గమనిక: దైవదర్శనం కొరకు యాత్రికులు కనీసం ఒక రోజు ముందుగా అర్చకస్వామితో సంప్రదించండి. ప్రతి ఏట కొన్ని ఆలయాలలో అర్చక స్వాములు వంతులువారిగా మారుతుంటారు.
చింతలూరు గ్రామం / CHITALURU VILLAGE
శ్రీ పార్వతీ సమేత పృథ్వీశ్వర స్వామి
వృశ్చికరాశి, అనూరాధ నక్షత్రం (2వ పాదం)
పాద శివలింగ స్ధానం: చాళుక్యుల భీమ మండలం నందలి ద్రాక్షారామ క్షేత్రానికి పశ్చిమ దిశగా సుమారు 25 kms. దూరాన చింతలూరు (Chintaluru) అను గ్రామం కలదు. మండపేట - ఆలమూరు రోడ్డు మార్గములో కొత్తూరు సెంటర్ ఉంటుంది. ఇక్కడ బస్సులు ఆగుతాయి. కొత్తూరు సెంటర్ నుంచి చింతలూరు గ్రామం నకు ఆటోలు ఉంటాయి. ఇచ్చట శ్రీ పృథ్వీశ్వర లింగమును దర్శించగలము. శ్రీ పార్వతీ సమేత పృథ్వీశ్వర స్వామి వారి ఆలయం అనూరాధ నక్షత్రం (2వ పాదం) చెందినది. శ్రీ పృథ్వీశ్వర లింగము భీమసభ నందలి 108 శివ లింగాలలో ఒకటిగా ప్రతీతి.
ఆలయం: శ్రీ పార్వతీ సమేత పృథ్వీశ్వర స్వామి వారి ఆలయం చాల ప్రాచీనమైనది. కాల క్రమములో ఆలయం పునర్నిర్మాణము జరిగింది. ఆలయ ప్రాంగణములో ధ్వజస్ధంభం, చండీశ్వరాలయం, ముఖమండపం, గర్భాలయం ఉంటాయి. గణపతి, గాయత్రి దేవి దర్శనమిస్తారు. ఆలయ గోపుర శిఖరము నందు దేవతా మూర్తులు కలరు. శ్రీ పృథ్వీశ్వర లింగం కి నిత్య అర్చనలు జరుగుతాయి. స్వామి వారి కళ్యాణోత్సవములు వైశాఖ బహుళ ఏకాదశి పాంచాహ్నికంగా జరుగుతుంది. గణపతి నవరాత్రులు శరన్నవరాత్రులు ఘనంగా జరుగుతాయి. వృశ్చికరాశి జాతకులు, క్షేత్రం లోని శివాలయంలో అర్చన, అభిషేకములు భక్తితో నిర్వర్తించిన యెడల విశేష ఫలితములు పొందగలరని భక్తజనుల విశ్వాసము.
స్ధల పురాణం: పృథ్వీశ్వర లింగము స్వయంభువుగా చెబుతారు. పూర్వం ఆలయం గల ప్రాంతం లో దట్టమైన పొదలతోను లతలతోను నిండివుండేదట. ఒకనాడు ఒక ఎరుకలవాడు కొంగను వేటాడుటకై పంగళ కర్రతో దాన్ని కొట్టగా ఆ కొంగ గాయపడింది. ఆ కొంగ అతనికి కనబడలేదట. పొదలను తొలగించి వెతుకగా, పొదలమధ్య గుండ్రటి రాయి దానిపైన రక్తపు మరకలు కనిపించాయట. అతడు భయంతో వారి కులపెద్దలకు ఈ విషయాన్ని వివరించి, రక్తం కక్కుకుని మరణించినట్లుగాను చెప్పుచుంటారు. ఆ విషయాన్ని కులపెద్దలు అప్పటి చింతలూరు కరణం గారికి తెలియజేయగా, ఆయన ఆ ప్రాంతాన్ని శుబ్రపరచి, ఆ రాతి యొక్క మూలం కనుగొనడానికి త్రవ్వకాలు ప్రారంభించారట. ఎంత లోతుకు త్రవ్వినా ఆ శిల అంతు దొరకలేదట! సుమారు ఒక పెద్ద తాటిచెట్టు ప్రమాణంలో త్రవ్విన తరువాత ఆ శిల చెరువు వైపు మళ్ళినట్లుగా గమనించారట. అంత ఇక త్రవ్వడం తమ వల్ల కాదని గ్రహించి ఎక్కడ ఆలింగం కనబడిందో అక్కడే పానపట్టంతో ఒక పీఠమును ఏర్పరచి, ఆ రాతికి తాత్కాలికంగా ఒక మందిరాన్ని ఏర్పాటు చేశారట! పృధ్వి (భూమి) నుండి ఉద్భవించిన కారణంగా, ఆ శివస్వరూపానికి పృథ్వీశ్వర నామాన్ని నిర్ణయించారు అని చెప్పుచుంటారు.
పృథ్వీశ్వర శివాలయము నకు చేర్చి అత్యద్భుత శిల్పకళతో నిర్మించబడ్డ ధన్వంతరి ఆలయం కలదు. దీనిని శ్రీ వేంకటేశ్వర ఆయుర్వేదనిలయం/ చింతలూరు వ్యవస్థాపకులు ద్విభాష్యం వేంకటేశ్వర్లుగారు నిర్మించారు. ధన్వంతరి ఆలయం విశాలమైన ముఖమంటపము మరియు చక్కని పరిసరాలతో అత్యంత హృద్యంగా నిర్మించబడినది. సుబ్రహ్మణ్య షష్టి మొదలగు పర్వదినాలు సందర్భముగా పూజలు విశేషంగా జరుగుతాయి. చింతలూరు గ్రామ దేవత నూకాలమ్మ అమ్మవారి ఆలయం లోక ప్రసిద్ధి.
రవాణా సమాచారం: మండపేట - రావులపాలెం బస్సులు / ఆటోలు కొత్తూరు సెంటర్ మీదగా ఉంటాయి.
రవాణా సమాచారం:కొత్తూరు సెంటర్ నుంచి చింతలూరు కు ఆటోలు ఏర్పాట్టు చేసుకోవాలి. కొత్తూరు సెంటర్ నుంచి చింతలూరు దూరం సుమారు 1 కీ.మ
అర్చక స్వామి: ఆలయ అర్చకులు శ్రీ గూడూరి వెంకటరమణ మూర్తి, సెల్ నెం: 94401 54372 సంప్రదించగలరు.
విజ్ఞప్తి: ద్రాక్షారామ - శ్రీ భీమేశ్వరాలయం యొక్క ఉత్తర ముఖద్వారం వద్ద శ్రీ రాజ రాజేశ్వరి పీఠం వారి నిత్యాన్నదానం సత్రం కలదు.దూర ప్రాంతములు నుంచి ఆలయాలు సందర్శనకు వచ్చిన యాత్రికులకు ఉచ్చిత అన్న ప్రసాదములు వితరణ జరుగును. భక్తులు ముందుగా అన్నప్రాసాదం కోసం ఫోనులో సంప్రాదించాలి.
వీరి Cell 83320 29544.
వీరు వాహనములు కూడ ఏర్పాటు చేస్తారు.
అనురాధ నక్షత్రం స్తోత్రం
నమో మిత్రస్య వరుణస్య చక్షసే మహోదేవాయత దృత్|
సపర్యత్ దూర్ దేశే దేశే దేవ జాతాయ కేతవే
దివసు పుత్రాయ సూర్యాయశ్ సత్||
రోజూ 11 సార్లు పఠించటం వల్ల సర్వశుభాలు కలుగుతాయి.