గమనిక: దైవదర్శనం కొరకు యాత్రికులు కనీసం ఒక రోజు ముందుగా అర్చకస్వామితో సంప్రదించండి. ప్రతి ఏట కొన్ని ఆలయాలలో అర్చక స్వాములు వంతులువారిగా మారుతుంటారు.
"అభిషేకాలు కన్నా శివ దర్శనం మిన్న"
దుగ్గుదూరు గ్రామం / DUGGUDURU VILLAGE
శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వరస్వామి
మేషరాశి, అశ్వని నక్షత్రం (4వ పాదం)
పాద శివలింగ స్ధానం: చాళుక్యుల భీమ మండలం నందలి ద్రాక్షారామ క్షేత్రానికి ఆగ్నేయం దిశగా, సుమారు 12 kms. దూరాన, దుగ్గుదుర్రు (Dugguduru) గ్రామం కలదు. కుయ్యేరు - గొల్లపాలెం బ్రాంచి రోడ్డు మార్గంలో దుగ్గుదూరు జంక్షన్ కలదు. జంక్షన్ కు కొంత లోపలకి దుగ్గుదూరు గ్రామం ఉంటుంది. దుగ్గుదూరు గ్రామం నందు శ్రీ వేణుగోపాల స్వామి (వైష్ణ్వాలయం) మరియు శ్రీ మల్లేశ్వర స్వామి (శివాలయం) ఒకే ప్రాంతములో ఉంటాయి. శ్రీ మల్లేశ్వర లింగము భీమసభ నందలి 108 శివ లింగాలలో ఒకటిగా ప్రతీతి.
ఆలయం: పూర్వం నుంచి దుగ్గుదూరు గ్రామం పాలు ఉత్పత్తికి కేంద్రం. అప్పుడు దుగ్గుదూరు గ్రామమును " దుగ్ధలూరు" గా పిలిచేవారు. దుగ్ధ అనగా పాలు అని అర్ధం. ఆ కారణముగా గ్రామం దుగ్ధలూరు గా ప్రసిద్ధి చెందింది. ఇది కాలక్రమేన దుగ్గుదూరు గా మారింది. మండల కేంద్రమైన కాజులూరు బస్ స్టాపుకు నైఋతి దిశగా సుమారు మూడు Kms. దూరంలో దుగ్గుదూరు గ్రామం ఉంటుంది. ఇచ్చట శ్రీ పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి ఆలయం కలదు. ప్రాచీన ఆలయం శిథిలం కావడంతో నూతనముగా పునర్నిర్మాణము చేసారు. విశాలమైన ప్రాంగణములో శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయం ధ్వజ స్ధంభం, ముఖ మండపం, అంతరాళయం, గర్భాలయంతో బహు సుందరముగా ఉంటుంది. ముఖ మండపంలో దేవేరి పార్వతీ దేవికి సన్నిది కలదు. కామ్య గణపతి సర్వ సిద్ధిదాయకుడుగా కీర్తీ గావించాడు. గర్భాలయం నందలి శ్రీ మల్లేశ్వర లింగము స్వతగుణ స్వరాపుడు. స్వామిని సేవించిన వారికి భోగ భాగ్యములు ప్రసాదించుతాడు. ఆలయ అర్చక స్వామి బ్రహ్మశ్రీ నాగేశ్వర శర్మగారు శైవాగమ పద్ధతిలో అర్చనలు, ఉపచారాలు, శాంతులు మొదలగునవి జరుపించుతారు. చుట్టు ప్రక్కల గ్రామాలలో ఆలయ ప్రతిష్టలు, యజ్ఞాలు, పూజలు మొదలగునవి నిర్వహించుచుంటారు.
రవాణా సమాచారం 1: ద్రాక్షారామం నకు సుమారు 9 kms. దూరాన కుయ్యేరు బస్ స్టాప్ ఉంది. ద్రాక్షారామం - యానాం బస్సులు (Via) ఎర్ర పోతవరం, బాలాంత్రం, కుయ్యేరు బస్ స్టాప్, ఉప్పుమిల్లి , కోలంక, ఇంజరం మీదగా ప్రతి గంటకు ఉంటాయి.
రవాణా సమాచారం 2: కుయ్యేరు నుంచి దుగ్గుదూరు, కాజులూరు మీదగా గొల్లపాలెం నకు రోడ్డు మార్గం & ఆటోలు ఉంటాయి. కుయ్యేరు బస్ స్టాప్ - దుగ్గుదుర్రు మధ్య దూరం సుమారు 4 Kms గా ఉంటుంది. దుగ్గుదూరు గ్రామంలో శ్రీ పార్వతి సమేత శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయం ను దర్శించగలము.
అర్చక స్వామి: మాకు సహకరించిన దుగ్గుదుర్రు అర్చక స్వామి బ్రహ్మశ్రీ నాగేశ్వర శర్మ, Cell No. 99492 90986 గార్కి నా నమసుమాంజలి.
విజ్ఞప్తి: ద్రాక్షారామ - శ్రీ భీమేశ్వరాలయం యొక్క ఉత్తర ముఖద్వారం వద్ద శ్రీ రాజ రాజేశ్వరి పీఠం వారి నిత్యాన్నదానం సత్రం కలదు. దూర ప్రాంతములు నుంచి ఆలయాలు సందర్శనకు వచ్చిన యాత్రికులకు ఉచ్చిత అన్న ప్రసాదములు వితరణ జరుగును. భక్తులు ముందుగా అన్నప్రాసాదం కోసం ఫోనులో సంప్రాదించాలి.
వీరి Cell 83320 29544.
వీరు వాహనములు కూడ ఏర్పాటు చేస్తారు.
అశ్వని నక్షత్రం స్తోత్రం
అశ్వినా తేజసాచక్షు: ప్రాణన సరస్వతీ వీర్యమ్|
వాచేంద్రో బలేనేంద్రాయ దఘరింద్రయమ్||
రోజూ 11 సార్లు పఠించటం వల్ల సర్వశుభాలు కలుగుతాయి.
వీడియో వివరణ / Video Description
ఆడియో వివరణ / Audio Description