గమనిక: దైవదర్శనం కొరకు యాత్రికులు కనీసం ఒక రోజు ముందుగా అర్చకస్వామితో సంప్రదించండి. ప్రతి ఏట కొన్ని ఆలయాలలో అర్చక స్వాములు వంతులువారిగా మారుతుంటారు.

నరసాపురపుపేట గ్రామం / NARASAPURAPUPETA VILLAGE

శ్రీ పార్వతీ సమేత భవానీశంకర స్వామి

సింహరాశి, మఖ నక్షత్రం (1వ పాదం)

పాద శివలింగ స్ధానం: చాళుక్యుల భీమ మండలం నందలి ద్రాక్షారామ క్షేత్రానికి ఈశాన్యం దిశగా, సుమారు 12 kms. దూరాన, నరసాపురపుపేట (Narasapurapupeta) గ్రామం ఉంటుంది. ఇది తూర్పు గోదావరి జిల్లా, రామచంద్రపురం మండలంకు చెందినది.  రామచంద్రపురం - కరప  రోడ్డులో నరసాపురపుపేట బస్ స్టాప్ ఉంటుంది. బస్ స్టాప్ కు కొంత లోపలకి నరసాపురపుపేట గ్రామం ఉంటుంది. ఇక్కడ  శ్రీ పార్వతీ సమేత భవానీశంకరస్వామి (శివాలయం) కలదు.  శ్రీ భవానీశంకర లింగము భీమసభ నందలి 108 శివ లింగాలలో ఒకటిగా ప్రతీతి.

ఆలయం :ఆలయం చాల ప్రాచీనమైనది. శ్రీ భవానీశంకర లింగము స్వయంభూ లింగము అని చెప్పుచుంటారు. శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఉపాలయం కలదు. శ్రీ భవానీశంకరస్వామికి నిత్య అర్చనలు జరుగుతాయి. స్వామివారి కళ్యాణోత్సవములు మాఘశుద్ధ  ఏకాదశి నుండి పాంచాహ్నికంగా జరుగుతుంది. శరన్నవ రాత్రులు, గణపతి నవరాత్రులు, సుబ్రహ్మణ్యషష్ఠి అత్యంత వైభవోపేతంగా జరుగుతాయి. సింహరాశి జాతకులు  క్షేత్రం లోని శివాలయంలో అర్చన, అభిషేకములు భక్తితో నిర్వర్తించిన యెడల విశేష ఫలితములు పొందగలరని భక్తజనుల విశ్వాసము.

రవాణా సమాచారం: రామచంద్రపురం - కాకినాడ బస్సులు (Via) నరసాపురపుపేట, వేళంగి మీదగా ఉంటాయి. బస్సు స్టాపునకు ఉత్తరంగా సుమారు 300 meters దూరాన, భవానీశంకర స్వామి ఆలయం ఉంటుంది. నరసాపురపుపేట గ్రామంలో శ్రీ రుక్మిణి సత్యభామా సమేత వేణు గోపాలస్వామివారి ఆలయము కూడా వున్నది.

అర్చక స్వామి: ఆలయ అర్చకులు శ్రీ మద్దిరాల శ్రీనివాసదత్తు, సెల్: 94908 83183 సంప్రదించగలరు.

విజ్ఞప్తి: ద్రాక్షారామ - శ్రీ భీమేశ్వరాలయం యొక్క ఉత్తర ముఖద్వారం వద్ద శ్రీ రాజ రాజేశ్వరి పీఠం వారి నిత్యాన్నదానం సత్రం కలదు. దూర ప్రాంతములు నుంచి ఆలయాలు సందర్శనకు వచ్చిన యాత్రికులకు ఉచ్చిత అన్న ప్రసాదములు వితరణ జరుగును. భక్తులు ముందుగా అన్నప్రాసాదం కోసం ఫోనులో సంప్రాదించాలి.

వీరి Cell 83320 29544.

వీరు వాహనములు కూడ ఏర్పాటు చేస్తారు.

మఖ నక్షత్రం స్తోత్రం

పితృభ్య: స్వధాయిభ్య: స్వధానమ:|

పితామహేభ్య: స్వధాయిభ్య: స్వధానమ:

ప్రపితామహేభ్య: స్వదాయిభ్య: స్వధానమ:

అక్షన్న పిత్రో మీమదంత పితరోతితృ పంత్‌ పితర:

పితర: శుంధ ధ్వమ్‌||

రోజూ 11 సార్లు పఠించటం వల్ల సర్వశుభాలు కలుగుతాయి.