గమనిక: దైవదర్శనం కొరకు యాత్రికులు కనీసం ఒక రోజు ముందుగా అర్చకస్వామితో సంప్రదించండి. ప్రతి ఏట కొన్ని ఆలయాలలో అర్చక స్వాములు వంతులువారిగా మారుతుంటారు.

అరట్లకట్ట గ్రామం / ARATLAKATTA

శ్రీ భ్రమరాంబా సమేత శ్రీ మల్లేశ్వర స్వామి

మిధునరాశి, పునర్వసు నక్షత్రం (3వ పాదం)

పాద శివలింగ స్ధానం: చాళుక్యుల భీమ మండలం నందలి ద్రాక్షారామ క్షేత్రానికి ఈశాన్యం దిశగా, సుమారు 28 kms. దూరాన అరట్లకట్ట గ్రామం (Aratlakatta) కలదు.  రామచంద్రపురం - కాకినాడ రోడ్డు మార్గములో కరప ఉంటుంది. కరప నకు ఉత్తరం-వాయువ్యం దిశ నందు గల కాకినాడ కెనాల్ రోడ్ కు సమీపంలో అరట్లకట్ట గ్రామం ఉంటుంది. కరప జంక్షన్ నంచి అరట్లకట్ట గ్రామం మీదగా బ్రాంచి రోడ్డు మార్గము కలదు. అరట్లకట్ట ఊరులో శ్రీ భ్రమరాంబా సమేత శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయం కలదు. శ్రీ మల్లేశ్వర లింగము, పునర్వసు నక్షత్రం (3వ పాదం) చెందినది. పునర్వసు నక్షత్రం నందలి 3వ పాదము లో జన్మంచిన వారికి శాంతులు నిర్వహించుతారు. శ్రీ మల్లేశ్వర లింగము భీమసభ నందలి 108 శివ లింగాలలో ఒకటిగా ప్రతీతి.

ఆలయం: పూర్వం పెద్దాపురం సంస్థానాధీశుల ఆధీనములో అరట్లకట్ట గ్రామం ఉండేది. ఇచ్చట సగము కూలిపొయిన కోట గోడలు (అరకోట గోడలు) ఉన్న కారణంచే అరకోట గ్రామంగా పిలిచేవారుట!  అరకోట గ్రామప్రజలు కట్లమ్మ అను గ్రామ దేవత కొలుచేవారు. చుట్టు ప్రక్కల ప్రాంతము వారు  ' అర కోట కట్లమ్మ ' గా పిలిచేవారు. అర కోట క్రమముగా 'అరట్లకట్ట' గా వాడుకలోనికి వచ్చింది.

అరట్లకట్ట గ్రామం లోని శ్రీ భ్రమరాంబా సమేత శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయం చాల ప్రాచీనమైనది. 17 వ శతాబ్ధం నందు పెద్దాపురం సంస్థానాధీశులు ఆలయం పునర్నిర్మాణము జరిపించారు.  ఆలయ ప్రాంగణము విశాలముగా ఉంటుంది.  ఆలయ ప్రవేశం ముఖద్వారం నుంచి జరుగుతుంది.  ఆలయ ప్రాంగణములో ధ్వజ స్ధంబం, ప్రధానాలయం, చండీశ్వరుడు, మహా గణపతి దర్శనమిస్తారు. ప్రధానాలయం తూర్పు అభిముఖంగా ఉంటుంది. మేథా దక్షిణామూర్తి దక్షిణ ముఖంగా ఉంటాడు. ముఖ మండపం నందు నందీశ్వరుడు, దత్తాత్రేయ స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొలువై ఉంటారు. అంతరాలయం నందు శ్రీ లక్ష్మీ గణపతి దర్శనం లభ్యమవుతుంది. గర్భాలయం నందు శ్రీ భ్రమరాంబా సమేత శ్రీ మల్లేశ్వర స్వామి ఏక  పీఠం పైన కొలువుదీరినారు. ఆలయం నందు ప్రతి నిత్యం అర్చనలు, అభిషేకాలు, శాంతులు నిర్వహించుతారు. స్వామి వారి వార్షిక కళ్యాణం మాఘ శుద్ధ ఏకాదశి (భీష్మ ఏకాదశి) నాడు జరుగుతుంది.

మహాశివరాత్రి చాల వైభవంగా జరుగుతుంది. ప్రతి మాస శివరాత్రికి విశేష పూజలు ఉంటాయి. స్వామి జన్మ నక్షత్రం అయిన ఆరద్ర సందర్భముగా మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం జరుగుతుంది. పునర్వసు నక్షత్రం సందర్భముగా శ్రీ రుద్ర హోమం నిర్వహించుతారు. ఆలయం నందు కార్తీక మాసంలో విశేష పూజలు జరుగుతాయి. లక్ష పత్ర పూజ నిర్వహహంచుతారు.

గణపతి నవరాత్రులు, శరన్నవరాత్రులు, సుబ్బారాయుడు షష్ఠి వేడుకులు వైభవంగా జరుగుతాయి. నక్షత్ర శాంతి కోసం ఆలయ అర్చక స్వామి: శ్రీ కొంతేటి శివశర్మ (శివ), సెల్ నెం. 9849313133 సంప్రదించగలరు.

రవాణా సమాచారం 1: ద్రాక్షారామం నకు వాయువ్య దిశగా, సుమారు 7 kms. దూరంలో రామచంద్రాపురం RTC బస్ స్టాండ్ ఉంటుంది. ద్రాక్షారామం నుంచి రామచంద్రాపురం నకు బస్సులు / ఆటోలు దొరుకుతాయి.

రవాణా సమాచారం 2: రామచంద్రాపురం బస్ స్టాండ్ నుంచి కాకినాడ కు బస్సులు చాల ఎక్కువుగా దొరుకుతాయి. రామచంద్రాపురం - కాకినాడ బస్సులు (via) కరప మీదగా ఉంటాయి.

రవాణా సమాచారం 3: కరప నుంచి కరకుదురు గ్రామం నకు ఆటోలు (via) Z.భావారం, అరట్లకట్ట మీదగా ఉంటాయి. అరట్లకట్ట రాను - పోను ఆటోలు ఏర్పాట్టు చేసుకోవడం సౌక్యముగా ఉంటుంది.  కరప - అరట్లకట్ట మధ్య దూరం సుమారు 05 Kms,

అర్చక స్వామి: ఆలయ సమాచారం & Photos అందించిన అరట్లకట్ట అర్చక స్వామి శ్రీ కొంతేటి శివశర్మ (శివ), సెల్ నెం. 9849313133 గార్కి నా నమసుమాంజలి

విజ్ఞప్తి: ద్రాక్షారామ - శ్రీ భీమేశ్వరాలయం యొక్క ఉత్తర ముఖద్వారం వద్ద శ్రీ రాజ రాజేశ్వరి పీఠం వారి నిత్యాన్నదానం సత్రం కలదు.  దూర ప్రాంతములు నుంచి ఆలయాలు సందర్శనకు వచ్చిన యాత్రికులకు ఉచ్చిత అన్న ప్రసాదములు వితరణ జరుగును. భక్తులు ముందుగా అన్నప్రాసాదం కోసం ఫోనులో సంప్రాదించాలి.

వీరి Cell 83320 29544.

వీరు వాహనములు కూడ ఏర్పాటు చేస్తారు.

పునర్వసు నక్షత్రం స్తోత్రం

అదితి ధౌరదితిరం తరి క్షమదితి: మాతా స పితాన పుత్ర:|

విశ్వేదేవా అదితి పంచజనా అదితి జాతిమాది తిర్జనిత్వమ్‌||

రోజూ 11 సార్లు పఠించటం వల్ల సర్వశుభాలు కలుగుతాయి.