గమనిక: దైవదర్శనం కొరకు యాత్రికులు కనీసం ఒక రోజు ముందుగా అర్చకస్వామితో సంప్రదించండి. ప్రతి ఏట కొన్ని ఆలయాలలో అర్చక స్వాములు వంతులువారిగా మారుతుంటారు.

సోమేశ్వరం గ్రామం / SOMESWARAM VILLAGE

శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి సమేత సోమేశ్వర స్వామి

కన్యారాశి, హస్త నక్షత్రం (1వ పాదం)

అష్ట సోమేశ్వరాలయాలు (వాయువ్యం క్షేత్రం)

పాద శివలింగ స్ధానం: చాళుక్యుల భీమ మండలం నందలి ద్రాక్షారామ క్షేత్రానికి వాయువ్యం దిశగా, సుమారు 14 kms. దూరాన, సోమేశ్వరం (Someswaram) అను గ్రామం కలదు. రామచంద్రపురం - మండపేట రోడ్డులో మాచవరం సెంటర్ ఉంది. దీనికి ఉత్తర దిశగా, సుమారు 1.5 Kms. దూరాన సోమేశ్వరం గ్రామం ఉంటుంది. క్షేత్రం నందు సోముడు (చంద్రుడు) ఒక మండల కాలము తపస్సు చేసి, ఒక శివ లింగాన్ని ప్రతిష్టించి ఆరాధించాడు. ఆ కారణముగా క్షేత్రం సోమేశ్వరం గా ఖ్యాతి పొందినది. ఇచ్చట శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి సమేత సోమేశ్వరాలయం దర్శించగలము. శ్రీ సోమేశ్వర లింగము భీమసభ నందలి 108 శివ లింగాలలో ఒకటిగా ప్రతీతి.

ఆలయం: శివుని దర్మపత్ని యగు సతిదేవి తండ్రి దక్షప్రజాపతి. ఇతడు వినాస బుద్ధి తో పరమేశ్వరుడుని కించపరుటకు ఒక యజ్ఞం ప్రారంభించుతాడు. ఆ యజ్ఞ వాటిక 'దక్షరామ' గా ప్రసిద్ధికెక్కింది. కాలక్రమేణ ద్రాక్షారామ గా వాడుకలోకి వచ్చింది. వ్యాస కాశీగా ద్రాక్షారామనికి ప్రశస్తి ఉంది.

దక్షిణ కాశీగా పిలువబడే ద్రాక్షారామ క్షేత్రం నందలి శ్రీ భీమేశ్వర లింగము స్వయంభూమూర్తి. ముందుగా సూర్య భగవానుడు ఆరాధించినాడు. ఆ రుద్రమూర్తిని శాంతపరచేందుకు సోముడు (చంద్రుడు) సోమేశ్వరం క్షేత్రంలో ఒక లింగాన్ని ప్రతిష్టించాడు. ఆ లింగము ద్రాక్షారామ క్షేత్రం నకు వాయువ్యం దిశలో గల సోమేశ్వరం గ్రామములో ఉంది. ఇచ్చట శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత సోమేశ్వర స్వామిని దర్శించగలము. మిగిలన దిక్కుల యందు సప్తర్షులు సప్త లింగాలును ప్రతిష్టించారు. అత్రి, భరద్వాజుడు, గౌతముడు, జమదగ్ని, కశ్యపుడు, వశిష్ఠుడు, విశ్వామిత్రు ఋషులును సప్తర్షులుగా పురాణములు పేర్కొనాయి. వీరు ద్రాక్షారామ క్షేత్రం చుట్టూ గల సప్త క్షేత్రాలలో సప్త సోమేశ్వర (చంద్ర) లింగాలును ప్రతిష్టించారు. ద్రాక్షారామ క్షేత్రానికి గల ఎనిమిది దిక్కుల యందు అష్ట సోమేశ్వరాలయాలు దర్శించగలము. ఇవి ద్రాక్షారామం పరిసరాల్లోనే ఉంటాయి. వీటి దర్శనం పుణ్యధాయకం అని ఆర్యులు అంటారు.

ఆలయ సమూహం విశాలముగా ఉంటుంది. ఆలయ ప్రాంగణములో ప్రధానాలయం పశ్చిమాభిముఖముగా ఉంటుంది. ఆలయ ప్రాంగణములో ప్రధానాలయం తో పాటు ధ్వజ స్ధంభం, శ్రీ పర్వత వర్ధని సమేత బ్రహ్మేశ్వర స్వామి, శ్రీ వల్లీ - దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు కలవు. ప్రధానాలయం యొక్క గూటి నందు శ్రీ దుండు గణపతి, శ్రీ చండీశ్వర స్వామి కలరు. వీటితో పాటు శ్రీ సూర్యనారాయణ మూర్తి, శ్రీ కాలభైరవ స్వామి దర్శనమిస్తారు. శ్రీ ఆంజనేయ స్వామి క్షేత్రపాలకడు. ఆలయ ముఖ మండపం నందు నంది, వినాయకుడు, సత్య సాయిబాబను చూడగలము. అంతరాళయం నందు కళ్యాణ ఉత్సవమూర్తులు, నిత్య ఉత్సవమూర్తులు, నందీశ్వరుడు దర్శనమిస్తారు. గర్భాలయం నందు ఏక పీఠం పైన శ్రీ సోమేశ్వర లింగము మరియు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారి కొలువుదీరారు.

శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత సోమేశ్వర లింగమును అర్చించిన వారికి సకల శుభములు కలుగును అని భక్తుల విశ్వాసం. స్వామి కృపతో సుఖ, సంతోష, ఆయురోగ్య, విజయ, ఐశ్వర్య, భోగ భాగ్యములు కలుగుతాయి. ఆలయం నందు ప్రతి నిత్యం అర్చనలు, అభిషేకాలు, శాంతులు జరుగుతాయి. వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు కళ్యాణ ఉత్సవాలు పాంచాహ్నికంగా నిర్వహించుతారు. మహా శివరాత్రి సందర్భముగా సోమేశ్వర లింగము నకు విశేష అభిషేకాలు జరుగుతాయి. రాత్రికి లింగోద్భవ సమయంలో అభిషేకాలు నిర్వహించుతారు. ప్రతి మాసశివరాత్రికి లక్ష పత్రి పూజ జరుగుతుంది. ఆలయం నందు కార్తీక మాసంలో విశేష పూజలు, అభిషేకాలు, లక్ష పత్రి పూజ & జ్వాలతోరణం జరుగుతాయి. గణపతి నవరాత్రులు, శరన్నవరాత్రులు విశేషముగా ఉంటుయి. ముక్కోటి ఏకాదశి, ధనుర్మాసం పూజలు, హనుమాన్ జయింతి మొదలగునవి విశేషముగా జరుగుతాయి. సుబ్బారాయుడు షష్ఠి సందర్భముగా కళ్యాణం జరుగుతుంది. ఆలయ సేవలు కోసం అర్చక స్వామి శ్రీ పరిటాల సుబ్రహ్మణ్య శర్మ, సెల్: 99896 26953 సంప్రదించగలరు.

రవాణా సమాచారం 1: ద్రాక్షారామం నకు వాయువ్య దిశగా, సుమారు 6 kms. దూరంలో రామచంద్రపురం ఉంటుంది. ద్రాక్షారామం నుంచి బస్సులు / ఆటోలు దొరుకుతాయి.

రవాణా సమాచారం 2: రామచంద్రపురం RTC Bus stand నుంచి అనపర్తి బస్సులు (వయా) సోమేశ్వరం మీదగా ఉంటాయి.

రవాణా సమాచారం 3: రామచంద్రపురం RTC bus stand నుంచి మండపేట వైపు బస్సులు అధికముగా ఉంటాయి. రామచంద్రపురం - మండపేట రోడ్డులో పసలపూడి దాటిన తరువాత మాచవరం సెంటర్ వస్తుంది. మాచవరం సెంటర్ కు ఉత్తర దిశగా, సుమారు 1.5 Kms. దూరాన సోమేశ్వరం గ్రామం ఉంటుంది. మాచవరం సెంటర్ లో ఆటోలు ఉంటాయి.

అర్చక స్వామి: ఆలయ సమాచారం & Photos అందించిన సోమేశ్వరం - శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి సమేత సోమేశ్వరాలయ ఆలయ అర్చక స్వామి శ్రీ పరిటాల సుబ్రహ్మణ్య శర్మ, సెల్: 99896 26953 గార్కి నా నమసుమాంజలి.

విజ్ఞప్తి: ద్రాక్షారామ - శ్రీ భీమేశ్వరాలయం యొక్క ఉత్తర ముఖద్వారం వద్ద శ్రీ రాజ రాజేశ్వరి పీఠం వారి నిత్యాన్నదానం సత్రం కలదు.  దూర ప్రాంతములు నుంచి ఆలయాలు సందర్శనకు వచ్చిన యాత్రికులకు ఉచ్చిత అన్న ప్రసాదములు వితరణ జరుగును. భక్తులు ముందుగా అన్నప్రాసాదం కోసం ఫోనులో సంప్రాదించాలి.

వీరి Cell 83320 29544.

వీరు వాహనములు కూడ ఏర్పాటు చేస్తారు.

హస్త నక్షత్రం స్తోత్రం

విభ్రాడ బృహత్‌ పిబతు సౌమ్య మధ్యాయుర్ధగ యజ్ఞపతిం చ విహుతం

వాతజూతో యో అభిరక్షతుత్మనా ప్రజా: పుషోషపురుధ విరాజితి||

రోజూ 11 సార్లు పఠించటం వల్ల సర్వశుభాలు కలుగుతాయి.