గమనిక: దైవదర్శనం కొరకు యాత్రికులు కనీసం ఒక రోజు ముందుగా అర్చకస్వామితో సంప్రదించండి. ప్రతి ఏట కొన్ని ఆలయాలలో అర్చక స్వాములు వంతులువారిగా మారుతుంటారు.

అయితపూడి గ్రామం / AITHAPUDI VILLAGE

శ్రీ అన్నపూర్ణా సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి

వృషభరాశి, రోహిణి నక్షత్రం (3వ పాదం)

పాద శివలింగ స్ధానం: ద్రాక్షారామ క్షేత్రానికి తూర్పు దిశగా, సుమారు 16 kms. దూరాన, అయితపూడి గ్రామం (Aithapudi) కలదు. ఇచ్చట శ్రీ అన్నపూర్ణా సమేత  శ్రీ రామలింగేశ్వర  స్వామి ఆలయం ఉంది. శ్రీ రామలింగేశ్వర లింగము భీమసభ నందలి 108 శివ లింగాలలో ఒకటిగా ప్రతీతి.

ఆలయం: త్రేతాయుగం నందు శ్రీ రామచంద్రమూర్తి అరణ్యవాసం నందు ఒక కుటీరం నిర్మించుకుని, సీతా లక్ష్మణుల సమేతంగా కొంత కాలము నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ సమయంలో రావణ బ్రహ్మ, సీతాదేవిని అపహరించుటకు మారీచుడు అను రాక్షవీరుడును పంపుతాడు. ఆ మారీచుడు ఒక బంగారు లేడి రూపాంలో సీతాదేవి కంటిచూపులో పడ్డాడు. సీతాదేవి ఆశ పడి శ్రీ రాముడుని కోరుతుంది. భార్య కోరికను మన్నించిన శ్రీ రాముడు బంగారు లేడి కోసం బయులు దేరుతాడు. బంగారు లేడిని పట్టుకొనుటకు ప్రయత్నించి, చివరికి విఫలం చెంది ధనస్సు సంధించుతాడు. రామబాణం మాయ లేడికి తగిలి, దాని శరీర అవయవాలు అయిదు ప్రాంతాలల్లో పడ్డాయి. మారీచుని సంహరించిన పాప పరిహారార్ధం, శ్రీ రాముడు ఆ అయిదు ప్రాంతాలల్లో అయిదు శివ లింగాలను ప్రతిష్టించి, ఆరాధించాడు.

తూరంగి - శ్రీ తూరంగేశ్వర స్వామి,

పాత కోరంగి - శ్రీ కురంగేశ్వర సామి,

కాజులూరు - శ్రీ రామలింగేశ్వర స్వామి,

అయితపూడి - శ్రీ రామలింగేశ్వర స్వామి,

ఐలెండు పోలవరం - శ్రీ బాణేశ్వర స్వామి

(మురమళ్ళ కు సూమారు ఏడు కీలోమిటారు దూరం లో ఐలెండు పోలవరం ఉంటుంది)

ఇవి శ్రీ రాముడు ప్రతిష్టించిన లింగాలుగా ఖ్యాతి పొందినాయి.

* కోరంగి - పాత కోరంగి మధ్య కోరంగి నది ఉంటుంది. నదిలో పడవ సౌకర్యం కలదు.

  అయితపూడి గ్రామం లో శ్రీ అన్నపూర్ణా సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం ఉంది. ఆలయం రోహిణి నక్షత్రము 3వ పాదమం కు చెందినది. ప్రాచీన ఆలయం జీర్ణమైనది.  గ్రామస్ధుల సహాకారముతో పునః నిర్మాణం జరిగింది. కాశీ క్షేత్రం నుంచి తెచ్చిన ఒక శివలింగమును ప్రతిష్టించారు. ఆలయ ప్రాంగణములో ధ్వజ స్ధంబం, ముఖ మండపం, అంతరాలయం, గర్భాలయం ఉంటాయి. గర్భాలయం నందు శ్రీ అన్నపూర్ణా సమేత రామలింగేశ్వర స్వామి తూర్పు అభిముఖంగా కొలువై యున్నాడు. అంతరాలయం నందు గణపతి, సుబ్రహ్మణ్య స్వామి దర్శనమిస్తారు. ముఖ మండపం నందు నంది విగ్రహం మరియు శ్రీ అన్నపూర్ణా దేవి మందిరం ఉంటాయి. అమ్మ వారు దక్షిణాభి ముఖంగా కొలువుదీరింది.  ఆలయ ప్రాంగణములో చండేశ్వరుడు గలడు. రోహిణి నక్షత్రము 3వ పాదములో జన్మించిన వారి వలన మేనమామకు మరియు తల్లికి దోషము కలుగను. వాటిని నివారించుటకు ఆలయం నందు అభిషేక శాంతులు నిర్వహించుతారు.

రవాణా సమాచారం: ద్రాక్షారామం నుంచి యానాం బస్సులు (Via) ఎర్ర పోతవరం, బాలాంత్రం, కుయ్యేరు, ఇంజరం మీదగా ప్రతి గంటకు ఉంటాయి. ద్రాక్షారామం నకు సుమారు 9 Kms. దూరంలో కుయ్యేరు ఉంటుంది. కుయ్యేరు నుంచి గొల్లపాలెం కు (Via) దుగ్గుదూరు, కాజులూరు, చేదువాడ బ్రిడ్జి మీదగా రోడ్డు మార్గం కలదు.

* కుయ్యేరు కు సుమారు  4 Kms. దూరంలో దుగ్గుదూరు ఉంటుంది. దుగ్గుదూరు కు ఈశాన్యం దిశగా సుమారు 3 Kms. దూరంలో  అయితపూడి గ్రామం ఉంటుంది. దుగ్గుదూరు నుంచి అయితపూడి కి ఆటోలు దొరుకుతాయి.

* ద్రాక్షారామం నుంచి అయితపూడి గ్రామం నకు ఆటో రాను - పోను ఏర్పాట్లు చేసుకోవటం సౌక్యం. ఆటోలు (via) ఉండూరు మీదగా ఉంటాయి. ఉండూరు దాటిన తరువాత ఉండూరు బ్రిడ్జి వస్తుంది.

* ఉండూరు బ్రిడ్జి నుంచి కాలువ గట్టు మీదగా నంది బొమ్మ సెంటర్ కు (ఆంజనేయ స్వామి) ఆటోలు చేరుకొంటాయి. నంది బొమ్మ సెంటర్ నుంచి అయితపూడి గ్రామంకు దారి ఉంటుంది. ద్రాక్షారామం - అయితపూడి మధ్య దూరం 13 Kms. గా ఉండును. ఈ మార్గం బాగుటుంది.

* కాకినాడ - కోటిపల్లి బస్సులు (Via) గొల్లపాలెం, ద్రాక్షారామం మీదగా ప్రతి గంటకు ఉంటాయి.

* కాకినాడ - కోటిపల్లి రోడ్డు మార్గములో గొల్లపాలెం ఉంటుంది. గొల్లపాలెం మార్కెట్ బస్ స్టాప్ దాటగానే గొల్లపాలెం (కాజులూరు సెంటర్) బస్ స్టాప్ వస్తుంది. ఇక్కడ నుంచి కుయ్యేరు రోడ్డు ప్రారంభమవుతుంది.

* గొల్లపాలెం (కాజులూరు సెంటర్) నుంచి కుయ్యేరు కు (Via) చేదువాడ బ్రిడ్జి, కాజులూరు, దుగ్గుదూరు మీదగా బ్రాంచి రోడ్డు మార్గం కలదు.

* గొల్లపాలెం నుంచి అయితపూడి కు ఆటోలు (Via) చేదువాడ బ్రిడ్జి, తిప్పరాజు పాలెం మీదగా దొరుకుతాయి. చేదువాడ బ్రిడ్జి దాటగానే కుడి వైపు కు పోవు మార్గములో నంది బొమ్మ సెంటర్  (హనుమాన్ గుడి) ఉంటుంది. అక్కడ నుంచి అయితపూడి కి రోడ్డు ఉంటుంది. గొల్లపాలెం నుంచి అయితపూడి కి రాను - పోను ఆటో ఏర్పాట్టు చేసుకోవటం సౌక్యముగా ఉంటుంది. వీటి మధ్య దూరం సుమారు 10 kms.

* కాకినాడ - పల్లిపాలెం,  కాకినాడ - దుగ్గుదూరు, కాకినాడ - కాజులూరు బస్సులు (via) గొల్లపాలెం, చేదువాడ బ్రిడ్జి మీదగా ఉండేవి. ప్రస్తుతం బస్ సర్వీసులు లేవు.

అర్చక స్వామి: ఆలయ సమాచారం & Photos అందించిన అయితపూడి - శ్రీ రామలింగేశ్వర స్వామి, ఆలయ అర్చక స్వామి అయిన శ్రీ కొత్తలంక ప్రతాప్, సెల్ నెం. 9000782819 గార్కి నా నమసుమాంజలి.

విజ్ఞప్తి: ద్రాక్షారామ - శ్రీ భీమేశ్వరాలయం యొక్క ఉత్తర ముఖద్వారం వద్ద శ్రీ రాజ రాజేశ్వరి పీఠం వారి నిత్యాన్నదానం సత్రం కలదు. దూర ప్రాంతములు నుంచి ఆలయాలు సందర్శనకు వచ్చిన యాత్రికులకు ఉచ్చిత అన్న ప్రసాదములు వితరణ జరుగును. భక్తులు ముందుగా అన్నప్రాసాదం కోసం ఫోనులో సంప్రాదించాలి.

వీరి Cell 83320 29544.

వీరు వాహనములు కూడ ఏర్పాటు చేస్తారు.

రోహిణి నక్షత్రం స్తోత్రం

బ్రహ్మజ జ్ఞానం ప్రథమం పురస్వాద్వి సీమ: పురచే

వేనయాయహ: సబుధ్వా ఉపమా అస్య విష్ఠా:

సతశ్చ యోనిమ సతశ్చ విధి:||

రోజూ 11 సార్లు పఠించటం వల్ల సర్వశుభాలు కలుగుతాయి.