గమనిక: దైవదర్శనం కొరకు యాత్రికులు కనీసం ఒక రోజు ముందుగా అర్చకస్వామితో సంప్రదించండి. ప్రతి ఏట కొన్ని ఆలయాలలో అర్చక స్వాములు వంతులువారిగా మారుతుంటారు.

పందలపాక గ్రామం / PANDALAPAKA VILLAGE

శ్రీ పార్వతీ సమేత సోమేశ్వర స్వామి

సింహరాశి, ఉత్తర నక్షత్రం (1వ పాదం)

పాద శివలింగ స్ధానం: చాళుక్యుల భీమ మండలం నందలి ద్రాక్షారామ క్షేత్రానికి వాయువ్యం దిశగా, సుమారు 21 kms. దూరాన, పందలపాక (Pandalapaka) గ్రామం ఉంటుంది. ఇది తూర్పు గోదావరి జిల్లా, బిక్కవోలు మండలంకు చెందినది. పందలపాక నందు శ్రీ పార్వతీ సమేత సోమేశ్వర స్వామి (శివాలయం) కలదు. శ్రీ సోమేశ్వర లింగము భీమసభ నందలి 108 శివ లింగాలలో ఒకటిగా ప్రతీతి.

ఆలయం: ఆలయం చాల ప్రాచీనమైనది. ఆలయ ప్రాంగణములో శ్రీదేవి, భూదేవి సమేత కేశవస్వామివారి ఆలయం, శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి వారి ఆలయం, నవగ్రహ మంటపము, చండీశ్వరాలయం కూడ కలవు. శ్రీ సోమేశ్వర స్వామికి నిత్య అర్చనలు జరుగుతాయి. స్వామివారి కళ్యాణోత్సవములు ఫాల్గుణ శుద్ధ ఏకాదశి నాడు పాంచాహ్నికంగా జరుగుతుంది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి కళ్యాణోత్సవము కూడ పాంచాహ్నికంగా జరపుతారు. శరన్నవ రాత్రులు, గణపతి నవరాత్రులు వైభవోపేతంగా జరుగుతాయి. సింహరాశి జాతకులు, క్షేత్రం లోని శివాలయంలో అర్చన, అభిషేకములు భక్తితో నిర్వర్తించిన యెడల విశేష ఫలితములు పొందగలరని భక్తజనుల విశ్వాసము. నదీ తీరాన మరో శివాలయం కలదు.

రవాణా సమాచారం: రామచంద్రపురం - అనపర్తి బస్సులు (Via) రాయవరం, తొస్సిపూడి మీదగా ఉంటాయి. తొస్సిపూడి వంతెన నుంచి పందలపాక గ్రామం నకు ఆటోలు ఉంటాయి. వీటి మధ్య దూరం సుమారు 2 కీల్లో మిటార్లుగా ఉంటుంది.

అర్చక స్వామి: ఆలయ అర్చకులు శ్రీ చంద్రమౌళి కామేశ్వర శర్మ, సెల్ నెం : 99510 24439 సంప్రదించగలరు. 

విజ్ఞప్తి: ద్రాక్షారామ - శ్రీ భీమేశ్వరాలయం యొక్క ఉత్తర ముఖద్వారం వద్ద శ్రీ రాజ రాజేశ్వరి పీఠం వారి నిత్యాన్నదానం సత్రం కలదు. దూర ప్రాంతములు నుంచి ఆలయాలు సందర్శనకు వచ్చిన యాత్రికులకు ఉచ్చిత అన్న ప్రసాదములు వితరణ జరుగును. భక్తులు ముందుగా అన్నప్రాసాదం కోసం ఫోనులో సంప్రాదించాలి.

వీరి Cell 83320 29544.

వీరు వాహనములు కూడ ఏర్పాటు చేస్తారు.

ఉత్తర నక్షత్రం స్తోత్రం

దేవావ ధ్వర్యూశ్చ గతాస్థేన సూర్యాత్వచా మధ్వాయణం|

సమంజాథో తం ప్రత్నయాయం వినాశ్చిత్రం దేవానామ్‌||

రోజూ 11 సార్లు పఠించటం వల్ల సర్వశుభాలు కలుగుతాయి.