గమనిక: దైవదర్శనం కొరకు యాత్రికులు కనీసం ఒక రోజు ముందుగా అర్చకస్వామితో సంప్రదించండి. ప్రతి ఏట కొన్ని ఆలయాలలో అర్చక స్వాములు వంతులువారిగా మారుతుంటారు.

గొర్రిపూడి గ్రామం / GORRIPUDI

శ్రీ పార్వతీ సమేత భీమేశ్వర స్వామి

మిధునరాశి, పునర్వసు నక్షత్రం (1వ పాదం)

పాద శివలింగ స్ధానం: చాళుక్యుల భీమ మండలం నందలి ద్రాక్షారామ క్షేత్రానికి ఈశాన్యం దిశగా, సుమారు 18 kms. దూరాన, తుల్యభాగ నదీకి ఉత్తర తీరాన గొర్రిపూడి గ్రామం (Gorripudi) కలదు.  ద్రాక్షారామం - కాకినాడ రోడ్డు మార్గములో గొర్రిపూడి సెంటర్ ఉంటుంది. గొర్రిపూడి సెంటర్ నుంచి తూర్పు దిశగా సుమారు 1 Kms. దూరాన (లోపలకి) గొర్రిపూడి గ్రామం ఉంటుంది. గొర్రిపూడి గ్రామం నుంచి మరో 1.5 Kms.దూరంలో భీమలింగపాడు అను ప్రాంతము ఉంటుంది. ఇది పచ్చని తోటలతో అహ్లోదకరముగా ఉండును. ఈ ప్రాంతము యాత్రికులకు కనువిందు చేస్తుంది. పూర్వం భీమలింగపాడు ప్రాంతము ధనిక గ్రామంగా విలసిల్లింది. దేవదాసి కుటుంబాలకు పుట్టినిల్లుగా ఉండేదిట!  భోగం వీధులు యందు 100 గడపలు ఉండేవి అని చెప్పుచుంటారు.  వీరి ఆరాధ్య దైవమైన శివయ్యకు గొప్ప శివాలయం కూడ ఉండేది అని తెలుస్తుంది. ప్రతి నిత్యం ఒక దేవదాసి ఆలయం నందు భరతనాట్యం ప్రదర్శిస్తూ ఉండేదిట!  దేవదాసులు, చుట్టు ప్రక్కల గల పూదోట నుంచి పుష్పములు సేకరించి, స్వామిని సేవించేవారుట!  ప్రకృతి వైపరీత్యాల వలన నాటి దేవదాసి పురం తుడిచి పెట్టుకు పోయింది అని స్ధానికులు చెప్పుచుంటారు.  కొంత కాలం తర్వాత శ్రీ మట్ట వెంకన్న అనే ఒక శివ భక్తుని స్వప్నం స్వామి దర్శనమిచ్చి, తన ఉనికిని తెల్పి, పునః ప్రతిష్టకు ఆదేశించారు. అతడు గ్రామస్ధుల సహాకరముతో పునః ప్రతిష్ట చేసారు. చుట్టు ప్రక్కల గ్రామ వాసులు, దాతలు ధన సహాయముతో ఆలయ అభివృద్ధి పనులు చేపట్టినారు. ఆలయ అభివృద్ధి కోసం, ఆలయ కమీటి వారు విరాళములు సేకరించుచున్నారు. ఆలయ కమిటీ మెంబర్ సెల్ నంబర్: 99492 74443 & 95424 14179 సంప్రదించగలరు.

  భక్తులు స్వామిని శ్రీ పార్వతీ సమేత భీమేశ్వరగా కొలుస్తారు. స్ధానికులు ' పాటిమీద గుడి ' అని పిలుస్తారు. పాటి అంటే ఇసుక/మట్టి దిబ్బ అని అర్ధం. శ్రీ భీమేశ్వర లింగము, పునర్వసు నక్షత్రం (1వ పాదం) చెందినది. ఈ రాశిలో జన్మించిన వారు ఈ క్షేత్రం నందలి భీమేశ్వర స్వామి దర్శించుట పుణ్యధాయకం. శ్రీ భీమేశ్వర లింగము భీమసభ నందలి 108 శివ లింగాలలో ఒకటిగా ప్రతీతి.

ఆలయం: ఆకు పచ్చని వనాలు మధ్యన శ్రీ పార్వతీ సమేత భీమేశ్వర స్వామి ఆలయం పునర్నిర్మాణము జరిగింది. ఆలయ ప్రాంగణము విశాలముగా ఉంటుంది.  ఆలయ ప్రాంగణములో ధ్వజ స్ధంబం, నంది విగ్రహం, ప్రధానాలయం ఉంటాయి. ప్రధానాలయం తూర్పు అభిముఖంగా ఉంటుంది. ముఖ మండపం నందు నందీశ్వరుడు, సుబ్రహ్మణ్య స్వామి, గణపతి, అయ్యప్ప స్వామి ఉన్నారు. గర్భాలయం నందు  శ్రీ భీమేశ్వర లింగము దర్శనమిస్తుంది. స్వామి వామ భాగం నందు  శ్రీ పార్వతీ దేవి కొలువుదీరింది. స్వామి కృపతో సుఖ, సంతోష, ఆయురోగ్య, విజయ, ఐశ్వర్య, భోగ భాగ్యములు కలుగుతాయి. ప్రస్తుతం ఆలయాన్నికి ప్రత్యేకముగా అర్చకులు లేరు. స్ధానికంగా వున్న శ్రీ ధనరాజు మరియు ఆలయ కమిటీ సభ్యుల స్వామిని సేవించు చున్నారు. ప్రతి నిత్యం శ్రీ ధనరాజు గారు నియమ నిష్టలతో స్వామికి దూప, దీప, నైవేద్యాలు సమర్పించుట జరుగుతుంది.

భీమేశ్వర కమిటీ/గొర్రిపూడి వారి ఆధ్వర్యంలో స్వామి వారి కళ్యాణం ఫాల్గుణ పూర్ణిమ (హోళీ పూర్ణిమ) నాడు జరుగుతుంది. ఉదయం భక్తులు తుల్యభాగ నదీ రేవులో పవిత్ర స్నానాలు ఆచారించుతారు. పిమ్మట స్వామిని సేవించుతారు. హోళీ పౌర్ణమి నాటి రాత్రి తీర్ధ జాతర చాల వైభవంగా జరుగుతుంది. చుట్టు ప్రక్కల ప్రాంతాలు నుంచి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొంటారు. మహా శివరాత్రి కూడ ఘనముగా జరుగుతుంది. కార్తీక మాసంలో చుట్టు ప్రక్కల ప్రాంతాల వారు వన భోజన కార్యక్రమాలలో పాల్గొంటారు. మిగిలన సందర్భములో ఆలయ ప్రాంతము నందు భక్తులు ఉండరు.

ఆలయం నకు సమీపంలో శ్రీ ధనరాజు గారి నివాసం ఉంటుంది. ఆలయ దర్శనం కోసం  ఆలయ కమిటీ సభ్యులును మరియు శ్రీ ధనరాజు, సెల్: 9542414179 గారిని ముందుగా సంప్రదించగలరు. వీరు భక్తులకు దైవ దర్శనం కల్పించుతారు. ఆలయ కమిటీ సభ్యులలో కొంత మంది సెల్: 9949274443 (శ్రీ వీరబాబు, శ్రీ ఈశ్వర మెడికల్ షాప్, గొర్రిపూడి) మరియు సెల్: 9848424422 (శ్రీ ఆనంద్, గొర్రిపూడి) వారిని ముందుగా సంప్రదించగలరు.

రవాణా సమాచారం: కోటిపల్లి నుంచి కాకినాడ పోవు బస్సులు (Via) ద్రాక్షారామం, ఉండూరు, జగన్నాధగిరి, గొల్లపాలెం, గొర్రిపూడి మీదగా ప్రతి గంటకు ఉంటాయి. ద్రాక్షారామం నకు సుమారు 16 Kms. దూరంలో గొర్రిపూడి సెంటర్ ఉంటుంది. సెంటర్ నుంచి గొర్రిపూడి గ్రామం దూరం  సుమారు 01 Km. గా ఉంటుంది.  యాత్రికులు గొర్రిపూడి సెంటర్ బస్ స్టేజి దిగాలి. గొర్రిపూడి సెంటర్ బస్ స్టాప్ కు సుమారు 2.5 Kms దూరంలో (ఊరు లోనికి) పాటి మీద శివాలయం ఉంటుంది. దీనినే భీమలింగపాడు శివాలయం అని కూడ అంటారు. గొర్రిపూడి సెంటర్ బస్ స్టేజి లో ఆటోలు దొరుకుతాయి. యాత్రికులు రాను-పోను ఆటోలు ఏర్పాట్టు చేసుకోవాలి.

ద్రాక్షారామం నుంచి గొర్రిపూడి సెంటర్ మీదగా కాకినాడ కు షేరింగ్ ఆటోలు కూడ దొరుకుతాయి.

విజ్ఞప్తి: ద్రాక్షారామ - శ్రీ భీమేశ్వరాలయం యొక్క ఉత్తర ముఖద్వారం వద్ద శ్రీ రాజ రాజేశ్వరి పీఠం వారి నిత్యాన్నదానం సత్రం కలదు. దూర ప్రాంతములు నుంచి ఆలయాలు సందర్శనకు వచ్చిన యాత్రికులకు ఉచ్చిత అన్న ప్రసాదములు వితరణ జరుగును. భక్తులు ముందుగా అన్నప్రాసాదం కోసం ఫోనులో సంప్రాదించాలి.

వీరి Cell 83320 29544.

వీరు వాహనములు కూడ ఏర్పాటు చేస్తారు.

పునర్వసు నక్షత్రం స్తోత్రం

అదితి ధౌరదితిరం తరి క్షమదితి: మాతా స పితాన పుత్ర:|

విశ్వేదేవా అదితి పంచజనా అదితి జాతిమాది తిర్జనిత్వమ్‌||

రోజూ 11 సార్లు పఠించటం వల్ల సర్వశుభాలు కలుగుతాయి.