గమనిక: దైవదర్శనం కొరకు యాత్రికులు కనీసం ఒక రోజు ముందుగా అర్చకస్వామితో సంప్రదించండి. ప్రతి ఏట కొన్ని ఆలయాలలో అర్చక స్వాములు వంతులువారిగా మారుతుంటారు.

చెల్లూరు గ్రామం / CHELLURU VILLAGE

శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత అగస్త్యేశ్వర స్వామి

తులరాశి, చిత్త నక్షత్రం (3వ పాదం)

పాద శివలింగ స్ధానం: చాళుక్యుల భీమ మండలం నందలి ద్రాక్షారామ క్షేత్రానికి వాయువ్యం దిశగా, సుమారు 10 kms. దూరాన, చెల్లూరు (Chelluru) గ్రామం ఉంటుంది. ఇది తూర్పు గోదావరి జిల్లా, రాయవరం మండలంకు చెందినది. చెల్లూరు నందు శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత అగస్త్యేశ్వరస్వామి (శివాలయం) కలదు. శ్రీ అగస్త్వేశ్వర లింగము భీమసభ నందలి 108 శివ లింగాలలో ఒకటిగా ప్రతీతి. అగస్త్య మహర్షి ప్రతిష్టించిన పంచ అగస్త్యేశ్వర ఆలయ కూటమిలో చెల్లూరు క్షేత్రం ఒకటి (మండపేట, తాపేశ్వరం, అర్తమూరు, వల్లూరు క్షేత్రాలు మిగిలిన ప్రతిష్టలు).

ఆలయం: శివాలయం చాల ప్రాచీనమైనది. పునర్నిర్మాణము జరిగింది. మూడు అంతస్ధుల గాలి గోపురం క్రింద నుంచి ఆలయ ప్రవేశం జరుగుతుంది. ఆలయ ప్రాంగణములో నీలకంఠేశ్వర లింగము, ధ్వజస్ధంభం, చండీశ్వరాలయం, ముఖమండపం, అంతరాలయం, గర్భాలయం ఉంటాయి. ఆలయ గోపుర శిఖరము నందు దేవత మూర్తులు కలరు. ముఖమండపం నందు నందీశ్వరుడు, ద్వారపాలకులు కలరు. గర్భాలయం నందు శ్రీ అగస్త్యేశ్వర స్వామి కలరు. అమ్మవారు శ్రీ బాలాత్రిపురసుందరీదేవి, గణపతి కలరు. నవగ్రహ మంటపము కూడ ఉంది. శ్రీ అగస్త్వేశ్వర స్వామికి నిత్య అర్చనలు జరుగుతాయి. స్వామి వారి కళ్యాణోత్సవములు పాంచాహ్నికంగా జరుగుతుంది. శరన్నవరాత్రులు, గణపతి నవరాత్రులు మరియు సుబ్రహ్మణ్యషష్ఠి ఘనంగా జరుగుతాయి. తులరాశి జాతకులు, క్షేత్రం లోని శివాలయంలో అర్చన, అభిషేకములు భక్తితో నిర్వర్తించిన యెడల విశేష ఫలితములు పొందగలరని భక్తజనుల విశ్వాసము.

రవాణా సమాచారం 1: రామచంద్రపురం నుంచి వాకతిప్ప బస్సులు (వయా) చెల్లూరు మీదగా ఉంటాయి. చెల్లూరు బస్ స్టాప్ కు సమీపంలో శివాలయం ఉంటుంది.

రవాణా సమాచారం 2 : రామచంద్రపురం - చెల్లూరు ఆటోలు (వయా) పసలపూడి (వంతెన) మీదగా ఉంటాయి. రామచంద్రపురం (రాజగోపాల సెంటర్) నుంచి చెల్లూరు కు దొరుకుతాయి.

అర్చక స్వామి: ఆలయ అర్చకులు శ్రీ యలమంచలి సాయి ప్రసాద్, సెల్ నెం: 99595 06650 సంప్రదించగలరు.

విజ్ఞప్తి: ద్రాక్షారామ - శ్రీ భీమేశ్వరాలయం యొక్క ఉత్తర ముఖద్వారం వద్ద శ్రీ రాజ రాజేశ్వరి పీఠం వారి నిత్యాన్నదానం సత్రం కలదు. దూర ప్రాంతములు నుంచి ఆలయాలు సందర్శనకు వచ్చిన యాత్రికులకు ఉచ్చిత అన్న ప్రసాదములు వితరణ జరుగును. భక్తులు ముందుగా అన్నప్రాసాదం కోసం ఫోనులో సంప్రాదించాలి.

వీరి Cell 83320 29544.

వీరు వాహనములు కూడ ఏర్పాటు చేస్తారు.

చిత్త నక్షత్రం స్తోత్రం

త్వష్టా తురీయో అద్భుత ఇంద్రాగ్నీ పుష్టిర్వర్ధనమ్‌|

ద్విపద ఛందా ఇంద్రాయముక్షా గౌత్ర వయోదధ:||

రోజూ 11 సార్లు పఠించటం వల్ల సర్వశుభాలు కలుగుతాయి.