గమనిక: దైవదర్శనం కొరకు యాత్రికులు కనీసం ఒక రోజు ముందుగా అర్చకస్వామితో సంప్రదించండి. ప్రతి ఏట కొన్ని ఆలయాలలో అర్చక స్వాములు వంతులువారిగా మారుతుంటారు.
108 నక్షత్ర పాద శివలింగాలు యొక్క Ebook ఉచితంగా Download చేసుకోండి
గమనిక: దైవదర్శనం కొరకు యాత్రికులు కనీసం ఒక రోజు ముందుగా అర్చకస్వామితో సంప్రదించండి. ప్రతి ఏట కొన్ని ఆలయాలలో అర్చక స్వాములు వంతులువారిగా మారుతుంటారు.
వెదురుపాక గ్రామం/ VEDURUPAKA VILLAGE
శ్రీ పార్వతీ సమేత సోమేశ్వర స్వామి
సింహరాశి, పుబ్బ నక్షత్రం (2వ పాదం)
పాద శివలింగ స్ధానం: చాళుక్యుల భీమ మండలం నందలి ద్రాక్షారామ క్షేత్రానికి వాయువ్యం దిశగా, సుమారు 17 kms. దూరాన, వెదురుపాక (Vedurupaka) గ్రామం ఉంటుంది. ఇది తూర్పు గోదావరి జిల్లా, రాయవరం మండలంకు చెందినది. వెదురుపాక నందు శ్రీ పార్వతీ సమేత సోమేశ్వర స్వామి (శివాలయం) కలదు. శ్రీ సోమేశ్వర లింగము భీమసభ నందలి 108 శివ లింగాలలో ఒకటిగా ప్రతీతి.
ఆలయం: ఆలయం చాల ప్రాచీనమైనది. ఆలయ ముఖద్వారం పైన ఓంకారం కలదు. ఆలయ ప్రాంగణములో చండీశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు, వీరభద్రుడు, గణపతి సన్నిధిలు కలవు. శ్రీ సోమేశ్వర స్వామికి నిత్య అర్చనలు జరుగుతాయి. స్వామివారి కళ్యాణోత్సవములు వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు పాంచాహ్నికంగా జరుగుతుంది. శరన్నవ రాత్రులు, గణపతి నవరాత్రులు వైభవోపేతంగా జరుగుతాయి. సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భముగా మూడురోజుల పాటు శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణం జరుగుతుంది.
సింహరాశి జాతకులు, క్షేత్రం లోని శివాలయంలో అర్చన, అభిషేకములు భక్తితో నిర్వర్తించిన యెడల విశేష ఫలితములు పొందగలరని భక్తజనుల విశ్వాసము. వెదురుపాక గ్రామంలో విజయదుర్గాపీఠం, శ్రీదేవి, భూదేవి సమేత జనార్ధనస్వామి మరియు శ్రీ రమాసమేత సత్యనారాయణ స్వామి వారి ఆలయములు కలవు.
రవాణా సమాచారం 1: రామచంద్రపురం - అనపర్తి బస్సులు (Via) రాయవరం మీదగా ఉంటాయి. రాయవరం దాటగానే శ్రీ పొలమ్మ తల్లి పుట్ట వస్తుంది. ప్రయాణికులు పొలమ్మ పుట్ట వద్ద దిగాలి. ఇక్కడ నుంచి వెదురుపాక గ్రామం నకు ఆటోలు ఉంటాయి. వీటి మధ్య దూరం సుమారు 3 కీల్లో మిటార్లుగా ఉంటుంది.
రవాణా సమాచారం 2: రామచంద్రపురం నుంచి వెదురుపాక కు (వయా) పసలపూడి మీదగా ఆటోలు రాను-పోను ఏర్పాట్టు చేసుకోవచ్చు. వీటి మధ్య దూరం సుమారు 11 కీల్లో మిటార్లుగా ఉంటుంది.
కొత్తూరు మీదగా వెదురుపాక కు మార్గం ఉంది.
అర్చక స్వామి: ఆలయ అర్చకులు శ్రీ యలమంచలి సుబ్రహ్మణ్యం, సెల్ నెం : 89856 84897 సంప్రదించగలరు.
విజ్ఞప్తి: ద్రాక్షారామ - శ్రీ భీమేశ్వరాలయం యొక్క ఉత్తర ముఖద్వారం వద్ద శ్రీ రాజ రాజేశ్వరి పీఠం వారి నిత్యాన్నదానం సత్రం కలదు. దూర ప్రాంతములు నుంచి ఆలయాలు సందర్శనకు వచ్చిన యాత్రికులకు ఉచ్చిత అన్న ప్రసాదములు వితరణ జరుగును. భక్తులు ముందుగా అన్నప్రాసాదం కోసం ఫోనులో సంప్రాదించాలి.
వీరి Cell 83320 29544.
వీరు వాహనములు కూడ ఏర్పాటు చేస్తారు.
పుబ్బ నక్షత్రం స్తోత్రం
భగప్రాణోత్ భర్గ సత్య రాధో|
భగే మధియముదవాదదన్న భగయే ప్రణోజన యగోభి
రశ్వైర్భయ ప్రనృభి న్రై: వస్యామ్||
రోజూ 11 సార్లు పఠించటం వల్ల సర్వశుభాలు కలుగుతాయి.