గమనిక: దైవదర్శనం కొరకు యాత్రికులు కనీసం ఒక రోజు ముందుగా అర్చకస్వామితో సంప్రదించండి. ప్రతి ఏట కొన్ని ఆలయాలలో అర్చక స్వాములు వంతులువారిగా మారుతుంటారు.

తొత్తరమూడి గ్రామం / TOTTARAMUDI VILLAGE

శ్రీ భ్రమరాంబా సమేత మూలేశ్వర  స్వామి

కుంభ రాశి, శతభిషం నక్షత్రం (3వ పాదం)


పాద శివలింగ స్ధానం: చాళుక్యుల భీమ మండలం నందలి ద్రాక్షారామ క్షేత్రానికి నైఋతి దిశగా సుమారు 18 kms. దూరాన తొత్తరమూడి  (Tottaramudi) అను గ్రామం కలదు. ఇచ్చట శ్రీ మూలేశ్వర లింగమును దర్శించగలము. శ్రీ భ్రమరాంబా సమేత మూలేశ్వర స్వామి వారి ఆలయం శతభిషం నక్షత్రం (3వ పాదం) చెందినది.  శ్రీ మూలేశ్వర లింగము భీమసభ నందలి 108 శివ లింగాలలో ఒకటిగా ప్రతీతి. 

స్ధల పురాణం: త్రేతాయుగంలో శ్రీ రామచంద్రమూర్తి ముక్తేశ్వర క్షేత్రం సందర్శించినపుడు శ్రీరాముడితో పాటు వచ్చిన తత్వవేత్తలు, వేదకోవిదులే తొత్తరమూడి గ్రామంలోనే విడిది చేసినారు. దాని వలన ఈ ప్రాంతము “తత్వపురి" గా ఖ్యాతి పొందినది. కొంత కాలము తర్వాత తొత్తరమూడి గా మార్పు చెందినట్లు తెలియుచున్నది. ఈ ప్రాంతం పూర్వం ముని ఖండంగా వుండేదని, మృఖండ మహర్షి ఒక శివలింగం ప్రతిష్టించినట్లు చెప్పుచుంటారు

ఆలయం:  శ్రీ భ్రమరాంబా సమేత మూలేశ్వర స్వామి వారి ఆలయం చాల ప్రాచీనమైనది. కాల క్రమములో ఆలయం పునర్నిర్మాణము జరిగింది. ఆలయ ప్రాంగణములో ఆంజనేయ స్వామి, గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, పార్వతీదేవి మరియు అయ్యప్ప సన్నిధిలు మరియు ప్రధానాలయం, ధ్వజస్ధంభం, చండీశ్వరాలయం, ముఖమండపం, గర్భాలయం ఉంటాయి. ఆలయ గోపుర శిఖరము నందు దేవతా మూర్తులు కలరు. శ్రీ మూలేశ్వర లింగం కి నిత్య అర్చనలు జరుగుతాయి. శ్రీ భ్రమరాంబా సమేత మూలేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవములు వైశాఖ శుద్ధ ఏకాదశి నుండి పాంచాహ్నికంగా జరుగుతుంది. గణపతి నవరాత్రులు, శరన్నవరాత్రులు, సుబ్రహ్మణ్యేశ్వర షష్టి, హనుమ జయింతి, హను మద్ర్వతము, ప్రభల తీర్ధం (కనుమ నాడు) నిర్వహించబడతాయి. కుంభ రాశి జాతకులు, క్షేత్రంలోని శివాలయంలో అర్చన, అభిషేకములు భక్తితో నిర్వర్తించిన యెడల విశేష ఫలితములు పొందగలరని భక్తజనుల విశ్వాసము. 

రవాణా సమాచారం: రావులపాలెం - మురమళ్ళ బస్సులు  (Via) వాడపాలెం, వెలవలపల్లి, ముక్తేశ్వరం మీదగా ఉంటాయి.

* రావులపాలెం - ముక్తేశ్వరం మధ్య దూరం సుమారు 25 Kms.

* ముక్తేశ్వరం నుంచి తొత్తరమూడి కి ఆటోలు ఉంటాయి. వీటి మధ్య దూరం సుమారు 2 Kms.

రవాణా సమాచారం: అమలాపురం - వీరవల్లిపాలెం బస్సులు (Via) ముక్తేశ్వరం మీదగా ఉంటాయి. అమలాపురం - ముక్తేశ్వరం

మధ్య దూరం సుమారు 10 Kms. అమలాపురం నుంచి ముక్తేశ్వరం కు షేరింగ్ ఆటోలు కూడ ఉంటాయి.

* ముక్తేశ్వరం నుంచి తొత్తరమూడి కి ఆటోలు ఉంటాయి. వీటి మధ్య దూరం సుమారు 2 Kms.

రవాణా సమాచారం: కోటిపల్లి రేవు నుంచి ముక్తేశ్వరం రేవుకు Boat సౌకర్యములు ఉంటాయి. ముక్తేశ్వరం రేవు నుంచి ముక్తేశ్వరం కు రవాణ సౌకర్యములు ఉంటాయి. ముక్తేశ్వరం నుంచి తొత్తరమూడి కి ఆటోలు ఉంటాయి. వీటి మధ్య దూరం సుమారు 2 Kms.

అర్చక స్వామి: అర్చకస్వామి శ్రీ చంద్రమౌళి సత్యసాయి బాబ శర్మ, సెల్: 98669 94636 సంప్రదించగలరు. ఇతర అర్చక స్వాములు శ్రీ చంద్రమౌళి నరసింహశర్మ - 99497 29396 & 70957 81744, శ్రీ కంఠం భానోదయ రాజేశ్వరి శర్మ - 94401 19443 & శ్రీ కంఠం చక్రవర్తి - 98669 46365.       

విజ్ఞప్తి: ద్రాక్షారామ - శ్రీ భీమేశ్వరాలయం యొక్క ఉత్తర ముఖద్వారం వద్ద శ్రీ రాజ రాజేశ్వరి పీఠం వారి నిత్యాన్నదానం సత్రం కలదు.దూర ప్రాంతములు నుంచి ఆలయాలు సందర్శనకు వచ్చిన యాత్రికులకు ఉచ్చిత అన్న ప్రసాదములు వితరణ జరుగును. భక్తులు ముందుగా అన్నప్రాసాదం కోసం ఫోనులో సంప్రాదించాలి.

వీరి Cell 83320 29544.

వీరు వాహనములు కూడ ఏర్పాటు చేస్తారు.

శతభిషం నక్షత్రం స్తోత్రం

వరుణస్యో తంభనమసి వరుణస్య స్కంభసర్జనిస్థో|

వరుణస్య రుత సధన్యసీ వరుణస్య రుత సదనమసి

వరుణస్య రుత సదనమాసీద:||

రోజూ 11 సార్లు పఠించటం వల్ల సర్వశుభాలు కలుగుతాయి.

వీడియో వివరణ / Video Description 

ఆడియో వివరణ / Audio Description