గమనిక: దైవదర్శనం కొరకు యాత్రికులు కనీసం ఒక రోజు ముందుగా అర్చకస్వామితో సంప్రదించండి. ప్రతి ఏట కొన్ని ఆలయాలలో అర్చక స్వాములు వంతులువారిగా మారుతుంటారు.

టేకి గ్రామం / TEKI VILLAGE

శ్రీ పార్వతీ సమేత సోమేశ్వర స్వామి

వృశ్చికరాశి, జ్యేష్ట నక్షత్రం (4వ పాదం)

పాద శివలింగ స్ధానం: చాళుక్యుల భీమ మండలం నందలి ద్రాక్షారామ క్షేత్రానికి నైఋతి దిశగా సుమారు 19 kms. దూరాన టేకి (Teki) అను గ్రామం కలదు. కొత్తూరు సెంటర్ - అంగర - కె గంగవరం రోడ్డు మార్గములో టేకి గ్రామం ఉంటుంది. ఇచ్చట శ్రీ సోమేశ్వర లింగమును దర్శించగలము. శ్రీ పార్వతీ సమేత సోమేశ్వర స్వామి వారి ఆలయం జ్యేష్ట నక్షత్రం (4వ పాదం) చెందినది. శ్రీ సోమేశ్వర లింగము భీమసభ నందలి 108 శివ లింగాలలో ఒకటిగా ప్రతీతి.

ఆలయం: శ్రీ పార్వతీ సమేత సోమేశ్వర స్వామి వారి ఆలయం చాల ప్రాచీనమైనది. కాల క్రమములో ఆలయం పునర్నిర్మాణము జరిగింది. ఆలయ ప్రాంగణములో ధ్వజస్ధంభం, చండీశ్వరాలయం, ముఖమండపం, గర్భాలయం ఉంటాయి. ఆలయ ప్రాంగణంలో సాయిబాబ, గణపతి, అయ్యప్ప, గాయత్రీదేవి, దత్తాత్రేయులు, ఆంజనేయస్వామి ఉపాలయాలు కూడ కలవు. నవగ్రహ మంటపము కూడా ఉంది. ఆలయ గోపుర శిఖరము నందు దేవతా మూర్తులు కలరు. శ్రీ సోమేశ్వర లింగం కి నిత్య అర్చనలు జరుగుతాయి. శ్రీ సోమేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవములు మాఘ శుద్ధ ఏకాదశి నుంచి పాంచాహ్నికంగా జరుగుతుంది. శరన్నవరాత్రులు ఘనంగా జరుగుతాయి. వృశ్చికరాశి జాతకులు, క్షేత్రం లోని శివాలయంలో అర్చన, అభిషేకములు భక్తితో నిర్వర్తించిన యెడల విశేష ఫలితములు పొందగలరని భక్తజనుల విశ్వాసము. అతి పురాతన శైవ క్షేత్రములలో ఒకటిగా ప్రసిద్ధి. టేకి క్షేత్రమునకు ఘన చరిత్ర గలదు. కణ్వ మహర్షి ఈ గ్రామం సమీపంలో గల నది వద్ద తపమాచరించినట్లు కథనం. దీనికి సంబంధించిన ఆనవాళ్ళు కూడా ఉన్నట్లుగా అర్చకస్వామి తెలియజేశారు. టేకి గ్రామం గుండా ప్రవహించు నదికి కణ్వనది అని పిలుస్తారు.

రవాణా సమాచారం: మండపేట నుంచి కోరుమిల్లి కి (Via) అంగర, టేకి, మాచర మీదగా బస్సులు ఉంటాయి. మండపేట నుండి ప్రతిరోజూ నాలుగు ట్రిప్పులు బస్సు సర్వీసు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు మండపేట నుంచి అంగర కు షేరింగ్ ఆటోలు ఉంటాయి. అంగర నుంచి టేకి కు షేరింగ్ ఆటోలు ఉంటాయి.

రవాణా సమాచారం: కాకినాడ నుంచి కోరుమిల్లి గ్రామం నకు (Via) గొల్లపాలెం, ద్రాక్షారామం, కె.గంగవరం, టేకి మీదగా బస్సులు ఉంటాయి.

రవాణా సమాచారం: కాకినాడ నుండి ప్రతిరోజూ నాలుగు ట్రిప్పులు బస్సు సర్వీసు అందుబాటులో ఉన్నాయి.

రవాణా సమాచారం: కాకినాడ - కత్తుంగ బస్సులు (via) ద్రాక్షారామం, టేకి, వెదురుమూడి, కొత్తూరు, రావులపాలెం మీదగా ఉంటాయి. ఇవి చాల తక్కువుగా ఉంటాయి.

అర్చక స్వామి: ఆలయ అర్చకులు శ్రీ ఎం.ఆర్. వి.వి.ఎస్. ఎస్. ఎస్. శర్మ సెల్: 99499 38156 & శ్రీ కొమాళ్ళపల్లి సుబ్రహ్మణ్యశర్మగారు సెల్: 99510 29060 సంప్రదించగలరు.

విజ్ఞప్తి: ద్రాక్షారామ - శ్రీ భీమేశ్వరాలయం యొక్క ఉత్తర ముఖద్వారం వద్ద శ్రీ రాజ రాజేశ్వరి పీఠం వారి నిత్యాన్నదానం సత్రం కలదు.దూర ప్రాంతములు నుంచి ఆలయాలు సందర్శనకు వచ్చిన యాత్రికులకు ఉచ్చిత అన్న ప్రసాదములు వితరణ జరుగును. భక్తులు ముందుగా అన్నప్రాసాదం కోసం ఫోనులో సంప్రాదించాలి.

వీరి Cell 83320 29544.

వీరు వాహనములు కూడ ఏర్పాటు చేస్తారు.

జ్యేష్ఠ నక్షత్రం స్తోత్రం

త్రాతార మింద్ర మవితార మింద్ర హవే హమ్‌ సుహవ|

శూరమింద్రమ్‌ హవయామి శక్రం పురహుతమింద్ర:

స్వాస్తినో మధ్యవాధా త్వింద్ర:||

రోజూ 11 సార్లు పఠించటం వల్ల సర్వశుభాలు కలుగుతాయి.