గమనిక: దైవదర్శనం కొరకు యాత్రికులు కనీసం ఒక రోజు ముందుగా అర్చకస్వామితో సంప్రదించండి. ప్రతి ఏట కొన్ని ఆలయాలలో అర్చక స్వాములు వంతులువారిగా మారుతుంటారు.
కూరాడ గ్రామం / KURAADA VILLAGE
శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వరస్వామి
మిధునరాశి, ఆరుద్ర నక్షత్రం (4వ పాదం)
పాద శివలింగ స్ధానం: చాళుక్యుల భీమ మండలం నందలి ద్రాక్షారామ క్షేత్రానికి ఈశాన్యం దిశగా, సుమారు 18 kms. దూరాన, కూరాడ గ్రామం (Kurada) కలదు. రామచంద్రపురం - కాకినాడ రోడ్డు మార్గములో వేళంగి గ్రామం ఉంటుంది. వేళంగి గ్రామములో కూరాడ సెంటర్ ఉంటుంది. వేళంగి (కూరాడ సెంటర్) కు ఈశాన్యం దిశగా, సుమారు 02 kms. దూరాన, కూరాడ గ్రామం ఉంటుంది. కూరాడ గ్రామ పంచాయితీ ఆఫీస్ సమీపంలో శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వరస్వామి వారి శివాలయం ఉంటుంది. శ్రీ వీరేశ్వర లింగము, ఆరుద్ర నక్షత్రం (4వ పాదం) చెందినది. ఆరుద్ర నక్షత్రం నందలి 4వ పాదము లో జన్మంచిన వారికి శాంతులు నిర్వహించుతారు. శ్రీ వీరేశ్వర లింగము భీమసభ నందలి 108 శివ లింగాలలో ఒకటిగా ప్రతీతి.
ఆలయం: కూరాడ గ్రామం లో శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వరస్వామి ఆలయం చాల ప్రాచీనమైనది. కాల క్రమంలో భక్తులు ఆలయం పునర్నిర్మాణము జరిపించారు. ఆలయ ప్రాంగణము విశాలముగా ఉంటుంది. ఆలయ ప్రాంగణములో ధ్వజ స్ధంబం, నందీశ్వరుడు, ప్రధానాలయం, చండీశ్వరుడు మొదలగునవి దర్శనమిస్తాయి. ప్రధానాలయం పశ్చిమాభిముఖంగా ఉంటుంది. మండపం నందు ద్వారపాలకులు దర్శనమిస్తారు. ముఖ మండపం నందు శ్రీ భద్రకాళి అమ్మ వారి సన్నిధి ఉత్తర ముఖంగా ఉంటుంది. శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి సన్నిధి దక్షిణ ముఖంగా ఉంటుంది. అంతరాలయం నందు శ్రీ గణపతి స్వామి వారి దర్శనం లభ్యమవుతుంది. గర్భాలయం నందు శ్రీ వీరేశ్వర స్వామి కొలువుదీరినారు. మూల విరాట్టుతో పాటు ఉత్సవమూర్తులు కూడ దర్శనమిస్తారు.
ఆలయం నందు ప్రతి నిత్యం అర్చనలు, అభిషేకాలు, శాంతులు నిర్వహించుతారు. స్వామి వారి వార్షిక కళ్యాణం వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు జరుగుతుంది. మహాశివరాత్రి చాల వైభవంగా జరుగుతుంది. ప్రతి మాస శివరాత్రికి విశేష పూజలు ఉంటాయి. కార్తీక మాసంలో విశేష పూజలు, అభిషేకాలు జరుగుతాయి. కార్తీక పౌర్ణమి నాడు జ్వాలా తోరణము జరుపుతారు. శరన్నవరాత్రులు, సుబ్బారాయుడు షష్ఠి వేడుకులు వైభవంగా జరుగుతాయి. ఆలయం నందు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కి విశిష్ట స్ధానం ఉంది. ప్రతి మంగళవారం మరియు శనివారం నాడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కి అభిషేకాలు విశేముగా ఉంటాయి. సంతానం కోసం మరియు యువతి/ యువకులు వివాహం కోసం శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించుతారు. ఆలయం నందు శ్రీ గణపతి స్వామి కి విశిష్టత కలదు. భక్తులు భక్తి శ్రద్ధలతో శ్రీ గణపతి స్వామిని ఆరాధించుతారు. స్వామికి నైవేద్యముగా బెల్లం ముక్కను సమర్పించుట ఆచారంగా వస్తుంది. శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వరస్వామి వారి కృపతో సుఖ, సంతోష, ఆయురోగ్య, విజయ, ఐశ్వర్య, భోగ భాగ్యములు కలుగుతాయి.
శ్రీ వీరేశ్వర లింగము ఆరుద్ర నక్షత్రము నందలి 4వ పాదము నకు చెందినది. ఆరుద్ర నక్షత్రము 4వ పాదములో జన్మించిన శిశువు వలన తల్లికి దోషము కలుగను. వాటిని నివారించుటకు ఆలయం నందు అభిషేక శాంతులు నిర్వహించుతారు. నక్షత్ర శాంతి కోసం ఆలయ అర్చక స్వామి శ్రీ దొంతికుర్తి నాగబాబు, సెల్ నెం. 8978625124 వారిని ముందుగా సంప్రదించగలరు.
రవాణా సమాచారం 1: ద్రాక్షారామం నకు వాయువ్య దిశగా, సుమారు 7 kms. దూరంలో రామచంద్రాపురం RTC బస్ స్టాండ్ ఉంటుంది. ద్రాక్షారామం నుంచి రామచంద్రాపురం నకు బస్సులు / ఆటోలు దొరుకుతాయి.
రవాణా సమాచారం 2:రామచంద్రాపురం బస్ స్టాండ్ నుంచి కాకినాడ కు బస్సులు చాల ఎక్కువుగా దొరుకుతాయి. రామచంద్రాపురం - కాకినాడ బస్సులు (via) వేళంగి, వేములవాడ, కరప మీదగా ఉంటాయి. యాత్రికులు వేలంగి (కూరాడ సెంటర్) బస్ స్టేజి దిగాలి. ఈ బస్ స్టేజిని నిత్యనందాపురం అని కూడ పిలుస్తారు.
రవాణా సమాచారం 3:వేళంగి (కూరాడ సెంటర్) బస్ స్టాప్ నుంచి కూరాడ గ్రామం నకు రోడ్డు ఉంది. వేళంగి (కూరాడ సెంటర్) బస్ స్టాప్ నుంచి కూరాడ గ్రామం దూరం సుమారు 02 Kms. వీటి మధ్య ఆటోలు మాత్రమే ఉంటాయి.
అర్చక స్వామి: శ్రీ దొంతికుర్తి నాగబాబు, సెల్ నెం. 8978625124
ఆలయ సమాచారం & Photos అందించిన శ్రీ చంద్రమౌళి దినకర్, హైదరాబాద్ గార్కి నా నమసుమాంజలి.
విజ్ఞప్తి: ద్రాక్షారామ - శ్రీ భీమేశ్వరాలయం యొక్క ఉత్తర ముఖద్వారం వద్ద శ్రీ రాజ రాజేశ్వరి పీఠం వారి నిత్యాన్నదానం సత్రం కలదు. దూర ప్రాంతములు నుంచి ఆలయాలు సందర్శనకు వచ్చిన యాత్రికులకు ఉచ్చిత అన్న ప్రసాదములు వితరణ జరుగును. భక్తులు ముందుగా అన్నప్రాసాదం కోసం ఫోనులో సంప్రాదించాలి.
వీరి Cell 83320 29544.
వీరు వాహనములు కూడ ఏర్పాటు చేస్తారు.
ఆరుద్ర నక్షత్రం స్తోత్రం
నమస్తే రుద్ర మానవ్య ఉతో త ఇషవరె నమ:
బాహుభ్యా ముమతే నమ:
రోజూ 11 సార్లు పఠించటం వల్ల సర్వశుభాలు కలుగుతాయి.