గమనిక: దైవదర్శనం కొరకు యాత్రికులు కనీసం ఒక రోజు ముందుగా అర్చకస్వామితో సంప్రదించండి. ప్రతి ఏట కొన్ని ఆలయాలలో అర్చక స్వాములు వంతులువారిగా మారుతుంటారు.

పసలపూడి గ్రామం / PASALAPUDI VILLAGE

శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ రాజరాజేశ్వర స్వామి

కన్యారాశి, ఉత్తర నక్షత్రం (4వ పాదం)

పాద శివలింగ స్ధానం: చాళుక్యుల భీమ మండలం నందలి ద్రాక్షారామ క్షేత్రానికి వాయువ్యం దిశగా, సుమారు 10 kms. దూరాన పసలపూడి గ్రామం (Pasalapudi) కలదు. కాకినాడ - రామచంద్రపురం - మండపేట రోడ్డు మార్గములో పసలపూడి గ్రామం ఉంటుంది. ఇచ్చట శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం కలదు. శ్రీ రాజరాజేశ్వర లింగము భీమసభ నందలి 108 శివ లింగాలలో ఒకటిగా ప్రతీతి.

ఆలయం: పసలపూడి గ్రామం లోని శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం చాల ప్రాచీనమైనది. కాల క్రమములో ఆలయం పునర్నిర్మాణము జరిగింది. ఆలయ ప్రాంగణము విశాలముగా ఉంటుంది. ఆలయ ప్రవేశం పశ్చిమ గాలిగోపురం నుంచి జరుగుతుంది. గాలిగోపురం నకు ఇరువైపుల ప్రవేశ ద్వారములున్నాయి.

ఆలయ ప్రాంగణములో ధ్వజ స్ధంబం, బలిపీఠం, నవగ్రహ మండపం, స్వామి వారి కళ్యాణ మండపం, యాగశాల, చండీశ్వరుడు, ప్రధానాలయం మొదలగునవి ఉంటాయి.

ముఖ మండపం నందు నందీశ్వరుడు, ద్వారపాలకులు దర్శనమిస్తారు. అంతరాలయం నందు ఉత్సవమూర్తులు, గణపతి కలరు. గర్భాలయం నందు శ్రీ రాజరాజేశ్వర లింగము దర్శనమిస్తుంది. స్వామి వామ భాగం నందు శ్రీ మాణిక్యాంబ దేవి కొలువుదీరింది. ఆలయం నందు ప్రతి నిత్యం అర్చనలు, అభిషేకాలు, శాంతులు నిర్వహించుతారు. స్వామి వారి కళ్యాణం ఫాల్గుణ శుద్ధ ఏకాదశి నాడు జరుగుతుంది.

శ్రీ రాజరాజేశ్వర లింగము, ఉత్తర నక్షత్రం (4వ పాదం) చెందినది. ఉత్తర నక్షత్రం నందలి 4వ పాదము లో జన్మంచిన స్త్రీ వలన తల్లికి, పురుషుడు వలన తండ్రికి దోషం కలుగను. ఉత్తర నక్షత్రం (4వ పాదం) నందు జన్మించిన వారికి అభిషేక శాంతులు నిర్వహించుతారు.

ఆలయం నందు కార్తీక మాసంలో విశేష పూజలు జరుగుతాయి. శివమాల కార్యక్రామాలు ఉంటాయి. కార్తీక పౌర్ణమి నాడు జ్వాలా తోరణము జరుపుతారు. మహాశివరాత్రి సందర్భముగా విశేష అభిషేకాలు ఉంటాయి. లింగోద్భవ కాలం వరకు 108 బిందెల పాలుతో శివునికి అభిషేకం జరుగుతుంది. శరన్నవరాత్రులు సందర్భంగా తొమ్మిది రోజులు పాటు విశేష అలంకార అర్చనలు వైభవంగా జరుగుతాయి.

నక్షత్ర శాంతి కోసం ఆలయ అర్చక స్వామి: శ్రీ పరిటాల ధామకర్ లక్ష్మీ భీమేశ్వర శ్రీనివాస్, సెల్ నెం. 9618963333 సంప్రదించగలరు.

రవాణా సమాచారం 1: ద్రాక్షారామం నకు వాయువ్య దిశగా, సుమారు 7 kms. దూరంలో రామచంద్రాపురం ఉంటుంది. ద్రాక్షారామం నుంచి రామచంద్రాపురం కు బస్సులు / ఆటోలు దొరుకుతాయి.

రవాణా సమాచారం 2: రామచంద్రాపురం బస్ స్టాండ్ నుంచి పసలపూడి గ్రామం కు బస్సులు దొరుకుతాయి. కాకినాడ - రావులపాలెం బస్సులు మరియు కోటిపల్లి - రాజమండ్రి & యానాం - రాజమండ్రి బస్సులు (via) రామచంద్రాపురం, పసలపూడి మీదగా ఉంటాయి.

రవాణా సమాచారం 3: రామచంద్రాపురం నుంచి పసలపూడి గ్రామం నకు ఆటోలు సౌక్యర్యంములు కలవు. రామచంద్రాపురం RTC బస్ స్టాండ్ నుంచి పసలపూడి మధ్య దూరం సుమారు 4.5 Kms.

అర్చక స్వామి: ఆలయ సమాచారం & Photos అందించిన పసలపూడి - శ్రీ రాజరాజేశ్వర స్వామి, ఆలయ అర్చక స్వామి అయిన శ్రీ పరిటాల ధామకర్ లక్ష్మీ భీమేశ్వర శ్రీనివాస్, సెల్ నెం. 9618963333 గార్కి నా నమసుమాంజలి.

విజ్ఞప్తి: ద్రాక్షారామ - శ్రీ భీమేశ్వరాలయం యొక్క ఉత్తర ముఖద్వారం వద్ద శ్రీ రాజ రాజేశ్వరి పీఠం వారి నిత్యాన్నదానం సత్రం కలదు. దూర ప్రాంతములు నుంచి ఆలయాలు సందర్శనకు వచ్చిన యాత్రికులకు ఉచ్చిత అన్న ప్రసాదములు వితరణ జరుగును. భక్తులు ముందుగా అన్నప్రాసాదం కోసం ఫోనులో సంప్రాదించాలి.

వీరి Cell 83320 29544.

వీరు వాహనములు కూడ ఏర్పాటు చేస్తారు.

ఉత్తర నక్షత్రం స్తోత్రం

దేవావ ధ్వర్యూశ్చ గతాస్థేన సూర్యాత్వచా మధ్వాయణం|

సమంజాథో తం ప్రత్నయాయం వినాశ్చిత్రం దేవానామ్‌||

రోజూ 11 సార్లు పఠించటం వల్ల సర్వశుభాలు కలుగుతాయి.