గమనిక: దైవదర్శనం కొరకు యాత్రికులు కనీసం ఒక రోజు ముందుగా అర్చకస్వామితో సంప్రదించండి. ప్రతి ఏట కొన్ని ఆలయాలలో అర్చక స్వాములు వంతులువారిగా మారుతుంటారు.

కాపులపాలెం గ్రామం / KAPULAPALEM VILLAGE

శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి

మీన రాశి, రేవతి నక్షత్రం (2వ పాదం)


పాద శివలింగ స్ధానం: చాళుక్యుల భీమ మండలం నందలి ద్రాక్షారామ క్షేత్రానికి ఆగ్నేయం దిశగా, సుమారు 17 kms. దూరాన, కాపులపాలెం (Kapulapalem) అను గ్రామం కలదు. ఇచ్చట శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి ఆలయం ఉంది. పూర్వం శ్రీ వీరభద్రేశ్వర స్వామి ఆలయంగా పిలిచేవారు. కాలక్రమంలో శ్రీ వీరేశ్వర స్వామి ఆలయంగా వాడకలోనికి వచ్చింది. శ్రీ వీరేశ్వర లింగము భీమసభ నందలి 108 శివ లింగాలలో ఒకటిగా ప్రతీతి.

ఆలయం: శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి ఆలయం చాల ప్రాచీనమైది. కాల క్రమములో గ్రామస్తుల సహాయంతో శివాలయం పునర్నార్మించారు. ఆలయ ప్రాంగణము చాల విశాలముగా ఉంటుంది. ఆలయ ప్రవేశం ఉత్తర ద్వారం నుంచి జరుగుతుంది. ప్రధానాలయం తూర్పు అభిముఖంగా ఉంటుంది. ఆలయ ప్రాంగణములో ప్రధానాలయంతో పాటు ధ్వజస్తంభం, కాలభైరవుడు, నవగ్రహ మండపం, హోమగుండం, చండీశ్వరుడు, భారీ శివాకృతి మొదలగునవి ఉంటాయి. ముఖమండపం నందు నందీశ్వరుడు, గణపతి, భద్రకాళి దేవి సన్నిధిలు, ద్వారపాలకులు ఉంటారు. అంతరాలయం నందు చిన్న నంది విగ్రహం ఉంది. గర్భాలయంలో శ్రీ వీరేశ్వర లింగము దర్శనమిస్తుంది. స్వామిని సేవించిన వారు విశేష ఫలాలను పొందగలరు అని భక్తుల విశ్వాసం. ఆలయం నందు ప్రతి నిత్యం అర్చనలు, అభిషేకాలు, శాంతులు నిర్వహించుతారు. స్వామి వారి కళ్యాణం వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు జరుగుతుంది. ఆలయం నందు కార్తీక మాసంలో విశేష పూజలు జరుగుతాయి. శరన్నవరాత్రులు, గణపతి నవరాత్రులు జరుగుతాయి. మహాశివరాత్రి సందర్భముగా విశేష అభిషేకాలు ఉంటాయి. సంక్రాంతి, దీపావళీ మొదలగు పర్వదినాలు సందర్భముగా పూజలు విశేషంగా ఉంటాయి.

రవాణా సమాచారం: ద్రాక్షారామం - యానాం బస్సులు (Via) ఎర్ర పోతవరం, బాలాంత్రం, కుయ్యేరు, ఇంజరం, కాపులపాలెం మీదగా ప్రతి గంటకు ఉంటాయి.

* ద్రాక్షారామం - యానాం రోడ్డు మార్గములో కాపులపాలెం ఉంది. యానాం రోడ్డు ఆనుకుని, కనకలపేట రోడ్ కు సమీపంలోనే శివాలయం ఉంటుంది.

రవాణా సమాచారం:కాకినాడ నుంచి యానాం కు బస్సులు (Via) చొల్లంగి, తాళ్ళరేవు, నీలపల్లి మీదగా ప్రతి గంటకు ఉంటాయి.

రవాణా సమాచారం: యానాం బైపాస్ రోడ్ (Sri Ravi Junior & Degree College, Near Yanam Bi Pass Sunkarapalem, Andhra Pradesh) నుంచి కాపులపాలెం గ్రామం నకు బస్సులు, ఆటోలు దొరుకుతాయి. వీటి మధ్య దూరం సుమారు 01 kms.

అర్చక స్వామి: ఆలయ అర్చక స్వామి అయిన శ్రీ కంఠం శేషగిరి రావు. సెల్ నెం. 6301324677 సంప్రదించగలరు.

విజ్ఞప్తి: ద్రాక్షారామ - శ్రీ భీమేశ్వరాలయం యొక్క ఉత్తర ముఖద్వారం వద్ద శ్రీ రాజ రాజేశ్వరి పీఠం వారి నిత్యాన్నదానం సత్రం కలదు.దూర ప్రాంతములు నుంచి ఆలయాలు సందర్శనకు వచ్చిన యాత్రికులకు ఉచ్చిత అన్న ప్రసాదములు వితరణ జరుగును. భక్తులు ముందుగా అన్నప్రాసాదం కోసం ఫోనులో సంప్రాదించాలి.

వీరి Cell 83320 29544.

వీరు వాహనములు కూడ ఏర్పాటు చేస్తారు.

పూర్వాభాద్ర నక్షత్రం స్తోత్రం

తనో హిర్బుద్ధన్య నృణోత్వజ ఏకపాత్‌ పృథివీ సముద్ర:|

విశ్వేదేవారుతా వృధోహు వానా స్తుతా మంత్రా కవి శస్తా అవంతు||

రోజూ 11 సార్లు పఠించటం వల్ల సర్వశుభాలు కలుగుతాయి.

వీడియో వివరణ / Video Description

ఆడియో వివరణ / Audio Description