గమనిక: దైవదర్శనం కొరకు యాత్రికులు కనీసం ఒక రోజు ముందుగా అర్చకస్వామితో సంప్రదించండి. ప్రతి ఏట కొన్ని ఆలయాలలో అర్చక స్వాములు వంతులువారిగా మారుతుంటారు.

పులగుర్త గ్రామం / PULUGURTA VILLAGE

శ్రీ ఉమా పార్వతీ సమేత అగస్త్వేశ్వర స్వామి

కన్యారాశి, హస్త నక్షత్రం (3వ పాదం)

పాద శివలింగ స్ధానం: చాళుక్యుల భీమ మండలం నందలి ద్రాక్షారామ క్షేత్రానికి వాయువ్యం దిశగా, సుమారు 14 kms. దూరాన, పులగుర్త (Pulugurta) గ్రామం ఉంటుంది. ఇది తూర్పు గోదావరి జిల్లా, మండపేట మండలంకు చెందినది. పులగుర్త నందు శ్రీ ఉమా పార్వతీ సమేత అగస్త్వేశ్వర స్వామి (శివాలయం) కలదు. శ్రీ అగస్త్వేశ్వర లింగము భీమసభ నందలి 108 శివ లింగాలలో ఒకటిగా ప్రతీతి.

ఆలయం: ఆలయం చాల ప్రాచీనమైనది. పునర్నిర్మాణము జరిగింది. ప్రాంగణములో ధ్వజస్ధంభం, చండీశ్వరాలయం, ముఖమండపం, గర్భాలయం ఉంటాయి. ఆలయ గోపుర శిఖరము మరియు ముఖమంటపం నందు దేవత మూర్తులు అద్భుతంగా శిల్పీకరించబడ్డాయి. ముఖ మంటపం నందు గణపతి మరియు సుబ్రహ్మణ్యేశ్వరస్వామి సన్నిధిలున్నాయి. శ్రీ అగస్త్వేశ్వర స్వామికి నిత్య అర్చనలు జరుగుతాయి. స్వామి వారి కళ్యాణోత్సవములు ఫాల్గుణ శుద్ధ ఏకాదశి నాడు పాంచాహ్నికంగా జరుగుతుంది. శరన్నవ రాత్రులు, సుబ్రహ్మణ్యషష్ఠి, గణపతి నవరాత్రులు జరుగుతాయి. కన్యారాశి జాతకులు, క్షేత్రం లోని శివాలయంలో అర్చన, అభిషేకములు భక్తితో నిర్వర్తించిన యెడల విశేష ఫలితములు పొందగలరని భక్తజనుల విశ్వాసము.

రవాణా సమాచారం 1: రామచంద్రపురం - మండ పేట ప్రధాన రహదారి నందు మాచవరం సెంటర్ ఉంది. దీనిని సోమేశ్వరం వంతెన అని పిలుస్తారు ఇక్కడ నుంచి పులగుర్త కి ఆటోలు దొరుకుతాయి.

రవాణా సమాచారం 2: రామచంద్రపురం - మండ పేట ఆటోలు (వయా) పులగుర్త మీదగా ఉంటాయి. రామచంద్రపురం (రాజగోపాల సెంటర్) నుంచి కూడ దొరుకుతాయి.

అర్చక స్వామి: ఆలయ అర్చకులు శ్రీ చంద్రమౌళి మధు వెంకటేష్ శర్మ, సెల్ నెం: 93812 80993 సంప్రదించగలరు.

విజ్ఞప్తి: ద్రాక్షారామ - శ్రీ భీమేశ్వరాలయం యొక్క ఉత్తర ముఖద్వారం వద్ద శ్రీ రాజ రాజేశ్వరి పీఠం వారి నిత్యాన్నదానం సత్రం కలదు. దూర ప్రాంతములు నుంచి ఆలయాలు సందర్శనకు వచ్చిన యాత్రికులకు ఉచ్చిత అన్న ప్రసాదములు వితరణ జరుగును. భక్తులు ముందుగా అన్నప్రాసాదం కోసం ఫోనులో సంప్రాదించాలి.

వీరి Cell 83320 29544.

వీరు వాహనములు కూడ ఏర్పాటు చేస్తారు.

హస్త నక్షత్రం స్తోత్రం

విభ్రాడ బృహత్‌ పిబతు సౌమ్య మధ్యాయుర్ధగ యజ్ఞపతిం చ విహుతం

వాతజూతో యో అభిరక్షతుత్మనా ప్రజా: పుషోషపురుధ విరాజితి||

రోజూ 11 సార్లు పఠించటం వల్ల సర్వశుభాలు కలుగుతాయి.