గమనిక: దైవదర్శనం కొరకు యాత్రికులు కనీసం ఒక రోజు ముందుగా అర్చకస్వామితో సంప్రదించండి. ప్రతి ఏట కొన్ని ఆలయాలలో అర్చక స్వాములు వంతులువారిగా మారుతుంటారు.
108 నక్షత్ర పాద శివలింగాలు యొక్క Ebook ఉచితంగా Download చేసుకోండి
గమనిక: దైవదర్శనం కొరకు యాత్రికులు కనీసం ఒక రోజు ముందుగా అర్చకస్వామితో సంప్రదించండి. ప్రతి ఏట కొన్ని ఆలయాలలో అర్చక స్వాములు వంతులువారిగా మారుతుంటారు.
సత్యవాడ గ్రామం / SATYAWADA VILLAGE
శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి
మకర రాశి, ఉత్తరాషాడ నక్షత్రం (3వ పాదం)
పాద శివలింగ స్ధానం: చాళుక్యుల భీమ మండలం నందలి ద్రాక్షారామ క్షేత్రానికి నైఋతి దిశగా సుమారు 10 kms. దూరాన సత్యవాడ (Satyawada) అను గ్రామం కలదు. ఇచ్చట శ్రీ సోమేశ్వర లింగమును దర్శించగలము. శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి వారి ఆలయం ఉత్తరాషాడ నక్షత్రం (3వ పాదం) చెందినది. శ్రీ సోమేశ్వర లింగము భీమసభ నందలి 108 శివ లింగాలలో ఒకటిగా ప్రతీతి.
ఆలయం: శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి వారి ఆలయం చాల ప్రాచీనమైనది. కాల క్రమములో ఆలయం పునర్నిర్మాణము జరిగింది. ఆలయ ప్రాంగణములో ధ్వజస్ధంభం, చండీశ్వరాలయం, ముఖమండపం, గర్భాలయం ఉంటాయి. అంతరాలయంలో గణపతి, సుబ్రహ్మణ్యేశ్వరుడు కొలువై ఉన్నారు. ఆలయ గోపుర శిఖరము నందు దేవతా మూర్తులు కలరు. శ్రీ సోమేశ్వర లింగం కి నిత్య అర్చనలు జరుగుతాయి. శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవములు చైత్ర శుద్ధ ఏకాదశి నుంచి పాంచాహ్నికంగా జరుగుతుంది. మకర రాశి జాతకులు, క్షేత్రం లోని శివాలయంలో అర్చన, అభిషేకములు భక్తితో నిర్వర్తించిన యెడల విశేష ఫలితములు పొందగలరని భక్తజనుల విశ్వాసము.
రవాణా సమాచారం: కాకినాడ నుంచి కోరుమిల్లి గ్రామం నకు (Via) గొల్లపాలెం, ద్రాక్షారామం, కె.గంగవరం, సత్యవాడ, టేకి మీదగా బస్సులు ఉంటాయి.
* కాకినాడ నుండి ప్రతిరోజూ నాలుగు ట్రిప్పులు బస్సు సర్వీసు అందుబాటులో ఉన్నాయి.
రవాణా సమాచారం: కాకినాడ నుంచి కోటిపల్లి గ్రామం నకు (Via) గొల్లపాలెం, ద్రాక్షారామం, కె.గంగవరం మీదగా బస్సులు ప్రతి అరగంటకు ఉంటాయి.
* కె.గంగవరం నుంచి అంగర కు షేరింగ్ ఆటోలు (Via) సత్యవాడ, పామర్రు, టేకి మీదగా ఉంటాయి. కె.గంగవరం నుంచి సత్యవాడ దూరం సుమారు 3 Kms.
రవాణా సమాచారం: రావులపాలెం నుంచి కాకినాడ కు (Via) ఆలమూరు, అంగర, టేకి, సత్యవాడ, కె.గంగవరం, ద్రాక్షారామం, గొల్లపాలెం మీదగా బస్సులు పరిమితంగా ఉంటాయి.
అర్చక స్వామి: ఆలయ అర్చకస్వామి శ్రీ రామేశ్వరపు వెంకటేశ్వరరావు, సెల్ నెం: 94920 74141సంప్రదించగలరు.
విజ్ఞప్తి: ద్రాక్షారామ - శ్రీ భీమేశ్వరాలయం యొక్క ఉత్తర ముఖద్వారం వద్ద శ్రీ రాజ రాజేశ్వరి పీఠం వారి నిత్యాన్నదానం సత్రం కలదు.దూర ప్రాంతములు నుంచి ఆలయాలు సందర్శనకు వచ్చిన యాత్రికులకు ఉచ్చిత అన్న ప్రసాదములు వితరణ జరుగును. భక్తులు ముందుగా అన్నప్రాసాదం కోసం ఫోనులో సంప్రాదించాలి.
వీరి Cell 83320 29544.
వీరు వాహనములు కూడ ఏర్పాటు చేస్తారు.
ఉత్తరాషాఢ నక్షత్రం స్తోత్రం
విశ్వేదేవా శ్రుణుతేమ హవమేయే అంతరిక్షేయ ఉప ఘవిష్టమ్|
అగ్నిజిహ్వా ఉతవాయజత్రా అసాధ్యా స్మిన్హా మదాయ ధ్వమ్||
రోజూ 11 సార్లు పఠించటం వల్ల సర్వశుభాలు కలుగుతాయి.