గమనిక: దైవదర్శనం కొరకు యాత్రికులు కనీసం ఒక రోజు ముందుగా అర్చకస్వామితో సంప్రదించండి. ప్రతి ఏట కొన్ని ఆలయాలలో అర్చక స్వాములు వంతులువారిగా మారుతుంటారు.
వీరవల్లిపాలెం గ్రామం / VEERAVALLIPALEM VILLAGE
శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వర స్వామి
మకర రాశి, శ్రవణం నక్షత్రం (4వ పాదం)
పాద శివలింగ స్ధానం: చాళుక్యుల భీమ మండలం నందలి ద్రాక్షారామ క్షేత్రానికి నైఋతి దిశగా సుమారు 16 kms. దూరాన వీరవల్లిపాలెం (Veeravallipalem) అను గ్రామం కలదు. ఇచ్చట శ్రీ వీరేశ్వర లింగమును దర్శించగలము. శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయం శ్రవణం నక్షత్రం (4వ పాదం) చెందినది. శ్రీ వీరేశ్వర లింగము భీమసభ నందలి 108 శివ లింగాలలో ఒకటిగా ప్రతీతి.
ఆలయం: శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయం చాల ప్రాచీనమైనది. కాల క్రమములో ఆలయం పునర్నిర్మాణము జరిగింది. ఆలయ ప్రాంగణములో ధ్వజస్ధంభం, చండీశ్వరాలయం, గణపతి, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, ముఖమండపం, గర్భాలయం ఉంటాయి. ఆలయ గోపుర శిఖరము నందు దేవతా మూర్తులు కలరు. శ్రీ వీరేశ్వర లింగం కి నిత్య అర్చనలు జరుగుతాయి. శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవములు జ్యేష్ఠ బహుళ చవితి నుండి పాంచాహ్నికంగా జరుగుతుంది. గణపతి నవరాత్రులు నిర్వ హించబడతాయి. సుబ్రహ్మణ్యషష్ఠి తీర్థం ప్రత్యేకం జరుగుతాయి. మకర రాశి జాతకులు, క్షేత్రం లోని శివాలయంలో అర్చన, అభిషేకములు భక్తితో నిర్వర్తించిన యెడల విశేష ఫలితములు పొందగలరని భక్తజనుల విశ్వాసము.
స్ధల పురాణం: పవిత్ర గోదావరి నదికి ఉత్తర తీరం నందు కోటిపల్లి క్షేత్రం మరియు దక్షిణ తీరం నందు వీరవల్లిపాలెం ఉన్నాయి. త్రేతాయుగములో శ్రీ రామచంద్ర మూర్తి తన పరివారముతో పుష్పక విమానంలో తీర్ధ యాత్రలకు బయలు దేరుతాడు. కోటిపల్లి క్షేత్రం దర్శనం పిమ్మట తిరుగు ప్రయాణములో ఒక ప్రాంతము నందు పుష్పక విమానం ఆగిపోతుంది. వానర వీరులు శోధించగా ఒక మట్టి పుట్ట నుంచి దివ్య కాంతి కనబడుతుంది. ఆ పుట్టలో ఒక శివాలయం ఉంటుంది. అదే శ్రీ క్షణ ముక్తేశ్వర శివాలయం. శ్రీ రామచంద్ర మూర్తి తన పరివారముతో శ్రీ క్షణ ముక్తేశ్వర స్వామిని సేవించుతారు. వానర వీరులు విడిది చేసిన ఆ ప్రాంతము వీరవల్లిపాలెం గా ఖ్యాతి పొందినది.
రవాణా సమాచారం: వీరవల్లిపాలెం నకు దక్షిణ దిశగా సుమారు 15 Kms. దూరాన అమలాపురం ఉంది. ఇది కోనసీమ జిల్లా కేంద్రం. అమలాపురం నుంచి వీరవల్లిపాలెం నకు ప్రతి 2 గంటలకు బస్సులు (Via) ముక్తేశ్వరం మీదగా ఉంటాయి.
రవాణా సమాచారం: రావులపాలెం - అద్దంకి వారి లంక కు బస్సులు (Via) వాడపాలెం, ముక్తేశ్వరం, వీరవల్లిపాలెం మీదగా రోజుకు 2 బస్సులు ఉంటాయి.
* రావులపాలెం - వీరవల్లిపాలెం మధ్య దూరం సుమారు 26 Kms.
రవాణా సమాచారం: ముక్తేశ్వరం నుంచి వీరవల్లిపాలెం షేరింగ్ ఆటోలు (Via) శ్రీ క్షణ ముక్తేశ్వర శివాలయం మీదగా ఉంటాయి.
రవాణా సమాచారం: కోటిపల్లి రేవు నుంచి ముక్తేశ్వరం రేవుకు Boat సౌకర్యములు ఉంటాయి. ముక్తేశ్వరం రేవు నుంచి ముక్తేశ్వరం కు రవాణ సౌకర్యములు ఉంటాయి. ముక్తేశ్వరం నుంచి వీరవల్లిపాలెం కి ఆటోలు ఉంటాయి. వీటి మధ్య దూరం సుమారు 6 Kms.
అర్చక స్వామి: ఆలయ అర్చకస్వామి శ్రీ వి.కామేశ్వర , సెల్ నెం : 99488 45269 సంప్రదించగలరు.
విజ్ఞప్తి: ద్రాక్షారామ - శ్రీ భీమేశ్వరాలయం యొక్క ఉత్తర ముఖద్వారం వద్ద శ్రీ రాజ రాజేశ్వరి పీఠం వారి నిత్యాన్నదానం సత్రం కలదు.దూర ప్రాంతములు నుంచి ఆలయాలు సందర్శనకు వచ్చిన యాత్రికులకు ఉచ్చిత అన్న ప్రసాదములు వితరణ జరుగును. భక్తులు ముందుగా అన్నప్రాసాదం కోసం ఫోనులో సంప్రాదించాలి.
వీరి Cell 83320 29544.
వీరు వాహనములు కూడ ఏర్పాటు చేస్తారు.
శ్రవణం నక్షత్రం స్తోత్రం
విష్ణోరరాటమసి విష్ణో: శ్నపత్ర స్థో విష్ణో: సూర్యసి విష్ణో:
ధ్రువోసి వైష్ణవమసి విష్ణ్యోత్వా||
రోజూ 11 సార్లు పఠించటం వల్ల సర్వశుభాలు కలుగుతాయి.
వీడియో వివరణ / Video Description
ఆడియో వివరణ / Audio Description