గమనిక: దైవదర్శనం కొరకు యాత్రికులు కనీసం ఒక రోజు ముందుగా అర్చకస్వామితో సంప్రదించండి. ప్రతి ఏట కొన్ని ఆలయాలలో అర్చక స్వాములు వంతులువారిగా మారుతుంటారు.
పినపళ్ళ గ్రామం / PINAPALLA VILLAGE
శ్రీ పార్వతీ సమేత నీలకంఠేశ్వర స్వామి
వృశ్చికరాశి, అనూరాధ నక్షత్రం (3వ పాదం)
పాద శివలింగ స్ధానం: చాళుక్యుల భీమ మండలం నందలి ద్రాక్షారామ క్షేత్రానికి తూర్పు దిశగా, సుమారు 24 kms. దూరాన పినపళ్ళ గ్రామం (Pinapalla) గ్రామం కలదు. వెదురుమూడి - కొత్తూరు రోడ్డు మార్గములో పినపళ్ళ బస్ స్టాప్ ఉంటుంది. పినపళ్ళ బస్ స్టాప్ కు సుమారు 500 మీటర్లు లోపలకి (ఉత్తరం దిశ) శ్రీ పార్వతీ సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయం ఉంది. శ్రీ నీలకంఠేశ్వర లింగము భీమసభ నందలి 108 శివ లింగాలలో ఒకటిగా ప్రతీతి.
ఆలయం: పినపళ్ళ గ్రామం లోని శ్రీ పార్వతీ సమేత శ్రీ నీలకంఠేశ్వరాలయం చాల ప్రాచీనమైనది. ఇది మార్కండేయ మహర్షి ప్రతిష్టగా చెప్పుబడుతుంది. కాల క్రమములో ఆలయం పునర్నిర్మాణము జరిగింది. ఆలయ ప్రాంగణములో ధ్వజ స్ధంబం, ప్రధానాలయం ఉంటాయి. ముఖ మండపం నందు నందీశ్వరుడు, అంతరాలయం నందు గణపతి, సుబ్రహ్మణ్య స్వామి కొలువైన్నారు. గర్భాలయం నందు శ్రీ నీలకంఠేశ్వర లింగము దర్శనమిస్తుంది. స్వామి వామ భాగం నందు శ్రీ పార్వతీ దేవి కొలువుదీరింది. ఆలయం నందు ప్రతి నిత్యం అర్చనలు, అభిషేకాలు, శాంతులు నిర్వహించుతారు. స్వామి వారి కళ్యాణం జ్యేష్ట శుద్ధ ఏకాదశి నాడు జరుగుతుంది. శ్రీ నీలకంఠేశ్వర లింగము అనూరాధ నక్షత్రం (3వ పాదం) చెందినది. అనూరాధ నక్షత్రం (3వ పాదం) నందు జన్మించిన వారికి శాంతులు నిర్వహించుతారు.
రవాణా సమాచారం: కాకినాడ - రావులపాలెం బస్సులు (via) కరప, మండపేట, గుమ్మిలేరు, కొత్తూరు సెంటర్ మీదగా ఉంటాయి.
రవాణా సమాచారం: కాకినాడ - కొత్తూరు సెంటర్ దూరం 52 Kms. కొత్తూరు సెంటర్ నుంచి వెదురుమూడి (Via) కొత్తూరు, పినపళ్ళ బస్ స్టాప్ మీదగా ఆటోలు ఉంటాయి. వీటి మధ్య దూరం సుమారు 3 Kms. మాత్రమే. పినపళ్ళ బస్ స్టాప్ నుంచి పినపళ్ళ గ్రామం కు ఆటోలు చాల తక్కువుగా దొరుకుతాయి. పినపళ్ళ బస్ స్టాప్ నుంచి పినపళ్ళ గ్రామం దూరం సుమారు 500 meters.
రవాణా సమాచారం: కాకినాడ - కత్తుంగ బస్సులు (via) ద్రాక్షారామం, వెదురుమూడి, కొత్తూరు, రావులపాలెం మీదగా ఉంటాయి. ఇవి చాల తక్కువుగా ఉంటాయి.
రవాణా సమాచారం: కొత్తూరు సెంటర్ నుంచి వెదురుమూడి (Via) కొత్తూరు, పినపళ్ళ బస్ స్టాప్ మీదగా ఆటోలు ఉంటాయి. వీటి మధ్య దూరం సుమారు 3 Kms. మాత్రమే. పినపళ్ళ బస్ స్టాప్ నుంచి పినపళ్ళ గ్రామం కు ఆటోలు చాల తక్కువుగా దొరుకుతాయి. పినపళ్ళ బస్ స్టాప్ నుంచి పినపళ్ళ గ్రామం దూరం సుమారు 500 meters.
అర్చక స్వామి: ఆలయ సమాచారం & Photos అందించిన పినపళ్ళ - శ్రీ నీలకంఠేశ్వరాలయం స్వామి, ఆలయ అర్చక స్వామి అయిన శ్రీ కొమాళ్ళపల్లి మహేశ్, సెల్ నెం. 94913 18406 మరియు శ్రీ సంతోష్ 94937 92294 గార్కి నా నమసుమాంజలి.
విజ్ఞప్తి: ద్రాక్షారామ - శ్రీ భీమేశ్వరాలయం యొక్క ఉత్తర ముఖద్వారం వద్ద శ్రీ రాజ రాజేశ్వరి పీఠం వారి నిత్యాన్నదానం సత్రం కలదు.దూర ప్రాంతములు నుంచి ఆలయాలు సందర్శనకు వచ్చిన యాత్రికులకు ఉచ్చిత అన్న ప్రసాదములు వితరణ జరుగును. భక్తులు ముందుగా అన్నప్రాసాదం కోసం ఫోనులో సంప్రాదించాలి.
వీరి Cell 83320 29544.
వీరు వాహనములు కూడ ఏర్పాటు చేస్తారు.
అనురాధ నక్షత్రం స్తోత్రం
నమో మిత్రస్య వరుణస్య చక్షసే మహోదేవాయత దృత్|
సపర్యత్ దూర్ దేశే దేశే దేవ జాతాయ కేతవే
దివసు పుత్రాయ సూర్యాయశ్ సత్||
రోజూ 11 సార్లు పఠించటం వల్ల సర్వశుభాలు కలుగుతాయి.