గమనిక: దైవదర్శనం కొరకు యాత్రికులు కనీసం ఒక రోజు ముందుగా అర్చకస్వామితో సంప్రదించండి. ప్రతి ఏట కొన్ని ఆలయాలలో అర్చక స్వాములు వంతులువారిగా మారుతుంటారు.

ముక్తీశ్వరం గ్రామం / MUKHTESWARAM VILLAGE

శ్రీ రాజరాజేశ్వరీ సమేత శ్రీ ముక్తేశ్వర స్వామి

కుంభ రాశి, పూర్వాభాద్ర నక్షత్రం (1వ పాదం)


పాద శివలింగ స్ధానం:  చాళుక్యుల భీమ మండలం నందలి ద్రాక్షారామ క్షేత్రానికి నైఋతి దిశగా సుమారు 16 kms. దూరాన ముక్తీశ్వరం (Muktheswaram) అను గ్రామం కలదు. ఇచ్చట శ్రీ ముక్తేశ్వర లింగమును దర్శించగలము. శ్రీ రాజరాజేశ్వరీ సమేత శ్రీ ముక్తేశ్వర స్వామి వారి ఆలయం పూర్వాభాద్ర నక్షత్రం (1వ పాదం) చెందినది.  శ్రీ ముక్తేశ్వర లింగము భీమసభ నందలి 108 శివ లింగాలలో ఒకటిగా ప్రతీతి. 

ఆలయం: శ్రీ రాజరాజేశ్వరీ సమేత శ్రీ ముక్తేశ్వర స్వామి  వారి ఆలయం చాల ప్రాచీనమైనది. కాల క్రమములో ఆలయం పునర్నిర్మాణము జరిగింది. ఆలయ ప్రాంగణములో వల్లభ గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, రాజరాజేశ్వరీ, కాల భైరవుడు, సీతారాములు సన్నిధిలు మరియు ప్రధానాలయం, ధ్వజస్ధంభం, చండీశ్వరాలయం, ముఖమండపం, గర్భాలయం ఉంటాయి. ఆలయ గోపుర శిఖరము నందు దేవతా మూర్తులు కలరు. శ్రీ ముక్తేశ్వర లింగం కి నిత్య అర్చనలు జరుగుతాయి. శ్రీ రాజరాజేశ్వరీ సమేత శ్రీ ముక్తేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవములు వైశాఖ శుద్ధ దశమి నుండి పాంచాహ్నికంగా జరుగుతుంది. గణపతి నవరాత్రులు, శరన్నవరాత్రులు, సుబ్రహ్మణ్యేశ్వర కళ్యాణం (పంచమి నాడు) సుబ్బారాయుడు షష్టి, కార్తీక పూజలు, మహాశివరాత్రి, శ్రీ రామనవమి, ప్రభల తీర్ధం (కనుమ నాడు) నిర్వహించబడతాయి.  కుంభ రాశి జాతకులు, క్షేత్రం లోని శివాలయంలో అర్చన, అభిషేకములు భక్తితో నిర్వర్తించిన యెడల విశేష ఫలితములు పొందగలరని భక్తజనుల విశ్వాసము. ముక్తేశ్వరం బస్ స్టాప్ కు సుమారు 500 meters దూరాన (ముక్తేశ్వరం రేవు వైపు) శ్రీ ముక్తికాంత సమేత శ్రీ క్షణముక్తీశ్వరాలయం తూర్పు అభిముఖంగా ఉంటుంది. ఇది లోక ప్రసిద్ధి చెందిన శివాలయం. భక్తులు క్షణకాలం శివుడుని ఆరాధించిన ముక్తిని పొందగలరు అని నమ్మకం కలదు. ముక్తీశ్వరుడు కొలువుదీరిన క్షేత్రం ముక్తేశ్వరంగా ఖ్యాతి పొందింది. క్షణముక్తీశ్వరాలయం నకు ఎదురుగా శ్రీ రాజరాజేశ్వరీ సమేత శ్రీ ముక్తేశ్వర స్వామి ఆలయం పశ్చిమాభి ముఖంగా ఉంటుంది.  ఇది భీమసభ నందలి 108 శివ లింగాలలో ఒకటిగా ప్రతీతి. 

స్ధల పురాణం: త్రేతాయుగంలో శ్రీ రామచంద్రమూర్తి ముక్తేశ్వర క్షేత్రం నందలి శ్రీ క్షణముక్తీశ్వర స్వామిని సేవించినట్లు బ్రహ్మండ పరాణం నందలి గౌతమి మహాత్యంలో ఉంది. శ్రీరాముడు ఒక యోగినికి (శ్రావణి) శాప విమోచన కోసం శివుడును ప్రార్ధించుతాడు. శివుడు ప్రత్యక్షమై ఒక క్షణంలో ఆమెకు మోక్షం (ముక్తి) ప్రసాధించుతాడు.  యోగిని ఆరాధించిన శివలింగము క్షణ ముక్తీశ్వరుడుగా ప్రసిద్ధి గాంచినాడు. పార్వతీ దేవిని ముక్తికాంత అని పిలుస్తారు.

రవాణా సమాచారం: రావులపాలెం - మురమళ్ళ బస్సులు  (Via) వాడపాలెం, వెలవలపల్లి, ముక్తేశ్వరం మీదగా ఉంటాయి.

* రావులపాలెం - ముక్తేశ్వరం మధ్య దూరం సుమారు 25 Kms.

రవాణా సమాచారం: అమలాపురం - వీరవల్లిపాలెం బస్సులు (Via) ముక్తేశ్వరం మీదగా ఉంటాయి. అమలాపురం - ముక్తేశ్వరం మధ్య దూరం సుమారు 10 Kms. అమలాపురం నుంచి ముక్తేశ్వరం కు షేరింగ్ ఆటోలు కూడ ఉంటాయి.

రవాణా సమాచారం:  కోటిపల్లి రేవు నుంచి ముక్తేశ్వరం రేవుకు Boat సౌకర్యములు ఉంటాయి. ముక్తేశ్వరం రేవు నుంచి ముక్తేశ్వరం కు రవాణ సౌకర్యములు ఉంటాయి. ముక్తేశ్వరం రేవు నుంచి ఆటోలు శ్రీ ముక్తికాంత సమేత శ్రీ క్షణముక్తీశ్వరాలయం మీదగా ఉంటాయి. వీటి మధ్య దూరం సుమారు 4 Kms.

అర్చక స్వామి: అర్చకస్వామి శ్రీ కంఠం చక్రవర్తి, సెల్: 98669 46365 & 98491 11479 (Whats) సంప్రదించగలరు. ఇతర అర్చక స్వాములు శ్రీ చంద్రమౌళి నరసింహశర్మ - 99497 29396 & 70957 81744, శ్రీ కంఠం భానోదయ రాజేశ్వరి శర్మ - 94401 19443 &  శ్రీ చంద్రమౌళి సత్యసాయి బాబ శర్మ - 98669 94636.

విజ్ఞప్తి: ద్రాక్షారామ - శ్రీ భీమేశ్వరాలయం యొక్క ఉత్తర ముఖద్వారం వద్ద శ్రీ రాజ రాజేశ్వరి పీఠం వారి నిత్యాన్నదానం సత్రం కలదు.దూర ప్రాంతములు నుంచి ఆలయాలు సందర్శనకు వచ్చిన యాత్రికులకు ఉచ్చిత అన్న ప్రసాదములు వితరణ జరుగును. భక్తులు ముందుగా అన్నప్రాసాదం కోసం ఫోనులో సంప్రాదించాలి.

వీరి Cell 83320 29544.

వీరు వాహనములు కూడ ఏర్పాటు చేస్తారు.

పూర్వాభాద్ర నక్షత్రం స్తోత్రం

తనో హిర్బుద్ధన్య నృణోత్వజ ఏకపాత్‌ పృథివీ సముద్ర:|

విశ్వేదేవారుతా వృధోహు వానా స్తుతా మంత్రా కవి శస్తా అవంతు||

రోజూ 11 సార్లు పఠించటం వల్ల సర్వశుభాలు కలుగుతాయి.

వీడియో వివరణ / Video Description

ఆడియో వివరణ / Audio Descriptioneo Description