గమనిక: దైవదర్శనం కొరకు యాత్రికులు కనీసం ఒక రోజు ముందుగా అర్చకస్వామితో సంప్రదించండి. ప్రతి ఏట కొన్ని ఆలయాలలో అర్చక స్వాములు వంతులువారిగా మారుతుంటారు.
కరప గ్రామం / KARAPA VILLAGE
శ్రీ పర్వతవర్ధని సమేత రామలింగేశ్వర స్వామి
మిధునరాశి, పునర్వసు నక్షత్రం (2వ పాదం)
పాద శివలింగ స్ధానం: చాళుక్యుల భీమ మండలం నందలి ద్రాక్షారామ క్షేత్రానికి ఈశాన్యం దిశగా, సుమారు 22 Kms. దూరాన, కరప గ్రామం (Karapa) కలదు. రామచంద్రపురం - కాకినాడ రోడ్డు మార్గములో కరప బస్ స్టాప్ ఉంటుంది. కరప బన్నీ కాంప్లెక్స్ సమీపం లో శ్రీ పర్వతవర్ధని సమేత రామలింగేశ్వర ఆలయం కలదు. శ్రీ రామలింగేశ్వర లింగము, పునర్వసు నక్షత్రం (2వ పాదం) చెందినది. పునర్వసు నక్షత్రం నందలి 2వ పాదము లో జన్మంచిన వారికి అభిషేక శాంతులు నిర్వహించుతారు. శ్రీ రామలింగేశ్వర లింగము భీమసభ నందలి 108 శివ లింగాలలో ఒకటిగా ప్రతీతి.
ఆలయం: కరప గ్రామం నందు శ్రీ పర్వతవర్ధని సమేత రామలింగేశ్వర ఆలయం పశ్చిమాభిముఖంగా ఉంటుంది. ఆలయం చాల ప్రాచీనమైనది. కాల క్రమంలో భక్తులు ఆలయం పునర్నిర్మాణము జరిపించారు. ఆలయ ప్రాంగణము విశాలముగా ఉంటుంది. ఆలయ ప్రాంగణములో ధ్వజ స్ధంబం, కళ్యాణ మండపం, నవగ్రహ మంటపం, ప్రధానాలయం, చండీశ్వరుడు మొదలగునవి దర్శనమిస్తాయి. ముఖ మండపం నందు శ్రీ నందీశ్వర స్వామి, ద్వారపాలకులు ఉంటారు. అంతరాలయం నందు చిన్న నంది, శ్రీ గణపతి, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, కళ్యాణ ఉత్సవ మూర్తుల దర్శనం లభ్యమవుతుంది. గర్భాలయం నందు శ్రీ రామలింగేశ్వర స్వామి కొలువుదీరినారు. వామ భాగం నందు శ్రీ పర్వతవర్ధని దేవి కొలువుదీరింది. స్వామి కృపతో సుఖ, సంతోష, ఆయురోగ్య, విజయ, ఐశ్వర్య, భోగ భాగ్యములు కలుగుతాయి. ఆలయం నందు ప్రతి నిత్యం అర్చనలు, అభిషేకాలు, శాంతులు నిర్వహించుతారు. స్వామి వారి వార్షిక కళ్యాణం జ్యేష్ట శుద్ధ ఏకాదశి నాడు జరుగుతుంది. మహాశివరాత్రి చాల వైభవంగా జరుగుతుంది. ప్రతి మాస శివరాత్రికి విశేష పూజలు ఉంటాయి. కార్తీక మాసంలో విశేష పూజలు జరుగుతాయి. కార్తీక పౌర్ణమి నాడు జ్వాలా తోరణము జరుపుతారు. శరన్నవరాత్రులు, సుబ్బారాయుడు షష్ఠి వేడుకులు వైభవంగా జరుగుతాయి.
రవాణా సమాచారం: ద్రాక్షారామం నకు వాయువ్య దిశగా, సుమారు 7 kms. దూరంలో రామచంద్రాపురం RTC బస్ స్టాండ్ ఉంటుంది. ద్రాక్షారామం నుంచి రామచంద్రాపురం నకు బస్సులు / ఆటోలు దొరుకుతాయి.
రామచంద్రాపురం బస్ స్టాండ్ నుంచి కాకినాడ కు బస్సులు చాల ఎక్కువుగా దొరుకుతాయి. రామచంద్రాపురం - కాకినాడ బస్సులు (via) వేలంగి, వేములవాడ, కరప మీదగా ఉంటాయి
అర్చక స్వామి: నక్షత్ర శాంతి కోసం ఆలయ అర్చక స్వామి శ్రీ భాస్కర కుమార స్వామి, సెల్ నెం. 9912577332 సంప్రదించగలరు. .
విజ్ఞప్తి: ద్రాక్షారామ - శ్రీ భీమేశ్వరాలయం యొక్క ఉత్తర ముఖద్వారం వద్ద శ్రీ రాజ రాజేశ్వరి పీఠం వారి నిత్యాన్నదానం సత్రం కలదు. దూర ప్రాంతములు నుంచి ఆలయాలు సందర్శనకు వచ్చిన యాత్రికులకు ఉచ్చిత అన్న ప్రసాదములు వితరణ జరుగును. భక్తులు ముందుగా అన్నప్రాసాదం కోసం ఫోనులో సంప్రాదించాలి.
వీరి Cell 83320 29544.
వీరు వాహనములు కూడ ఏర్పాటు చేస్తారు.
పునర్వసు నక్షత్రం స్తోత్రం
అదితి ధౌరదితిరం తరి క్షమదితి: మాతా స పితాన పుత్ర:|
విశ్వేదేవా అదితి పంచజనా అదితి జాతిమాది తిర్జనిత్వమ్||
రోజూ 11 సార్లు పఠించటం వల్ల సర్వశుభాలు కలుగుతాయి.