గమనిక: దైవదర్శనం కొరకు యాత్రికులు కనీసం ఒక రోజు ముందుగా అర్చకస్వామితో సంప్రదించండి. ప్రతి ఏట కొన్ని ఆలయాలలో అర్చక స్వాములు వంతులువారిగా మారుతుంటారు.
ఠాణేలంక గ్రామం / THANELANKA VILLAGE
శ్రీ పార్వతీ సమేత సోమేశ్వర స్వామి
కుంభ రాశి, పూర్వాభాద్ర నక్షత్రం (3వ పాదం)
పాద శివలింగ స్ధానం: చాళుక్యుల భీమ మండలం నందలి ద్రాక్షారామ క్షేత్రానికి ఆగ్నేయం దిశగా సుమారు 36Kms. దూరాన ఠాణేలంక (Thanelanka) అను గ్రామం కలదు. ఇచ్చట శ్రీ సోమేశ్వర లింగమును దర్శించగలము. శ్రీ పార్వతీ సమేత సోమేశ్వర స్వామి వారి ఆలయం పూర్వాభాద్ర నక్షత్రం (3వ పాదం) చెందినది. శ్రీ సోమేశ్వర లింగము భీమసభ నందలి 108 శివ లింగాలలో ఒకటిగా ప్రతీతి.
ఆలయం: శ్రీ భ్రమరాంబికా సమేత చౌడేశ్వర వారి ఆలయం చాల ప్రాచీనమైనది. కాల క్రమములో ఆలయం పునర్నిర్మాణము జరిగింది. ఆలయ ప్రాంగణములో ధ్వజస్ధంభం, చండీశ్వరాలయం, గణపతి, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, ఆంజనేయస్వామి, ముఖమండపం, అంతరాలయం, గర్భాలయం ఉంటాయి. ఆలయ గోపుర శిఖరము నందు దేవతా మూర్తులు కలరు. శ్రీ సోమేశ్వర లింగం కి నిత్య అర్చనలు జరుగుతాయి. శ్రీ పార్వతీ సమేత సోమేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవములు మాఘ శుద్ధ దశమి నుండి పాంచాహ్నికంగా జరుగుతుంది. శరన్నవరాత్రులు, గణపతి నవరాత్రులు, సుబ్రహ్మణ్యేశ్వరుని కళ్యాణము మరియు సుబ్బారాయుడు షష్టి నిర్వ హించబడతాయి. కుంభ రాశి జాతకులు, క్షేత్రం లోని శివాలయంలో అర్చన, అభిషేకములు భక్తితో నిర్వర్తించిన యెడల విశేష ఫలితములు పొందగలరని భక్తజనుల విశ్వాసము.
ఆలయం నందు తిరుగుడు నంది ఉంది. పూర్వం గ్రామంలో నిండు చూలాలు ప్రసవమునకు ఇబ్బంది పడుతున్న సమయంలో ఆమె భర్త యొక్క కోరికపై అర్చకులు తిరుగుడు నందిని ఆ స్త్రీ వున్న గృహం వైపునకు త్రిప్పిన యెడల సుఖ ప్రసవము అయ్యేదట!
రవాణా సమాచారం: అమలాపురం - కాకినాడ బస్సులు (Via) ముమ్మిడివరం, మురమళ్ళ, యానాం మీదగా ఉంటాయి. అమలాపురం - ముమ్మిడివరం మధ్య దూరం సుమారు 14 Kms.
* ముమ్మిడివరం నకు వాయువ్యం దిశగా సుమారు 3 Kms. దూరాన ఠాణేలంక గ్రామం ఉంది. ఇక్కడ శ్రీ పార్వతీ సమేత సోమేశ్వర స్వామి ఆలయం కలదు. ముమ్మిడివరం నుంచి ఠాణేలంక గ్రామం కు ఆటోలు ఉంటాయి.
రవాణా సమాచారం: ముక్తేశ్వరం నుంచి ముమ్మిడివరం కు ఆటోలు ఉంటాయి. వీటి మధ్య దూరం సుమారు 11Kms. ఆటోలు ఏర్పాట్టు చేసుకోవాలి.
రవాణా సమాచారం: ముక్తేశ్వరం నుంచి కొండలమ్మ చింత జంక్షన్ వరకు షేరింగ్ ఆటోలు ఉంటాయి. అమలాపురం - ముమ్మిడివరం రోడ్డు మార్గములో కొండలమ్మ చింత జంక్షన్ ఉంటుంది. కొండలమ్మ చింత జంక్షన్ నుంచి ముమ్మిడివరం కు షేరింగ్ ఆటోలు ఉంటాయి.
రవాణా సమాచారం: ద్రాక్షారామం - యానాం మరియు యానాం - ముమ్మిడివరం మధ్య బస్సులు కలవు.
అర్చక స్వామి: ఆలయ అర్చకస్వామి శ్రీ వెలవలపల్లి విశ్వనాథ శాస్రి, సెల్ నెం : 94921 83497 & 75698 60653 సంప్రదించగలరు. ఇతర అర్చక స్వాములు శ్రీ వెలవలపల్లి సత్యనారాయణ మూర్తి - 94907 98239, శ్రీ వెలవలపల్లి కిరణ్ కుమార్ - 94937 80060, శ్రీ వెంకట రామసోమయాజులు - 95502 81128.
విజ్ఞప్తి: ద్రాక్షారామ - శ్రీ భీమేశ్వరాలయం యొక్క ఉత్తర ముఖద్వారం వద్ద శ్రీ రాజ రాజేశ్వరి పీఠం వారి నిత్యాన్నదానం సత్రం కలదు.దూర ప్రాంతములు నుంచి ఆలయాలు సందర్శనకు వచ్చిన యాత్రికులకు ఉచ్చిత అన్న ప్రసాదములు వితరణ జరుగును. భక్తులు ముందుగా అన్నప్రాసాదం కోసం ఫోనులో సంప్రాదించాలి.
వీరి Cell 83320 29544.
వీరు వాహనములు కూడ ఏర్పాటు చేస్తారు.
పూర్వాభాద్ర నక్షత్రం స్తోత్రం
ఉతనో హిర్బుద్ధన్య నృణోత్వజ ఏకపాత్ పృథివీ సముద్ర:|
విశ్వేదేవారుతా వృధోహు వానా స్తుతా మంత్రా కవి శస్తా అవంతు||
రోజూ 11 సార్లు పఠించటం వల్ల సర్వశుభాలు కలుగుతాయి.
వీడియో వివరణ / Video Description
ఆడియో వివరణ / Audio Description