గమనిక: దైవదర్శనం కొరకు యాత్రికులు కనీసం ఒక రోజు ముందుగా అర్చకస్వామితో సంప్రదించండి. ప్రతి ఏట కొన్ని ఆలయాలలో అర్చక స్వాములు వంతులువారిగా మారుతుంటారు.
వాడపాలెం గ్రామం / VADAPALEM VILLAGE
శ్రీ ఉమా మాణిక్యాంబ సమేత శ్రీ వీరేశ్వర స్వామి
మకర రాశి, శ్రవణం నక్షత్రం (3వ పాదం)
పాద శివలింగ స్ధానం: చాళుక్యుల భీమ మండలం నందలి ద్రాక్షారామ క్షేత్రానికి నైఋతి దిశగా సుమారు 18 kms. దూరాన వాడపాలెం (Vadapalem) అను గ్రామం కలదు. ఇచ్చట శ్రీ వీరేశ్వర లింగమును దర్శించగలము. శ్రీ ఉమా మాణిక్యాంబ సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయం శ్రవణం నక్షత్రం (3వ పాదం) చెందినది. శ్రీ ముక్తేశ్వర లింగము భీమసభ నందలి 108 శివ లింగాలలో ఒకటిగా ప్రతీతి.
ఆలయం: శ్రీ ఉమా మాణిక్యాంబ సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయం చాల ప్రాచీనమైనది. స్ధానికలు సుబ్బరాయుడు గుడిగా పిలుస్తారు. కాల క్రమములో ఆలయం పునర్నిర్మాణము జరిగింది. ఆలయ ప్రాంగణములో ధ్వజస్ధంభం, చండీశ్వరాలయం, ముఖమండపం, గర్భాలయం ఉంటాయి. శివాలయంతో పాటు విఘ్నేశ్వ రాలయం, వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి (సుబ్బరాయుడు) వారి ఆలయం, మాణిక్యాంబా ఆలయం, శ్రీరమా సమేత సత్యనారాయణ స్వామివారి ఆలయం కలవు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వయంభువు మూర్తి. స్వామికి విశేష ప్రాముఖ్యత ఉంది. ఆలయ గోపుర శిఖరము నందు దేవతా మూర్తులు కలరు. శ్రీ వీరేశ్వర లింగం కి నిత్య అర్చనలు జరుగుతాయి. శ్రీ ఉమా మాణిక్యాంబ సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవములు మాఘ శుద్ధ ఏకాదశి నుండి పాంచాహ్నికంగా జరుగుతుంది. మార్గశిర శుద్ధ షష్ఠి నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణము నిర్వహించబడతుంది. వైశాఖ శుద్ధ ఏకాదశి రోజున సత్యనారాయణ స్వామివారి 'కళ్యాణము జరుగును. శరన్నవరాత్రులు, గణపతి నవరాత్రులు విశేషంగా నిర్వ హించబడతాయి. ధనుర్మాస ఉత్సవములు జరుగుతాయి.. మకర రాశి జాతకులు, క్షేత్రం లోని శివాలయంలో అర్చన, అభిషేకములు భక్తితో నిర్వర్తించిన యెడల విశేష ఫలితములు పొందగలరని భక్తజనుల విశ్వాసము.
రవాణా సమాచారం: రావులపాలెం - మురమళ్ళ బస్సులు (Via) వాడపాలెం, ముక్తేశ్వరం మీదగా ఉంటాయి.
* రావులపాలెం - వాడపాలెం మధ్య దూరం సుమారు 13 Kms.
రవాణా సమాచారం: రావులపాలెం & కొత్తపేట నుంచి బయలు దేరిన అయినవిల్లి షేరింగ్ ఆటోలు (Via) వాడపాలెం మీదగా ఉంటాయి.
రవాణా సమాచారం: కోటిపల్లి రేవు నుంచి ముక్తేశ్వరం రేవుకు Boat సౌకర్యములు ఉంటాయి. ముక్తేశ్వరం రేవు నుంచి ముక్తేశ్వరం కు రవాణ సౌకర్యములు ఉంటాయి. ముక్తేశ్వరం నుంచి వాడపాలెం కి ఆటోలు ఉంటాయి. వీటి మధ్య దూరం సుమారు 15 Kms.
రవాణా సమాచారం: వాడపాలెం శివాలయం బస్ స్టాప్ కు సుమారు 200 meters (కొంత లోపలకి) శివాలయం ఉంటుంది.
అర్చక స్వామి: ఆలయ అర్చకస్వామి శ్రీ దెందులూరి వెంకట సూర్యసుబ్బారావు (శ్రీను) , సెల్ నెం : 81869 61115 సంప్రదించగలరు.
విజ్ఞప్తి: ద్రాక్షారామ - శ్రీ భీమేశ్వరాలయం యొక్క ఉత్తర ముఖద్వారం వద్ద శ్రీ రాజ రాజేశ్వరి పీఠం వారి నిత్యాన్నదానం సత్రం కలదు.దూర ప్రాంతములు నుంచి ఆలయాలు సందర్శనకు వచ్చిన యాత్రికులకు ఉచ్చిత అన్న ప్రసాదములు వితరణ జరుగును. భక్తులు ముందుగా అన్నప్రాసాదం కోసం ఫోనులో సంప్రాదించాలి.
వీరి Cell 83320 29544.
వీరు వాహనములు కూడ ఏర్పాటు చేస్తారు.
శ్రవణం నక్షత్రం స్తోత్రం
విష్ణోరరాటమసి విష్ణో: శ్నపత్ర స్థో విష్ణో: సూర్యసి విష్ణో:
ధ్రువోసి వైష్ణవమసి విష్ణ్యోత్వా||
రోజూ 11 సార్లు పఠించటం వల్ల సర్వశుభాలు కలుగుతాయి.
వీడియో వివరణ / Video Description
ఆడియో వివరణ / Audio Description