గమనిక: దైవదర్శనం కొరకు యాత్రికులు కనీసం ఒక రోజు ముందుగా అర్చకస్వామితో సంప్రదించండి. ప్రతి ఏట కొన్ని ఆలయాలలో అర్చక స్వాములు వంతులువారిగా మారుతుంటారు.

" అభిషేకాలు కన్నా శివ దర్శనం మిన్న "

బ్రహ్మపురి గ్రామం/ BRAHMAPURI VILLAGE

శ్రీ అన్నపూర్ణా సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి

మేషరాశి, అశ్వని నక్షత్రం (1వ పాదం)

పాద శివలింగ స్ధానం: చాళుక్యుల భీమ మండలం నందలి ద్రాక్షారామ క్షేత్రానికి ఆగ్నేయం దిశగా, సుమారు 17 kms. దూరాన, పావన గౌతమీ నదీ (గోదావరి) తీరాన బ్రహ్మపురి (Brahmapuri) అను గ్రామం ఉంది. క్షేత్రం నందు శ్రీ అన్నపూర్ణా సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి ఆలయం కలదు. రామచంద్ర పురం నుంచి బ్రహ్మపురి కి (Via) ద్రాక్షారామం మీదగా రోజుకు 2 సార్లు బస్సులు కలవు. యానాం నుంచి ఆటోలు ఉంటాయి.

ఆలయం: మన పురాణం ప్రకారం బ్రహ్మకు అయిదు తలలు ఉండేవి. పూర్ణవల్లీ కథలో బ్రహ్మదేవుని ఐదవ తలను శివుడు ఖండించినట్లగా ఉంది. ఒక రోజు బ్రహ్మదేవుడు, శివ రూపంలో కైలాసాన్ని సందర్శించడం జరిగింది. ఆ శివ రూపానికి పార్వతీ దేవి పాద పూజ చేయనారంభించింది. బ్రహ్మ కపటం రూపం గ్రహించిన శివుడు, బ్రహ్మ తలను ఖండించుతాడు. ఆ చర్య వలన శివునికి బ్రహ్మ హత్యాపాతకం ప్రాప్తి అయింది. బ్రహ్మ పుర్రె పట్టుకొని శివుడు పన్నెండు సంవత్సరాల పాటు బిక్షాటన చేసాడు. బ్రహ్మ హత్యాపాతకం నుంచి విముక్తి పొందుటకు శివుడు సకల పుణ్య తీర్ధాలలో స్నానం ఆచారించాడు. గౌతమీ నదీ పుణ్య ఫలంతో బ్రహ్మ హత్యాపాతకం నుంచి శివునికి విముక్తి కలిగింది. శివుని చేతిలోని బ్రహ్మ పుర్రె నదిలోకి జారింది. ఆ కారణముగా ఈ గౌతమీ నది తీర ప్రాంతమునకు "బ్రహ్మపుర్రె" అనే పేరు వచ్చింది. కాలక్రమేన పేరు మార్పుచెంది, బ్రహ్మపురిగా స్ధిర పడింది.

శ్రీ విశ్వేశ్వర లింగము భీమసభ నందలి 108 శివ లింగాల్లో ఒకటిగా ప్రతీతి. శ్రీ విశ్వేశ్వరాలయం నందలి శివలింగము స్వత సిద్ధంగా మూడు విభూతి రేఖలను మరియు మూడవ కన్నును కలిగియుండుట విశేషం. శ్రీ విశ్వేశ్వర లింగమును అర్చించిన వారికి సకల శుభములు కలుగును అని భక్తుల విశ్వాసం.

ఆలయ ప్రాంగణములో శ్రీ విశ్వేశ్వరాలయం మరియు శ్రీ కేశవ స్వామి ఆలయం ఉంటాయి. శ్రీ విశ్వేశ్వరాలయముకు గాలి గోపురం, ధ్వజస్తంభం, ముఖ మండపం, అంతరాలయం,గర్భాలయం ఉంటాయి. గర్భాలయం నందు శ్రీ విశ్వేశ్వర లింగము దర్శనమిస్తుంది. అంతరాలయం నందు గణపతి, సుబ్రహ్మణ్యడు, వీరభద్రుడు, అన్నపూర్ణా దేవి కొలువై ఉంటారు. ప్రతి నిత్యం శ్రీ విశ్వేశ్వర స్వామికి అర్చనలు, అభిషేకాలు, శాంతులు నిర్వహించుతారు. స్వామి కృపతో సుఖ, సంతోష, ఆయురోగ్య, విజయ, ఐశ్వర్య, భోగ భాగ్యములు కలుగుతాయి.

రవాణా సమాచారం 1: ద్రాక్షారామం నకు సుమారు 21 kms. దూరాన యానాం అను పట్టణం ఉంది. రాజమండ్రి నుంచి యానాం పోవు బస్సులు (Via) రామచంద్రాపురం, ద్రాక్షారామం, కోలంక, ఇంజరం మీదగా ప్రతి గంటకు ఉంటాయి. కోలంక మరియు ఇంజరం నుంచి బ్రహ్మపురి గ్రామం నకు రోడ్డు మార్గములున్నాయి.

రవాణా సమాచారం 2: యానాం నుంచి బ్రహ్మపురి గ్రామం నకు ఆటోలు ఉంటాయి. వీటి మధ్య దూరం సుమారు 8 kms. యానాం బైపాస్ రోడ్ (Sri Ravi Junior & Degree College, Near Yanam Bi Pass road, Sunkarapalem, Andhra Pradesh) నుంచి బ్రహ్మపురి గ్రామం నకు గోదావరి గట్టు మీదగా ఆటోలు ఉంటాయి. షేరింగ్ ఆటోలు చాల తక్కువుగా ఉంటాయి. ఆటో రాను - పోను ఏర్పాట్లు చేసుకోవాలి.

ఇచ్చట బ్రహ్మపురి కి ఆటోలు చాల తక్కువుగా దొరుకుతాయి. ఆటో రాను - పోను ఏర్పాట్లు చేసుకోవాలి

అర్చక స్వామి: మాకు సహకరించిన బ్రహ్మపురి అర్చక స్వామి శ్రీ కొండూరి విశ్వేశ్వర శర్మ, సెల్ నెం. 9110507705, 97045 28300 గార్కి నా నమసుమాంజలి.

విజ్ఞప్తి: ద్రాక్షారామ - శ్రీ భీమేశ్వరాలయం యొక్క ఉత్తర ముఖద్వారం వద్ద శ్రీ రాజ రాజేశ్వరి పీఠం వారి నిత్యాన్నదానం సత్రం కలదు. దూర ప్రాంతములు నుంచి ఆలయాలు సందర్శనకు వచ్చిన యాత్రికులకు ఉచ్చిత అన్న ప్రసాదములు వితరణ జరుగును. భక్తులు ముందుగా అన్నప్రాసాదం కోసం ఫోనులో సంప్రాదించాలి.

వీరి Cell 83320 29544.

వీరు వాహనములు కూడ ఏర్పాటు చేస్తారు.

అశ్వని నక్షత్రం స్తోత్రం

అశ్వినా తేజసాచక్షు: ప్రాణన సరస్వతీ వీర్యమ్‌|

వాచేంద్రో బలేనేంద్రాయ దఘరింద్రయమ్‌||

రోజూ 11 సార్లు పఠించటం వల్ల సర్వశుభాలు కలుగుతాయి.

వీడియో వివరణ / Video Description

ఆడియో వివరణ / Audio Description