అష్టాదశ శక్తిపీఠాలు / Ashtadasa ShakthiPeetalu

దక్ష యజ్ఞం

లోక కళ్యాణం కోసం మహామునులు నైమిశారణ్యం నందు ఒక యుజ్ఞం తలపెట్టినారు.  ఆ యాగం నకు త్రిమూర్తులు, దేవతలు, ప్రజాపతులు, ఋషులు, దేవ ఋషులు మొదలగువారు వచ్చి, తమ పీఠములందు కూర్చుండిరి.  శివుడు తన మామగారు అయిన దక్షప్రజాపతి రాకను గౌరవించక పోవుటచే మామగారు కోపించి అల్లుడును దూషించుతాడు.

కొంత కాలమునకు దక్షప్రజాపతి ఒక యజ్ఞం తలపెట్టి, శివ దంపతులును మినహయించి మిగిలన బ్రహ్మది దేవతులును ఆహ్వానించుతాడు.  దక్షప్రజాపతి కుమార్తె అయిన దక్షాయిని (సతీదేవి)  మిక్కిలి దుఖించి,  పిలవని పేరంటానికి బయులు దేరుతుంది.  శివుడు ఆమె వెంట అరువది వేల రుద్ర గణములును తోడిచ్చి పంపుతాడు.

దక్షయజ్ఞ పీఠికను ప్రవేశించిన సతీదేవిని మరియు శివుడుని తండ్రి దక్షప్రజాపతి దూషించుతాడు.  తండ్రి  శివ దూషణ సహించలేని దక్షయిణి అగ్ని ప్రవేశం చేస్తుంది.  యోగ జ్ఞానంలో గ్రహించిన శివుడు, వీరభద్రుడు మరియు భద్రకాళిని సృష్టించి దక్షవాటికను నాశనం చేయుటకు ఆదేశించుతాడు.  పిమ్మట శివుడు ప్రళయ రుద్రుడై చితిలో దహనమవుతున్న సతీదేవి శరీరాన్ని భుజన మోసుకుంటూ ఉగ్ర తాండవం ఆరభించుతాడు.

లోక సంరక్షణార్ధమై శ్రీ మహావిష్ణువు తన సుదర్శనాన్ని ప్రయోగించి, సతీదేవి శరీరాన్ని చేదించుతాడు.  ఆమె శరీర ఖండాలు భూమి మీద పడి 108 శక్తి పీఠాలుగా వెలిసాయి.  వీటిలో 18 పీఠాలు మహా శక్తి పీఠాలుగా ప్రసిద్ధి చెందినాయి. అష్టాదశ శక్తి పీఠాల్లో ఒక్కటి శ్రీ లంక భూభాగంలో ఉండగా మిగిలనవి భారత భూభాగంలో ఉన్నాయి.  మన తెలుగు రాష్ట్రాల్లో 1 + 3 మహా శక్తి పీఠాలు కలవు.


Daksha Yajna

For the welfare of the world, the great sages planned a yugna at Naimisaranyam.  To that sacrifice the trimurtis, the gods, the prajapatis, the rishis, the deva rishis, etc., came and sat on their pedestals.  As Lord Shiva did not respect the arrival of his father-in-law Daksha Prajapati, the father-in-law got angry and abused the son-in-law.

After some time Daksha Prajapati performs a yajna and invites the remaining Brahmadi devas except shiva and the couple.  Dakshayini (Sati Devi), the daughter of Daksha Prajapati, is deeply grieved and leaves for an uninvited name.  Lord Shiva accompanies her with sixty thousand Rudra ganas and sends them away.

The father Daksha Prajapati abuses Sati and Lord Shiva who entered the preamble of the Daksha Yajna.  Dakshayini, who cannot tolerate the abuse of her father Shiva, enters the fire.  Realized in yogic knowledge, Lord Shiva creates Veerbhadra and Bhadrakali and orders the destruction of Dakshavatika.  Later, Lord Shiva becomes a pralaya rudra and carries the body of Sati, who is being burnt in the funeral pyre, on his shoulders and begins his wrath.

For the protection of the world, Sri Mahavishnu uses his Sudarshan and pierces the body of Goddess Sati.  The segments of her body fell to the ground and emerged as 108 shakti peethas.  Of these, 18 peethas are known as Maha Shakti Peethas. Of the Ashtadasa Shakti Peethas, one is in sri Lanka territory and the rest are in Indian territory.  There are 1 + 3 Maha Shakti Peethas in our Telugu states.