గమనిక: దైవదర్శనం కొరకు యాత్రికులు కనీసం ఒక రోజు ముందుగా అర్చకస్వామితో సంప్రదించండి. ప్రతి ఏట కొన్ని ఆలయాలలో అర్చక స్వాములు వంతులువారిగా మారుతుంటారు.

పెనుమళ్ళ గ్రామం / PENUMALLA VILLAGE

శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి

మిధునరాశి, ఆరుద్ర నక్షత్రం (1వ పాదం)

అష్ట సోమేశ్వరాలయాలు (ఈశాన్య క్షేత్రం)

పాద శివలింగ స్ధానం: ద్రాక్షారామ క్షేత్రానికి ఈశాన్యం దిశగా, సుమారు 10 kms. దూరాన, పెనుమళ్ళ గ్రామం (Penumalla) కలదు. ఇచ్చట శ్రీ పార్వతీ సమేత  శ్రీ సోమేశ్వర స్వామి ఆలయం ఉంది. శ్రీ సోమేశ్వర లింగము భీమసభ నందలి 108 శివ లింగాలలో ఒకటిగా ప్రతీతి.

ఆలయం: దక్షప్రజాపతి యజ్ఞం చేసిన 'దక్షవాటిక' ను ద్రాక్షారామగా పిలుస్తారు. లోక ఖ్యాతి పొందిన పంచారామాల్లో ద్రాక్షారామ క్షేత్రం ఒకటి.  దక్షిణ కాశీగా పిలువబడే ద్రాక్షారామ క్షేత్రం నందలి శ్రీ భీమేశ్వర లింగము 'సూర్య యంత్ర' ప్రతిష్ట. ఆ రుద్రమూర్తిని శాంతపరచేందుకు ద్రాక్షారామ క్షేత్రం చుట్టూ ఎనిమిది 'చంద్ర యంత్ర'  ప్రతిష్టలు జరిగినాయి. వీటిని సోమేశ్వర ఆలయాలుగా పిలుస్తారు. చంద్రుడిని సోముడు అని కూడ పిలుస్తారు. సోము ప్రతిష్ట శివాలయాలను అష్ట సోమేశ్వరాలయాలు అని అంటారు. ఇవి ద్రాక్షారామం పరిసరాల్లోనే ఉంటాయి. వీటి సందర్శనం వలన చంద్ర గ్రహ దోష నివృత్తి కలుగుతుంది. పౌర్ణమి, అమావాస్య రోజు జన్మించినవారికి చాలా సమస్యలు ఉంటాయి. మానసిక చాంచల్యం, చంద్ర మహర్దశ, చంద్ర అంతర్దశ, జరుగుతున్న వాళ్లు, చంద్రుడి నక్షత్రంలో జన్మించిన ( రోహిణి, హస్త నక్షత్రం) మొదలగు వారు అష్ట సోమేశ్వర క్షేత్రాలను దర్శిస్తే, తప్పకుండా శివానుగ్రహం కలుగుతుంది అనే నమ్మకం భక్తులలో ఉంది. అష్ట సోమేశ్వరాలయాలల్లో పెనుమళ్ళ గ్రామం లోని శ్రీ సోమేశ్వరాలయం ఒకటిగా ప్రతీతి. ద్రాక్షారామ క్షేత్రం నకు ఈశాన్యం దిశలో పెనుమళ్ళ గ్రామం ఉంటుంది.

స్వాతంత్యం పూర్వం నిజాము నవాబులు పాలన నందు గోదావరి ప్రాంతము జమీందార్లు ఆధీనంలో ఉండేది. వీరిలో రాంపా, పెద్దాపురం, పిఠాపురం, కోట, రామచంద్రపురం జమీందార్లు ముఖ్యమైన వారు. అప్పటి ఆలయాలు జమీందార్లు సంరక్షణలో ఉండేవి. వీరు తమ ప్రాంతము లోని ఆలయాలకు ఆర్ధిక పోషణ, జీర్ణోధరణ పనులు చేబట్టేవారు. తరవాత కాలములో నిజాము నవాబులు గోదావరి జిల్లాను ఆంగ్లేయులకు బదిలీ చేయడం జరిగింది. రామచంద్రపురం రాజా వారు పెనుమళ్ళ గ్రామము లోని శ్రీ సోమేశ్వర స్వామి ఆలయం నకు అభివృద్ధి పనులు మరియు స్వామి వారి కైంకర్య నిముత్తం భూములు దానం చేసారు. నాటి నుంచి స్వామి వారు ' రాజ సోమేశ్వర స్వామి ' గా కీర్తి పొందినారు. క్షేత్రం నందు అమ్మ వారిని ' రాజరాజేశ్వరి దేవి ' గా పిలిచేవారు. కాలక్రమేణా అమ్మను ' పార్వతీ దేవి ' గా సంభోదిచుట జరుగుతుంది.

ఆలయ ప్రాంగణం చాల విశాలముగా ఉంటుంది. ఆలయ ప్రాంగణములో ధ్వజ స్ధంబం, నంది విగ్రహం, ప్రధానాలయం, చండీశ్వరుడు, కళ్యాణ మండపం, సంతాన వృక్షం (రావి & వేప), నాగ ప్రతిమలు మొదలగునవి ఉంటాయి. రావిచెట్టు పురుషునిగా, వేపచెట్టు స్త్రీగాను భావించి పూజిస్తారు. రావిచెట్టు విష్ణు స్వరూపం, వేపచెట్టును లక్ష్మీ స్వరూపంగా భావించి ప్రదక్షిణలు చేస్తారు. ఈ జంట వృక్షాలను పూజిస్తే దాంపత్య దోషాలు పరిష్కారమై కాపురం అన్యోన్యంగా సాగుతుందని పండితులు చెబుతుంటారు. రావిచెట్టు గురించి పద్మపురాణంలోనూ వివరించారు. ఈ చెట్టులోని అణువణువు నారాయణ స్వరూపమే అని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి.

ఆలయ ప్రాంగణ ప్రవేశం ఉత్తర ద్వారం నుంచి జరుగుతుంది. ప్రధానాలయం తూర్పు అభిముఖం గా ఉంటుంది. నంది మండపం, ముఖ మండపం, అంతరాలయం, గర్భాలయం ఉంటాయి. గర్భాలయం నందు  శ్రీ రాజ సోమేశ్వర స్వామి కొలువై యున్నాడు.  అంతరాలయం నందు ఉత్సవ మూర్తులు, గణపతి దర్శనమిస్తాయి. ముఖ మండపం నందు శ్రీ పార్వ తీ దేవి దక్షిణాభి ముఖంగా కొలువుదీరింది. శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి సన్నిధి ఉత్తర ముఖంగా ఉంటుంది. ఇచ్చటనే వీరభద్ర స్వామి దర్శనం కూడ లభ్యమవుతుంది. నంది మండపం నందు నందీశ్వరుడు, ద్వారపాలకులు కలరు. నంది విగ్రహం నకు నైఋతి మూల నాగ ప్రతిమ కలదు.  నాగ శిరస్సు మీద ఒక శివ లింగము సుదరంగా ఉంటుంది. నాగ ప్రతిష్ట క్రింద నాగ యంత్రం మరియు సంతాన గోపాలస్వామి యంత్రం ప్రతిష్టించబడ్డాయి. ప్రతి మంగళవారం  నాగ ప్రతిమ కు అభిషేకాలు జరుగుతాయి.

జాతకచక్రంలో నాగదోషం వలన ముఖ్యంగా వివాహం ఆలస్యం కావటం, సంతాన సమస్యలు ఎదుర్కోవటం జరుగుతుంది. నాగదోషం ఉన్న జాతకులకు అశాంతి కలిగంచే పరిస్థితులు ఏర్పడతాయి. సంతానం కలుగకపోవడంతో పాటు ఆర్థిక సమస్యలు, వివాహంలో జాప్యం, అంగవిహీనులైన సంతతి జన్మించడం, పుత్రశోకం, వైవాహిక జీవితంలో ఆటంకాలు నాగదోషము వల్లనే ఏర్పడుతాయని పురాణాలు చెబుతున్నాయి.

సంతాన గోపాల స్వామి యంత్రం వలన గర్భస్రావం నుండి తల్లులను రక్షించడానికి మరియు శిశువుకు సురక్షితంగా ప్రసవించేలా చేస్తుంది.

ఆలయం నందు నిత్యం భారీ శ్రీ రాజ సోమేశ్వర లింగము నకు అభిషేకాలు, అర్చనలు జరుగుతాయి. వీటితో పాటు గ్రహ అభిషేక శాంతులు నిర్వహించుతారు.  స్వామి వారి కళ్యాణం వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు వైభవంగా జరుగుతుంది.  మహా శివరాత్రి సందర్భముగా విశేష అభిషేకాలు నిర్వహించుతారు. ఉదయం 6:00 గంటలు నుంచి భజన కార్యాక్రమాలు జరుగుతాయి.  ఆలయం నందు కార్తీక మాసంలో విశేష పూజలు జరుగుతాయి. శరన్నవరాత్రులు, గణపతి నవరాత్రులు, సుబ్బారాయుడు షష్ఠి వేడుకులు వైభవంగా జరుగుతాయి. సుబ్బారాయుడు షష్ఠికి ముందు రోజు అనగా పంచమి నాడు సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణోత్సవాలు ఘనంగా నిర్వహించుతారు

రవాణా సమాచారం 1: కాకినాడ - కోటిపల్లి బస్సులు (Via) గొల్లపాలెం, జగన్నాధగిరి, ఉండూరు, ద్రాక్షారామం మీదగా ప్రతి గంటకు ఉంటాయి. కాకినాడ నుంచి ద్రాక్షారామం నకు షేరింగ్ ఆటోలు కూడ దొరుకుతాయి. కాకినాడ పాత బస్ స్టాండ్ మరియు కాకినాడ జగన్నాధపురం బ్రిడ్జి నుంచి ద్రాక్షారామం నకు షేరింగ్ ఆటోలు బయలుదేరుతాయి.

రవాణా సమాచారం 2: గొల్లపాలెం చిరు పట్టణం నందు ఆటో స్టాండ్ ఉంది.  గొల్లపాలెం నుంచి ఆటోలు ఎక్కువగా ఉంటాయి. గొల్లపాలెం నుంచి పెనుమళ్ళ గ్రామం నకు ఆటో ప్రయాణం (via) జగన్నాధగిరి మీదగా ఉంటుంది. వీటి మధ్య దూరం 8 Kms. గా ఉండును.  ఈ ప్రయాణం సౌక్యం. 

రవాణా సమాచారం 3: ద్రాక్షారామం నుంచి పెనుమళ్ళ గ్రామం నకు ఆటో రాను - పోను ఏర్పాట్లు చేసుకోవటం సౌక్యం. ఆటోలు (via) ఉండూరు మీదగా ఉంటాయి. ఉండూరు దాటిన తరువాత ఉండూరు బ్రిడ్జి వస్తుంది.

రవాణా సమాచారం 4: ఉండూరు బ్రిడ్జి నుంచి కాలువ గట్టు మీదగా  పెనుమళ్ళ ఆటోలు చేరుకొంటాయి. ద్రాక్షారామం - పెనుమళ్ళ మధ్య దూరం 9.7 Kms. గా ఉండును.  ఈ మార్గం బాగుటుంది.

అర్చక స్వామి: మాకు సహకరించిన పెనుమళ్ళ అర్చక స్వామి శ్రీ కాళ్ళకూరి కామేశ్వరరావు, సెల్: 9848422988 గార్కి మరియు శ్రీ కొత్తలంక రామరావు, తనుమళ్ళ గ్రామం గార్కి నా నమసుమాంజలి.

విజ్ఞప్తి: ద్రాక్షారామ - శ్రీ భీమేశ్వరాలయం యొక్క ఉత్తర ముఖద్వారం వద్ద శ్రీ రాజ రాజేశ్వరి పీఠం వారి నిత్యాన్నదానం సత్రం కలదు. దూర ప్రాంతములు నుంచి ఆలయాలు సందర్శనకు వచ్చిన యాత్రికులకు ఉచ్చిత అన్న ప్రసాదములు వితరణ జరుగును. భక్తులు ముందుగా అన్నప్రాసాదం కోసం ఫోనులో సంప్రాదించాలి.

వీరి Cell 83320 29544.

వీరు వాహనములు కూడ ఏర్పాటు చేస్తారు.

ఆరుద్ర నక్షత్రం స్తోత్రం

నమస్తే రుద్ర మానవ్య ఉతో త ఇషవరె నమ:

బాహుభ్యా ముమతే నమ:

రోజూ 11 సార్లు పఠించటం వల్ల సర్వశుభాలు కలుగుతాయి.

వీడియో వివరణ / Video Description

ఆడియో వివరణ / Audio Descriptioneo Description