గమనిక: దైవదర్శనం కొరకు యాత్రికులు కనీసం ఒక రోజు ముందుగా అర్చకస్వామితో సంప్రదించండి. ప్రతి ఏట కొన్ని ఆలయాలలో అర్చక స్వాములు వంతులువారిగా మారుతుంటారు.

కాజులూరు గ్రామం / KAJULURU VILLAGE

శ్రీ సర్వమంగళా సమేత శ్రీ అగస్త్యేశ్వర స్వామి

వృషభరాశి, రోహిణి నక్షత్రం (2వ పాదం)

పాద శివలింగ స్ధానం: ద్రాక్షారామ క్షేత్రానికి తూర్పు దిశగా, సుమారు 16 kms. దూరాన, కాజులూరు గ్రామం (Kajuluru) కలదు. ఇచ్చట శ్రీ సర్వమంగళా సమేత  శ్రీ అగస్త్యేశ్వర స్వామి ఆలయం ఉంది. శ్రీ అగస్త్యేశ్వర లింగము భీమసభ నందలి 108 శివ లింగాలలో ఒకటిగా ప్రతీతి. 

ఆలయం: శ్రీ అగస్త్యేశ్వర స్వామి ఆలయం చాల ప్రాచీనమైనది. ఆలయ ప్రాంగణములో ధ్వజస్తంభం, ముఖమండపం, అంతరాలయం, గర్భాలయం ఉంటాయి. గర్భాలయం నందలి శివ లింగము స్వయంభూ మూర్తిగా చెప్పుచుంటారు.  అగస్త్య మహాముని ప్రథమ ఆరాధకుడు.  స్వయంభూ మూర్తి, శ్రీ అగస్త్యేశ్వరడుగా  కీర్తించబడ్డాడు. స్వయంభూ మూర్తి సుమారు 1 1/2 అడుగులు భూమి లోపల మరియు 1 1/2 అడుగులు భూమికి పైన ఉంటుంది. శివ లింగము నకు పాన వట్టం ఉండదు. ఆలయం నందు శ్రీ సర్వమంగళా దేవికి ప్రత్యేక స్ధానం లేదు.  సర్వ మంగళ దేవి స్వామి వారిలో అంతర్లీనం అని అర్చకులు చెప్పుచుంటారు. ఆలయం నకు పశ్చిమ వైపున గల చెరువు గర్భంలో శ్రీ సర్వమంగళా దేవి కొలువై ఉంటుంది అని భక్తుల విశ్వాసం. అంతరాలయం నందు గణపతి మూర్తి దర్శనమిస్తాడు. 

శ్రీ అగస్త్యేశ్వర లింగము శుక్ర గ్రహ స్ధానంగా ఖ్యాతి పొందింది. జ్యోతిషశాస్త్రం ప్రకారం వ్యక్తి జాతక చక్రం నందు శుక్రుడు బలహీనంగా ఉన్నట్లయితే, వారి వైవాహిక జీవితం అంత ఆనందదాయకంగా సాగదు. దంపతుల మధ్య విభేదాలు వస్తాయి. చిన్న చిన్న అవసరాలకు కూడా ఎంతో ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రేమ బంధాల్లో వైఫల్యాన్ని ఎదుర్కొంటారు. పనిలో ఏకాగ్రత లేకపోవడం, ఆహారం తీసుకోవడంలో సమస్యలు ఉంటాయి.

సంపద, ఆనందం లేకపోవడం లాంటి ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ సమస్యలను పరిష్కరించడానికి శుక్ర అనుగ్రహం ఉండాలి. శ్రీ అగస్త్యేశ్వర స్వామి ఆరాధించుట వలన, వారి సమస్యలకు ఉపశమనం కలుగుతుంది. 

శ్రీ అగస్త్యేశ్వర లింగము రోహిణి నక్షత్రము నందలి 2వ పాదము నకు చెందినది. రోహిణి నక్షత్రము 2వ పాదములో జన్మించిన శిశువు వలన మేనమామకు మరియు తల్లికి దోషము కలుగను. వాటిని నివారించుటకు ఆలయం నందు అభిషేక శాంతులు నిర్వహించుతారు. 

కొంత మంది భక్తులు సుబ్రహ్మణేశ్వరాలయంగా పిలుస్తారు. శ్రీ అగస్త్యేశ్వర లింగము ఒక వాల్మీకం (పుట్ట) నుంచి స్వయంభూ లింగముగా ఉద్భవించింది అని చెప్పుచుంటారు. ఇచ్చట సుబ్రహ్మణేశ్వర స్వామికి విశేష పూజలు నిర్వహించుతారు. గొడ్రాళ్ళ సంతానం కోసం మరియు యువతి, యువకులు వివాహం కోసం స్వామిని ఆరాధించుతారు. 

చుట్టు ప్రక్కల ప్రాంతాలు మరియు దూర ప్రాంతాలు నుంచి కూడ భక్తులు వచ్చి స్వామిని దర్శించి, దైవ అనుగ్రహం పొందుతారు. ప్రస్తుతం ఆలయం జీర్ణావస్ధకు చేరింది. పునరుద్ధరణ చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గ్రామవాసులు, దాతలు ఆలయం పునర్మించుటకు ధన సహాయం చేయాలి. 

రవాణా సమాచారం: ద్రాక్షారామం నుంచి యానాం బస్సులు (Via) ఎర్ర పోతవరం, బాలాంత్రం, కుయ్యేరు మీదగా ప్రతి గంటకు ఉంటాయి. ద్రాక్షారామం నకు సుమారు 9 Kms. దూరంలో కుయ్యేరు ఉంటుంది. 

కుయ్యేరు నకు ఈశాన్యంగా సుమారు 7 Kms. దూరంలో కాజులూరు ఉంటుంది.  

కుయ్యేరు నుంచి గొల్లపాలెం కు (Via) దుగ్గుదూరు, కాజులూరు, చేదువాడ బ్రిడ్జి మీదగా రోడ్డు మార్గం కలదు. కుయ్యేరు నుంచి కాజులూరు కు ఆటోలు చాల తక్కువుగా దొరుకుతాయి. ద్రాక్షారామం నుంచి కాజులూరు కి రాను - పోను ఆటో ఏర్పాట్టు చేసుకోవటం సౌక్యముగా ఉంటుంది. 

కాకినాడ - కోటిపల్లి రోడ్డు మార్గములో గొల్లపాలెం ఉంటుంది. గొల్లపాలెం మార్కెట్ బస్ స్టాప్ దాటగానే గొల్లపాలెం (కాజులూరు సెంటర్) బస్ స్టాప్ వస్తుంది. ఇక్కడ నుంచి కుయ్యేరు రోడ్డు ప్రారంభమవుతుంది. 

గొల్లపాలెం (కాజులూరు సెంటర్) నుంచి కుయ్యేరు కు (Via) చేదువాడ బ్రిడ్జి, కాజులూరు, దుగ్గుదూరు మీదగా బ్రాంచి రోడ్డు మార్గం కలదు.  గొల్లపాలెం ( కాజులూరు సెంటర్) నుంచి కాజులూరు గ్రామం కు షేరింగ్ ఆటోలు (Via) చేదువాడ బ్రిడ్జి మీదగా దొరుకుతాయి.  గొల్లపాలెం నుంచి కాజులూరు కి రాను - పోను ఆటో ఏర్పాట్టు చేసుకోవటం సౌక్యముగా ఉంటుంది. వీటి మధ్య దూరం సుమారు 7 kms. 

కాకినాడ - పల్లిపాలెం, కాకినాడ - దుగ్గుదూరు, కాకినాడ - కాజులూరు బస్సులు (via) గొల్లపాలెం మీదగా ఉండేవి. కాజులూరు బస్ స్టాప్ కు సుమారు 100 meters గ్రామం లోపలకి శ్రీ అగస్త్యేశ్వరాలయం ఉంటుంది. ప్రస్తుతం బస్ సర్వీసులు కాజులూరు కు లేవు. 

అర్చక స్వామి: ఆలయ సమాచారం & Photos అందించిన కాజులూరు - శ్రీ అగస్త్యేశ్వర స్వామి, ఆలయ అర్చక స్వామి అయిన శ్రీ దొంతికుర్తి విశ్వేశ్వర శర్మ, సెల్ నెం. 9676679774 గార్కి నా నమసుమాంజలి. 

విజ్ఞప్తి: ద్రాక్షారామ - శ్రీ భీమేశ్వరాలయం యొక్క ఉత్తర ముఖద్వారం వద్ద శ్రీ రాజ రాజేశ్వరి పీఠం వారి నిత్యాన్నదానం సత్రం కలదు. దూర ప్రాంతములు నుంచి ఆలయాలు సందర్శనకు వచ్చిన యాత్రికులకు ఉచ్చిత అన్న ప్రసాదములు వితరణ జరుగును. భక్తులు ముందుగా అన్నప్రాసాదం కోసం ఫోనులో సంప్రాదించాలి. 

వీరి Cell 83320 29544. 

వీరు వాహనములు కూడ ఏర్పాటు చేస్తారు.

రోహిణి నక్షత్రం స్తోత్రం

బ్రహ్మజ జ్ఞానం ప్రథమం పురస్వాద్వి సీమ: పురచే

వేనయాయహ: సబుధ్వా ఉపమా అస్య విష్ఠా:

సతశ్చ యోనిమ సతశ్చ విధి:||

రోజూ 11 సార్లు పఠించటం వల్ల సర్వశుభాలు కలుగుతాయి.

వీడియో  వివరణ / Video  Description

ఆడియో వివరణ / Audio Description