గమనిక: దైవదర్శనం కొరకు యాత్రికులు కనీసం ఒక రోజు ముందుగా అర్చకస్వామితో సంప్రదించండి. ప్రతి ఏట కొన్ని ఆలయాలలో అర్చక స్వాములు వంతులువారిగా మారుతుంటారు.
కొప్పవరం గ్రామం / KOPPAVARAM VILLAGE
శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి
కన్యారాశి, చిత్త నక్షత్రం (1వ పాదం)
పాద శివలింగ స్ధానం: చాళుక్యుల భీమ మండలం నందలి ద్రాక్షారామ క్షేత్రానికి వాయువ్యం దిశగా, సుమారు 23 kms. దూరాన, కొప్పవరం (Koppavaram) గ్రామం ఉంటుంది. ఇది తూర్పు గోదావరి జిల్లా, అనపర్తి మండలంకు చెందినది. కొప్పవరం నందు శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి (శివాలయం) కలదు. శ్రీ రామలింగేశ్వర లింగము భీమసభ నందలి 108 శివ లింగాలలో ఒకటిగా ప్రతీతి.
ఆలయం: ఆలయం చాల ప్రాచీనమైనది. పునర్నిర్మాణము జరిగింది. ప్రాంగణములో ధ్వజస్ధంభం, చండీశ్వరాలయం, ముఖమండపం, గర్భాలయం ఉంటాయి. ఆగ్నేయంలో నాగబంధము, గణపతి మరియు అయ్యప్పస్వామి విగ్రహాలు అందరూ అర్చించుకొనడానికి వీలుగా ప్రతిష్టించ బడ్డాయి. ఆలయ గోపుర శిఖరము నందు దేవత మూర్తులు కలరు. అంతరాలయంలో శ్రీమహాగణపతి కొలువై వున్నారు.
శ్రీ రామలింగేశ్వర స్వామికి నిత్య అర్చనలు జరుగుతాయి. స్వామి వారి కళ్యాణోత్సవములు వైశాఖ బహుళ ఏకాదశి నాడు పాంచాహ్నికంగా జరుగుతుంది. శరన్నవరాత్రులు, గణపతి నవరాత్రులు నిర్వహించబడతాయి. కన్యారాశి జాతకులు, క్షేత్రం లోని శివాలయంలో అర్చన, అభిషేకములు భక్తితో నిర్వర్తించిన యెడల విశేష ఫలితములు పొందగలరని భక్తజనుల విశ్వాసము.
రవాణా సమాచారం: అనవర్తి గ్రామానికి సమీపమున కొప్పవరం కలదు. అనపర్తి (దేవి చౌక్) నుండి ఆటో లేదా స్వంత వాహనంపై కొప్పవరం క్షేత్రమునకు చేరవచ్చును. వీటి మధ్య దూరం సుమారు 3 kms.
అర్చక స్వామి: ఆలయ అర్చకులు శ్రీ కాళ్ళకూరి ప్రసాద్ శర్మ, సెల్ నెం: 99089 17888 సంప్రదించగలరు.
విజ్ఞప్తి: ద్రాక్షారామ - శ్రీ భీమేశ్వరాలయం యొక్క ఉత్తర ముఖద్వారం వద్ద శ్రీ రాజ రాజేశ్వరి పీఠం వారి నిత్యాన్నదానం సత్రం కలదు. దూర ప్రాంతములు నుంచి ఆలయాలు సందర్శనకు వచ్చిన యాత్రికులకు ఉచ్చిత అన్న ప్రసాదములు వితరణ జరుగును. భక్తులు ముందుగా అన్నప్రాసాదం కోసం ఫోనులో సంప్రాదించాలి.
వీరి Cell 83320 29544.
వీరు వాహనములు కూడ ఏర్పాటు చేస్తారు.
చిత్త నక్షత్రం స్తోత్రం
త్వష్టా తురీయో అద్భుత ఇంద్రాగ్నీ పుష్టిర్వర్ధనమ్|
ద్విపద ఛందా ఇంద్రాయముక్షా గౌత్ర వయోదధ:||
రోజూ 11 సార్లు పఠించటం వల్ల సర్వశుభాలు కలుగుతాయి.