గమనిక: దైవదర్శనం కొరకు యాత్రికులు కనీసం ఒక రోజు ముందుగా అర్చకస్వామితో సంప్రదించండి. ప్రతి ఏట కొన్ని ఆలయాలలో అర్చక స్వాములు      వంతులువారిగా మారుతుంటారు.

" అభిషేకాలు కన్నా శివ దర్శనం మిన్న"

ఉప్పుమిల్లి గ్రామం / UPPUMILLI VILLAGE

శ్రీ బాలా త్రిపుర సుందరీ సమేత శ్రీ భవానీ శంకర స్వామి

మేషరాశి, అశ్వని నక్షత్రం (2వ పాదం)

పాద శివలింగ స్ధానం: చాళుక్యుల భీమ మండలం నందలి ద్రాక్షారామ క్షేత్రానికి ఆగ్నేయం దిశగా, సుమారు 10 kms. దూరాన, ఉప్పుమిల్లి (Uppumilli) గ్రామం కలదు. ఉప్పుమిల్లి బస్ స్టాప్ కు సుమారు 750  మీటర్లు లోపలకి శ్రీ బాలా త్రిపుర సుందరీ సమేత  శ్రీ భవానీ శంకర స్వామి ఆలయం ఉంది. బస్ స్టాప్ నుంచి ఆలయం కు రవాణా సౌకర్యములు చాల తక్కువుగా ఉంటాయి. 

ఆలయం: గౌతమీ నది (గోదావరి) తీరములో అనేక పుణ్య క్షేత్రాలు వెలిసాయి. వీటిలో ఉప్పుమిల్లి క్షేత్రం ఒకటి. అత్రి నది తీరములో శ్రీ భవానీ శంకర ఆలయం కలదు. భీమసభ నందలి 108 శివ లింగాలలో ఒకటిగా ప్రతీతి. అత్రి మహాముని తీసుకు వచ్చిన నదిని  'ఆత్రేయ గోదావరి'  గా పిలుస్తారు. అత్రి పాయ (కాలువ) ప్రవాహం కోరింగి గ్రామం దాటిన తర్వాత సాగరములో ( లవణ సముద్రం) కలుస్తుంది. అత్రి కాలువను "బ్యాక్ వాటర్ కాలువ" అని కూడ పిలుస్తారు. లవణ సముద్రం ఆటు పోటులను బట్టి బ్యాక్ వాటర్ నీరు ఉప్పుగా మారుతుంది. అత్రి కాలువ (టేకి డ్రైన్ రివర్) ఒడ్డున ఉప్పుమిల్లి గ్రామం ఉంటుంది. లవణ సముద్రం కాలువ తీరములో ఉన్న కారణంగా ఈ గ్రామమునకు ఉప్పుమిల్లి అనే పేరువచ్చింది. 

       పూర్వం ఈ ప్రాంతమంతా మహారణ్యం. త్రేతాయగములో శ్రీ రామచంద్రుడు అరణ్యవాసం సందర్భముగా సీతా లక్ష్మణుల సమేతంగా కొంత కాలము నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్టించి నిత్యం ఆరాధించేవాడు. భక్త శంకరుడయిన పరమేశ్వేర లింగాన్ని భక్తులు, ఋషులు, తపోనిష్టలు, శివరాధకులు కొలచేవారు. వీరిలో భవానీ అను ఒక మహాభక్తురాలు నిత్యమూ శంకరుడును స్మరిస్తూ జీవితం గడిపేది. ఆమె వృద్ధాప్యములో శివదర్శనం కోసం తపించేది. ఒక రోజున జగన్మాత బాలా త్రిపురసుందరీ దేవి,  ఒక బాలిక రూపములో భవాని వద్దకు వచ్చి, భక్తురాల అభిష్టం గ్రహించింది. ఆమె కోరికను మన్నించి, శంకరుని సమేతంగా బాలా త్రిపురసుందరీ దేవి దర్శనమిచ్చి, మోక్షం ప్రసాదించింది. ఆ భక్తురుల అభిష్టం మేరకు స్వామి శ్రీ బాలా త్రిపురసుందరీ దేవి సమేత భవానీ శంకరుడు గా ఖ్యాతి పొందినాడు. 

       ఆలయ ప్రాంగణములో ప్రధానాలయంతో పాటు నవగ్రహ మండపం, శ్రీ లక్ష్మీనారాయణ సన్నిధి మొదలగునవి కలవు. ఆలయం నందు ఒక నియమం ఉంది. గర్భాలయం నందలి శ్రీ బాలా త్రిపురసుందరీ దేవి సమేత భవానీ శంకర స్వామి దర్శించిన పిమ్మట శ్రీ నందీశ్వరుని దర్శించుకోవాలి. భవానీ శంకర స్వామి కృపతో సుఖ, సంతోష, ఆయురోగ్య, విజయ, ఐశ్వర్య, భోగ భాగ్యములు కలుగుతాయి. 

రవాణా సమాచారం 1: ద్రాక్షారామం నకు సుమారు 10 kms. దూరాన ఉప్పుమిల్లి గ్రామం ఉంది. ద్రాక్షారామం నుంచి యానాం బస్సులు (Via) ఎర్ర పోతవరం, బాలాంత్రం, కుయ్యేరు, ఉప్పుమిల్లి బస్ స్టాప్, కోలంక, ఇంజరం మీదగా ప్రతి గంటకు ఉంటాయి. 

రవాణా సమాచారం 2: ఉప్పుమిల్లి బస్ స్టాప్ వద్ద  వినాయక ఆలయం ఉంటుంది. గుడి ప్రక్క నుంచి ఉప్పుమిల్లి గ్రామం నకు రోడ్డు మార్గం కలదు.  ఉప్పుమిల్లి బస్ స్టాప్  నుంచి శివాలయం దూరం 750 Mtrs. 

అర్చక స్వామి: మాకు సహకరించిన ఉప్పుమిల్లి అర్చక స్వామి శ్రీ చంద్రమౌళి వెంకట చంద్రశేఖర శర్మ, సెల్ నెం. 9652321135 గార్కి నా నమసుమాంజలి.

విజ్ఞప్తి: ద్రాక్షారామ - శ్రీ భీమేశ్వరాలయం యొక్క ఉత్తర ముఖద్వారం వద్ద శ్రీ రాజ రాజేశ్వరి పీఠం వారి నిత్యాన్నదానం సత్రం కలదు. దూర ప్రాంతములు నుంచి ఆలయాలు సందర్శనకు వచ్చిన యాత్రికులకు ఉచ్చిత అన్న ప్రసాదములు వితరణ జరుగును. భక్తులు ముందుగా అన్నప్రాసాదం కోసం ఫోనులో సంప్రాదించాలి. 

వీరి Cell 83320 29544. 

వీరు వాహనములు కూడ ఏర్పాటు చేస్తారు.

అశ్వని నక్షత్రం స్తోత్రం

అశ్వినా తేజసాచక్షు: ప్రాణన సరస్వతీ వీర్యమ్‌|

వాచేంద్రో బలేనేంద్రాయ దఘరింద్రయమ్‌||

రోజూ 11 సార్లు పఠించటం వల్ల సర్వశుభాలు కలుగుతాయి.

వీడియో వివరణ / Video Description

ఆడియో వివరణ / Audio Description