిగింది. ఆలయ ప్రాంగణములో ధ్వజస్ధంభం, చండీశ్వరుడు, ముఖమండపం, లోపాముద్రా దేవి, గర్భాలయం ఉంటాయి. ఆలయ గోపుర శిఖరము నందు దేవతా మూర్తులు కలరు. శ్రీ నీలకంఠ త్రిపురాంతక లింగం కి నిత్య అర్చనలు జరుగుతాయి. శ్రీ లోపాముద్రా సమేత అగస్త్వేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవములు చైత్ర శుద్ధ ఏకాదశి నుండి పాంచాహ్నికంగా జరుగుతుంది. శరన్నవరాత్రులు, గణపతి నవరాత్రులు నిర్వ హించబడతాయి. మీన రాశి జాతకులు, క్షేత్రం లోని శివాలయంలో అర్చన, అభిషేకములు భక్తితో నిర్వర్తించిన యెడల విశేష ఫలితములు పొందగలరని భక్తజనుల విశ్వాసము.
రవాణా సమాచారం: ద్రాక్షారామం నుంచి యానాం బస్సులు (Via) ఎర్ర పోతవరం, బాలాంత్రం, ఇంజరం మీదగా ప్రతి గంటకు ఉంటాయి. ద్రాక్షారామం నకు సుమారు 7 Kms. దూరంలో బాలాంత్రం బస్ స్టాప్ ఉంటుంది. ఇక్కడ నుంచి పేకేరు గ్రామం నకు రోడ్డు ఉంది. వీటి మధ్యcompletedc దూరం సుమారు 3.5 Kms. గా ఉంటుంది. ఆటోలు ఉండవు. స్వంత వాహనములు కలిగిన వారికి బాగుంటుంది. ద్రాక్షారామం నుంచి పేకేరు కు ఆటోలు ఏర్పాట్టు చేసుకోవాలి. ఇది సౌక్యం.
రవాణా సమాచారం: కాకినాడ - కోటిపల్లి బస్సులు (Via) గొల్లపాలెం, ద్రాక్షారామం, కె.గంగవరం మీదగా ప్రతి గంటకు ఉంటాయి.
రవాణా సమాచారం: రాజమండ్రి - కోటిపల్లి బస్సులు (Via) రామచంద్రాపురం, ద్రాక్షారామం, కె.గంగవరం మీదగా ఉంటాయి.
రవాణా సమాచారం: కె.గంగవరం నుంచి పేకేరు గ్రామం కు (Via) దంగేరు, మీదగా ఆటోలు ఉంటాయి. వీటి మధ్య దూరం సుమారు 9.5 Kms. ఆటోలు ఏర్పాట్టు చేసుకోవాలి.
రవాణా సమాచారం: ద్రాక్షారామం నుంచి మసకపల్లి గ్రామం నకు బస్సులు (Via) కె.గంగవరం, దంగేరు, పేకేరు, భట్లపాలిక మీదగా ఉంటాయి. బస్సులు చాల తక్కువగా ఉంటాయి.
అర్చక స్వామి: ఆలయ అర్చకస్వామి శ్రీ ఉండి శ్రీనివాస రావు, సెల్ నెం: 89788 05843సంప్రదించగలరు.
విజ్ఞప్తి: ద్రాక్షారామ - శ్రీ భీమేశ్వరాలయం యొక్క ఉత్తర ముఖద్వారం వద్ద శ్రీ రాజ రాజేశ్వరి పీఠం వారి నిత్యాన్నదానం సత్రం కలదు.దూర ప్రాంతములు నుంచి ఆలయాలు సందర్శనకు వచ్చిన యాత్రికులకు ఉచ్చిత అన్న ప్రసాదములు వితరణ జరుగును. భక్తులు ముందుగా అన్నప్రాసాదం కోసం ఫోనులో సంప్రాదించాలి.
వీరి Cell 83320 29544.
వీరు వాహనములు కూడ ఏర్పాటు చేస్తారు.
పూర్వాభాద్ర నక్షత్రం స్తోత్రం
ఉతనో హిర్బుద్ధన్య నృణోత్వజ ఏకపాత్ పృథివీ సముద్ర:|
విశ్వేదేవారుతా వృధోహు వానా స్తుతా మంత్రా కవి శస్తా అవంతు||
రోజూ 11 సార్లు పఠించటం వల్ల సర్వశుభాలు కలుగుతాయి.